PC: X
వన్డే ప్రపంచకప్-2027కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికి ఇప్పటి నుంచే క్రికెట్ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టును మాజీ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. ఈ జాబితాలోకి తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్ మాజీ బ్యాటర్ మన్విందర్ బిస్లా చేరాడు.
ఈ ప్రపంచకప్ కోసం అత్యుత్తమ భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను బిస్లా ఎంపిక చేశాడు. ఈ జట్టులో సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు దక్కలేదు. బిస్లా ఓపెనింగ్ జోడీగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మలను ఎంచుకున్నాడు.
అదేవిధంగా ఆ తర్వాత స్ధానాల్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లకు అతడు అవకాశమిచ్చాడు. ఈ జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్‌కు చోటు దక్కింది.
ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌కు చాన్స్ ఇచ్చాడు. ఇక పేస్ బౌలర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, సిరాజ్‌లను బిస్లా ఎంపిక చేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌కు ఛాన్స్ లభించింది.
కాగా జడేజా ప్రస్తుతం భారత వన్డే జట్టుకు దూరంగా ఉన్నాడు. 37 ఏళ్ల జడేజా చివరిసారిగా ఈ ఏడాది జనవరిలో వన్డేల్లో ఆడాడు. ఆ తర్వాత అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లకు అతడిని ఎంపిక చేయలేదు.
వన్డే ప్రపంచ కప్ కోసం మన్విందర్ బిస్లా ఎంపిక చేసిన భారత తుది జట్టు ఇదే: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ మరియు కుల్దీప్ యాదవ్.


