‘ద్రవిడ్‌ వద్దన్నాడు.. యువీ ఉంటే నా షర్ట్‌ విప్పేసేవాడు’ | Harbhajan Singh Reveals Rahul Dravid Stopped Him From Removing Shirt in 2002 NatWest Final | Sakshi
Sakshi News home page

‘ద్రవిడ్‌ వద్దన్నాడు.. యువీ ఉంటే నా షర్ట్‌ విప్పేసేవాడు’

Aug 8 2026 4:38 PM | Updated on Aug 8 2026 5:10 PM

Dravid did not let me Do: Harbhajan revelation Of 2002 NatWest Trophy final

ఫైల్‌ ఫొటో (PC: BCCI/X)

ఇంగ్లండ్‌ గడ్డ మీద టీమిండియా సాధించిన చిరస్మరణీయ విజయాల్లో నాట్‌వెస్ట్‌ ట్రోఫీ ఫైనల్‌-2002కు ప్రత్యేక స్థానం ఉంది. ఇంగ్లండ్‌- భారత్‌- శ్రీలంక మధ్య జరిగిన ఈ ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లిష్‌ జట్టు, టీమిండియా టైటిల్‌ పోరుకు అర్హత సాధించాయి.

గెలిపించిన కైఫ్‌
క్రికెట్‌ పుట్టినిల్లు లండన్‌లోని లార్డ్స్‌ మైదానంలో నువ్వా- నేనా అన్నట్లుగా సాగిన ఫైనల్లో టీమిండియా ఇంగ్లండ్‌ను రెండు వికెట్ల తేడాతో ఓడించింది. ఇంగ్లండ్‌ విధించిన 326 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు బంతులు ఉండగానే ఛేదించింది. నాటి ఫైనల్లో మహ్మద్‌ కైఫ్‌ 75 బంతుల్లోనే 87 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌ను గెలిపించాడు.

గంగూలీ మెరుపులు.. రాణించిన సెహ్వాగ్‌, యువీ 
ఇక ఓపెనర్లు వీరేందర్‌ సెహ్వాగ్‌ 45 పరుగులు చేయగా.. కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ (43 బంతుల్లో 60) మెరుపులు మెరిపించాడు. ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ కూడా అర్ధ శతకం (69)తో రాణించాడు. కాగా లార్డ్స్‌లో ఈ విజయంతో టీమిండియా సంబరాలు అంబరాన్నంటాయి.

బాల్కనీలో ఉన్న కెప్టెన్‌ గంగూలీ షర్టు విప్పేసి మరీ దూకుడుగా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఆ ఫొటో విరివిగా వైరల్‌ అయింది. తాజాగా ఈ విషయం గురించి గుర్తుచేసుకున్న భారత స్పిన్‌ దిగ్గజం హర్భజన్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ద్రవిడ్‌ వద్దన్నాడు.. యువీ ఉంటే నా షర్ట్‌ విప్పేసేవాడు
చీకీ సింగిల్స్‌ ఎపిసోడ్‌లో మాట్లాడుతూ.. ‘‘ఆరోజు నేను షర్టు విప్పకుండా రాహుల్‌ ద్రవిడ్‌ ఆపాడు. వద్దని వారించాడు. ఒకవేళ నేను గనుక నా జెర్సీ విప్పేసి ఉంటే.. గంగూలీ మాదిరే నా ఫొటో కూడా వైరల్‌ అయ్యేది.

గంగూలీ తర్వాత నేను కూడా అదే పని చేద్దామనుకున్నాను. దేవుడి దయ వల్ల అప్పుడు నా పక్కన ద్రవిడ్‌ ఉండి.. నన్ను వారించాడు. ఒకవేళ ద్రవిడ్‌ కాకుండా ఆరోజు యువరాజ్‌ సింగ్‌ నా పక్కన ఉండి ఉండే.. తనే నా షర్టు విప్పేసేవాడు. ఏదేమైనా ద్రవిడ్‌కు నేను రుణపడి ఉంటాను’’ అని భజ్జీ సరదాగా వ్యాఖ్యానించాడు.

కాగా నాట్‌వెస్ట్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో హర్భజన్‌ సింగ్‌ పది ఓవర్ల బౌలింగ్‌లో 53 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. బ్యాటింగ్‌లో ఎనిమిదో స్థానంలో వచ్చి 13 బంతుల్లో 15 పరుగులు చేశాడు. మరోవైపు.. ద్రవిడ్‌ ఈ మ్యాచ్‌లో 12 బంతులు ఎదుర్కొని కేవలం ఐదు పరుగులే చేసి అవుటయ్యాడు.

చదవండి: విండీస్‌కు భారీ షాక్‌.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement