కొలంబో వేదికగా శ్రీలంక ఎలెవన్‌తో జరుగుతున్న వార్మాప్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే జైశ్వాల్ తన ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. రెండు బంతులు మాత్రమే ఎదుర్కొన్న యశస్వి.. విశ్వ ఫెర్నాండో బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. జైశ్వాల్ మరోసారి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బౌలింగ్‌లోనే ఔట్ కావడం గమనార్హం. ఈ ముంబై ఆటగాడు గత కొంతకాలంగా ఎడమ చేతి వాటం పేసర్లను ఎదుర్కోవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నాడు.
కాగా ప్రధాన సిరీస్‌కు ముందు జరుగుతున్న సన్నాహక మ్యాచ్‌లో జైశ్వాల్ విఫలం కావడం మేనెజ్‌మెంట్‌ను నిరాశపరిచింది. డగౌట్ నుంచి మ్యాచ్ వీక్షిస్తున్న హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్.. జైశ్వాల్ ఔటైన వెంటనే నో అంటూ తల ఊపాడు. ఇక ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఎలెవన్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను 363/8 వద్ద డిక్లేర్ చేసింది.
లంక బ్యాటర్లలో రవిందు రసంతా (143 బంతుల్లో 71; 6 ఫోర్లు, 1 సిక్స్), నిషాన్ ఫెర్నాండో (65 బంతుల్లో 66; 11 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ సొనాల్ దినుషా (72 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
అయితే కొత్తగా జట్టులోకి వచ్చిన సారాంశ్ జైన్ 11 ఓవర్లలో వికెట్ పడగొట్టకుండా 54 పరుగులు ఇచ్చాడు. కాగా ఈ వార్మాప్ మ్యాచ్‌కు భారత రెగ్యులర్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో కేఎల్ రాహుల్ సారథిగా వ్యవహరిస్తున్నాడు.
భారత జట్టు
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, సారాంశ్ జైన్, ఆకిబ్ నబీ, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్.
శ్రీలంక ఎలెవన్ జట్టు
నిశాన్ మధుష్క (వికెట్ కీపర్), నిపుణ్ ధనంజయ, రవిందు రశాంత, పవన్ రత్ననాయకె, అహాన్ విక్రమసింఘే, సోనాల్ దినుష (కెప్టెన్), రమేశ్ మెండిస్, దిలుమ్ సుదీర, విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమార, పసిందు సూరియబండారా, ఇసిత విజేసుందెర, అసంక మనోజ్, అంజలా బండారా, కేశరా నువాంత.
చదవండి: 'మూడేళ్లుగా తిరుగుతున్నా.. ప్లీజ్ హెల్ప్ చేయండి'


