బ్రెడీ క్రికెట్ క్లబ్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 92 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్ గెలుపొందింది. దీంతో ఐసీసీ వన్డే ప్రపంచకప్-2027కు అఫ్గానిస్తాన్ నేరుగా అర్హత సాధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8లో నిలిచే జట్లు మాత్రమే ఈ మెగా టోర్నీకి డైరక్ట్‌గా క్వాలిఫై అవుతాయి.
అఫ్గాన్ ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్ధానంలో ఉంది. అయితే వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌నకు క్వాలిఫై కావాలంటే అఫ్గాన్‌కు ఐర్లాండ్ సిరీస్‌లో ఒక్క విజయం అవసరముండేది. ఇప్పుడు రెండో వన్డేలో గ్రాండ్ విక్టరీ సాధించడంతో అఫ్గాన్ ప్రపంచకప్ బెర్త్ అధికారికంగా ఖారరైంది. వన్డే ప్రపంచకప్ టోర్నీకి అఫ్గాన్ నేరుగా అర్హత సాధించడం ఇదే కేవలం రెండోసారి మాత్రమే.
ఐర్లాండ్, విండీస్‌కు బిగ్ షాక్
కాగా అఫ్గాన్ గెలుపుతో ఐర్లాండ్, వెస్టిండీస్‌లకు భారీ షాక్ తగిలింది. ఐర్లాండ్ నేరుగా క్వాలిఫై కావాలంటే అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌ను 4-0తో క్లీన్‌స్వీప్ చేయాల్సి ఉండగా.. తొలి మ్యాచ్ వర్షార్పణం కావడం, రెండో మ్యాచ్‌లో ఓడిపోవడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి.
మరోవైపు అఫ్గాన్‌పై ఐర్లాండ్ గెలిస్తే.. భారత్‌తో సిరీస్‌లో ఒక్క విజయం సాధించి వరల్డ్‌కప్ టోర్నీకి నేరుగా క్వాలిఫై కావాలనుకున్న విండీస్ ఆశలు కూడా ఆడియాశలయ్యాయి. వెస్టిండీస్ ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో పదివ స్ధానంలో ఉంది.
చివరగా జరిగిన 2023 వరల్డ్ కప్‌లో కూడా కరేబియన్ జట్టు భాగం కాలేదు. అప్పుడు వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8లో నిలవలేక ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ ఆడింది. సూపర్-6 దశలో స్కాట్లాండ్ చేతిలో ఘోర ఓటమి చవిచూసి తొలిసారి వన్డే ప్రపంచకప్‌నకు దూరమైంది. కాగా వచ్చే ఏడాది జరగనున్న ఈ మెగా టోర్నీకి సౌతాఫ్రికా, నమీబియా, జింబాబ్వేలు ఆతిథ్యమివ్వనున్నాయి.
చదవండి: 'మూడేళ్లుగా తిరుగుతున్నా.. ప్లీజ్ హెల్ప్ చేయండి'


