నెదర్లాండ్స్‌కు భారత్‌ షాక్‌  | Indian Mens Hockey Team defeats Netherlands | Sakshi
Sakshi News home page

నెదర్లాండ్స్‌కు భారత్‌ షాక్‌ 

Jun 22 2026 6:05 AM | Updated on Jun 22 2026 6:05 AM

Indian Mens Hockey Team defeats Netherlands

రోటర్‌డామ్‌: ప్రొ లీగ్‌ హాకీ టోర్నిలో భారత పురుషుల జట్టు మరో సంచలనం నమోదు చేసింది. ఆదివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 3–2తో ప్రపంచ రెండో ర్యాంక్‌ నెదర్లాండ్స్‌ జట్టును ఓడించింది. మూడేళ్ల తర్వాత నెదర్లాండ్స్‌పై భారత్‌ నెగ్గడం విశేషం. భారత్‌ తరఫున జుగ్‌రాజ్‌ సింగ్‌ (18వ నిమిషంలో), అభిషేక్‌ (27వ నిమిషంలో), రాజిందర్‌ సింగ్‌ (56వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. నెదర్లాండ్స్‌ జట్టుకు హెజ్డెన్‌ (19వ నిమిషంలో), బిజెన్‌ (59వ నిమిషంలో) ఒక్కో గోల్‌ అందించారు. ఈ లీగ్‌లో 12 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత జట్టు 10 పాయింట్లతో 8వ స్థానంలో ఉంది. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో మంగళవారం లండన్‌ వేదికగా పాకిస్తాన్‌ జట్టుతో ఆడుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement