ఇంగ్లండ్‌ గడ్డపై ఇరగదీస్తున్న కుల్దీప్‌ యాదవ్‌ | Kuldeep Yadav dismisses Ben Stokes in One-Day Cup clash against Durham | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ గడ్డపై ఇరగదీస్తున్న కుల్దీప్‌ యాదవ్‌

Aug 1 2026 7:43 AM | Updated on Aug 1 2026 8:38 AM

Kuldeep Yadav dismisses Ben Stokes in One-Day Cup clash against Durham

భారత జెర్సీలో కుల్దీప్‌ యాదవ్‌

ఇంగ్లండ్ డొమాస్టిక్ వన్డే కప్-2026లో భారత చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో యార్క్‌షైర్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కుల్దీప్‌.. ప్రతీ మ్యాచ్‌లోనూ తన స్పిన్ మయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాడు. తాజాగా డర్హామ్‌తో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో అతడు మ్యాచ్ విన్నింగ్ స్పెల్ బౌలింగ్ చేశాడు. 

తన 10 ఓవర్ల కోటాలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌, డర్హామ్ లెజెండ్ బెన్ స్టోక్స్‌ను కుల్దీప్‌ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. ఈ భారత స్టార్ స్పిన్నర్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి స్టోక్స్ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో కుల్దీప్ బౌలింగ్‌లోనే రివర్స్ స్వీప్ షాట్‌కు ప్రయత్నించి స్టోక్స్ ఔటయ్యాడు. 

షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జార్జ్ హిల్ చేతిలోకి వెళ్లింది. స్టోక్స్ 39 బంతుల్లో కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. స్టోక్స్‌ ఔటైన తర్వాత  డర్హామ్ వికెట్ల పతనం మొదలైంది. 48.1 ఓవర్లలో కేవలం 165 పరుగులకే డర్హామ్ కుప్పకూలింది. 

యార్క్‌షైర్ బౌలర్లలో బెంజమిన్ క్లిఫ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్‌తో పాటు డొమానిక్‌ బీస్‌ చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం ఈ లక్ష్యాన్ని యార్క్‌షైర్‌ 41 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. జేమ్స్ వార్టన్(68 నాటౌట్‌), వైట్‌మాన్‌(52 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీలతో మ్యాచ్‌ ఫినిష్‌ చేశారు.

కాగా కుల్దీప్ ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడి 8 వికెట్లు పడగొట్టాడు. మరో మ్యాచ్ ఆడి అతడు తిరిగి  భారత్‌కు పయనం కానున్నాడు. శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కుల్దీప్ సభ్యునిగా ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement