శ్రీజ పరాజయం | Akula Sreeja Exits World Table Tennis Yokohama Champions Tournament | Sakshi
Sakshi News home page

శ్రీజ పరాజయం

Aug 8 2026 3:53 AM | Updated on Aug 8 2026 11:36 AM

Akula Sreeja loses in World Table Tennis Yokohama Champions Level Tournament

యోకోహామా: వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ యోకోహామా చాంపియన్స్‌ లెవెల్‌ టోర్నీలో జాతీయ మాజీ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో నిష్క్ర మించింది. ప్రపంచ 10వ ర్యాంకర్‌ షిన్‌ యుబిన్‌ (దక్షిణ కొరియా)తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 67వ ర్యాంకర్‌ శ్రీజ 2–11, 6–11, 11–8, 11–7, 5–11తో పోరాడి ఓడిపోయింది. 30 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీజ సొంత సర్వీస్‌లో 16 పాయింట్లు, ప్రత్యర్థి సర్వీస్‌లో 19 పాయింట్లు స్కోరు చేసింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఓడిన శ్రీజకు 6,000 డాలర్ల (రూ. 5 లక్షల 70 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 140 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement