స్వదేశానికి రషీద్‌ ఖాన్‌.. జింబాబ్వే ఆల్‌రౌండర్‌కు జాక్‌పాట్‌! | Rashid Khan Leaves The Hundred Due To Afghanistan Series, Sikandar Raza Joins MI London, More Details Inside | Sakshi
Sakshi News home page

Hundred Men's: స్వదేశానికి రషీద్‌ ఖాన్‌.. జింబాబ్వే ఆల్‌రౌండర్‌కు జాక్‌పాట్‌!

Aug 6 2026 9:00 AM | Updated on Aug 6 2026 10:59 AM

Rashid Khan-Left-Hundred Mens-MI London Replace Sikandar-Raza

Photo Credit: Twitter

జింబాబ్వే స్టార్‌ ఆల్‌రౌండ‌ర్‌ సికంద‌ర్ ర‌జా హండ్రెడ్ కాంపిటీష‌న్‌లో బంప‌రాఫ‌ర్ కొట్టేశాడు. ఐర్లాండ్‌తో వ‌న్డే సిరీస్ కార‌ణంగా అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ ఎంఐ లండ‌న్‌ను వీడాడు. దీంతో ర‌షీద్ ఖాన్ స్థానంలో సికంద‌ర్ ర‌జాను తాత్కాలిక విదేశీ ఆట‌గాడిగా ఎంపిక చేసిన‌ట్లు ఎంఐ లండ‌న్ ఫ్రాంచైజీ తెలిపింది. 

ఐర్లాండ్‌తో సిరీస్ కోసం ర‌షీద్ వెళ్లిపోవ‌డంతో ర‌జాతో ఒప్పందం కుదుర్చుకున్న ఎంఐ లండ‌న్ మిగ‌తా మ్యాచ్‌లకు అత‌డిని అందుబాటులో ఉండాల‌ని కోరింది. దీనికి సికంద‌ర్ ర‌జా కూడా ఒప్పుకున్న‌ట్లు స‌మాచారం. ఇదే విష‌యాన్ని ఎంఐ లండ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో పంచుకుంది. 

'ర‌షీద్ ఖాన్ స్థానంలో తాత్కాలిక ఆట‌గాడిగా జింబాబ్వే ఆల్‌రౌండ‌ర్ సికంద‌ర్ ర‌జాను ఎంపిక చేశాం. ర‌షీద్ స్థానంలో మిగిలిన మ్యాచ్‌ల‌ను సికంద‌ర్ ర‌జా ఆడనున్నాడు. ఎంఐ లండ‌న్‌లోకి నీకు స్వాగ‌తం రజా' అని తెలిపింది. ఇక హండ్రెడ్ టోర్నీలో చాంపియ‌న్‌గా నిల‌వాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతున్న ఎంఐ లండ‌న్ జ‌ట్టులో సికంద‌ర్ ర‌జా చేరిక‌తో మిడిలార్డ‌ర్ బ‌లోపేతం కావ‌డంతో పాటు అత‌డి స్పిన్ సేవ‌లు జ‌ట్టుకు ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌నుంద‌ని చెప్పొచ్చు.

ఇక సికంద‌ర్ ర‌జా స్వ‌దేశంలో బంగ్లాదేశ్‌, భార‌త్‌ల‌తో జ‌రిగిన వైట్‌బాల్ సిరీస్ అనంత‌రం వైటాలిటీ బ్లాస్ట్ టోర్నీలో పాల్గొన్నాడు. టోర్నీలో వోర్సెస్ట‌ర్‌షైర్ త‌ర‌ఫున ఆడిన సికంద‌ర్ ర‌జా తొమ్మిది మ్యాచ్‌లాడి 258 ప‌రుగులు చేయ‌డంతో పాటు 9 వికెట్లు ప‌డ‌గొట్టాడు. తాజాగా ఎంఐ లండ‌న్ ప్రాంచైజీ నుంచి పిలుపు రావ‌డంతో సికంద‌ర్ ర‌జా హండ్రెడ్ టోర్నీ ఆడేందుకు లండ‌న్‌కు చేరుకున్నాడు. 

ఇటీవ‌లి కాలంలో టీ20 క్రికెట్‌లో సికంద‌ర్ ర‌జా బెస్ట్ ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌బ‌రుస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 376 టీ20 మ్యాచ్‌లాడిన సికంద‌ర్ ర‌జా 136 స్ట్రైక్‌రేట్‌తో 7,609 ప‌రుగులు సాధించాడు. ఇక త‌న ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో 255 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ ఏడాది ప్రారంభంలో జ‌రిగిన ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌న సార‌థ్యంలోనే జింబాబ్వే సూప‌ర్‌-6 స్టేజీలో అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా నాకౌట్ స్టేజీల్లో సికంద‌ర్ ర‌జాకు మంచి రికార్డు ఉంది.

Read: విండీస్‌పై పాక్ విజ‌యం.. డ‌బ్ల్యూటీసీ లెక్క‌లు తారుమారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement