'మూడేళ్లుగా తిరుగుతున్నా.. ప్లీజ్‌ హెల్ప్‌ చేయండి' | Rishabh Pant Seeks Uttarakhand CM Dhami’s Help To Buy Land, Shift Base From Delhi To Home State | Sakshi
Sakshi News home page

'మూడేళ్లుగా తిరుగుతున్నా.. ప్లీజ్‌ హెల్ప్‌ చేయండి'

Aug 8 2026 9:09 AM | Updated on Aug 8 2026 10:06 AM

Rishabh Pant Asks Uttarakhand Chief Minister Pushkar Singh Dhami For A Gift

టీమిండియా స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాటర్‌ రిష‌బ్ పంత్‌ త‌న మ‌కాంను ఢిల్లీ నుంచి సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌కు మార్చేందుకు సిద్దమయ్యాడు. అక్కడ ఇళ్లు కట్టుకునేందుకు రిషబ్‌ ప్రయత్నిస్తున్నాడు. ఈ మేరకు అక్కడ స్థలం కొనుగోలు చేసేందుకు సహకరించాలని కోరుతూ నేరుగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి ఎక్స్ వేదికగా పంత్ విజ్ఞప్తి చేశాడు.

"పుష్కర్ సింగ్ ధామీ సార్ ఎలా ఉన్నారు? ఉత్తరాఖండ్ స్థానికుడిగా నేను ఇక్కడికి తిరిగివచ్చేందుకు చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నాను. కానీ నాకు ఇళ్లు కట్టుకునేందుకు అనువైన, విశాలమైన స్థలం దొరకడం లేదు. నా ఉత్తరాఖండ్ అంటే ఎంతో ఇష్టం. 

ఈ భూసేకరణ విషయంలో దయచేసి నాకు సహాయం చేయండి. గతంలో రాష్ట్ర ప్రచారకర్తగా ఉన్నప్పుడు నాకు రావాల్సిన స్థలం కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ విష‌యం ప‌క్క‌న పెడితే నాకు ఉత్తరాఖండ్‌కు వ‌చ్చి నివాస‌ముండాల‌ని ఉంది. మూడేళ్లుగా ప్ర‌య‌త్నిస్తున్నా నాకు స్థలం దొర‌క‌డం లేదు. ద‌య‌చేసి నాకు ఇళ్లు క‌ట్టుకునేందుకు స్థలం ఇప్పించండి. మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాను" అంటూ పంత్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

అయితే కాసేప‌టికే పంత్ మ‌రో పోస్ట్ చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నందుకు ప్రభుత్వం తనకు ఆ స్థలాన్ని గిప్ట్‌ ఇస్తే బాగుంటుందని లేదా ప్రభుత్వం నిర్ణయించిన ధర‌కే కొనుగోలు చేసేందుకు త‌ను సిద్దంగా ఉన్నాన‌ని పేర్కొన్నాడు. 

కాగా పంత్‌ ఈ పోస్ట్‌లు అర్ధరాత్రి ఒంటి గంటస‌మ‌యంలో చేయ‌డం గ‌మనార్హం. అర్ధరాత్రి పూట పంత్ చేసిన ఈ ట్వీట్స్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పంత్ ప్ర‌స్తుతం రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం భార‌త జ‌ట్టుతో పాటు శ్రీలంక‌లో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement