కెనడా కిక్‌... దక్షిణాఫ్రికా అవుట్‌ | Host team Canada in the pre quarterfinal | Sakshi
Sakshi News home page

కెనడా కిక్‌... దక్షిణాఫ్రికా అవుట్‌

Jun 30 2026 3:40 AM | Updated on Jun 30 2026 5:01 AM

Host team Canada in the pre quarterfinal

గోల్‌ కొడుతున్న యుస్టాకియో (జెర్సీ నంబర్‌ 7)

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఆతిథ్య జట్టు

నాకౌట్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 1–0తో విజయం  

లాస్‌ ఏంజెలిస్‌: అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కెనడా జట్టు ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో మరో అడుగు ముందుకు వేసింది. మూడోసారి ఈ మెగా ఈవెంట్‌లో పోటీపడుతున్న కెనడా జట్టు తొలిసారి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రౌండ్‌–32 తొలి నాకౌట్‌ మ్యాచ్‌లో కెనడా 1–0 గోల్‌ తేడాతో దక్షిణాఫ్రికా జట్టును ఓడించింది. 

ఈ ఓటమితో దక్షిణాఫ్రికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. 90+2వ నిమిషంలో ‘డి’ ఏరియా పైభాగం నుంచి స్టీఫెన్‌ యుస్టాకియో సంధించిన కిక్‌ను దక్షిణాఫ్రికా గోల్‌కీపర్‌ నిలువరించలేకపోయాడు. దాంతో కెనడా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం స్టాపేజ్‌ సమయంలోని మిగతా ఐదు నిమిషాలపాటు దక్షిణాఫ్రికాను కట్టడి చేసి కెనడా విజయాన్ని అందుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement