సుదీర్ఘ సమరానికి సై | First Test between Sri Lanka and India will begin on Friday 15 August 2026 | Sakshi
Sakshi News home page

సుదీర్ఘ సమరానికి సై

Aug 15 2026 6:15 AM | Updated on Aug 15 2026 6:15 AM

First Test between Sri Lanka and India will begin on Friday 15 August 2026

నేటి నుంచి శ్రీలంకతో భారత్‌ తొలి టెస్టు 

ఉదయం 10 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌ చానెల్, సోనీ లివ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా భారత జట్టు... శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. సొంతగడ్డపై వరుస సిరీస్‌ పరాజయాల నుంచి కోలుకొని టీమిండియా సత్తా చాటాలని భావిస్తుంటే... శ్రీలంక స్పిన్‌తో ప్రత్యరి్థని దెబ్బతీయాలని ప్రణాళికలు రచిస్తోంది. భారత జట్టుకు ఇది 600వ టెస్టు మ్యాచ్‌ కావడం మరో విశేషం.  

గాలె: సుదీర్ఘ విరామం అనంతరం భారత క్రికెట్‌ జట్టు శ్రీలంకలో టెస్టు సిరీస్‌ ఆడనుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం తొలి టెస్టు ప్రారంభం కానుంది. 1932లో తొలి టెస్టు ఆడిన టీమిండియాకు ఇది 600వ మ్యాచ్‌ కానుండగా... మైలురాయి మ్యాచ్‌లో విజయం సాధించాలని శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలోని భారత జట్టు పట్టుదలగా ఉంది. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు టీమిండియా 9 టెస్టులు ఆడనుంది. 

ఇందులో ఏడింట గెలిస్తే భారత్‌ నేరుగా తుదిపోరుకు అర్హత సాధించనుంది. దీంతో విజయమే లక్ష్యంగా గిల్‌ సేన బరిలోకి దిగనుంది. గౌతమ్‌ గంభీర్‌ కోచింగ్‌లో టి20 ప్రపంచకప్, ఆసియాకప్, చాంపియన్స్‌ ట్రోఫీ నెగ్గిన టీమిండియా... సుదీర్ఘ ఫార్మాట్‌లో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. దీంతో గంభీర్‌పై కూడా అదనపు ఒత్తిడి ఉంది.  

స్పిన్‌కు ఎదురొడ్డితేనే... 
2017లో విరాట్‌ కోహ్లి సారథ్యంలో లంకలో పర్యటించిన భారత జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3–0తో ‘క్లీన్‌ స్వీప్‌’ చేసింది. ఆ సమయంలో టీమిండియా స్టార్‌ బ్యాటర్లతో దట్టంగా ఉండగా... ఇప్పుడు అలాంటి అనుభవజు్ఞలు కరువయ్యారు. కేఎల్‌ రాహుల్, యశస్వి జైస్వాల్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించనుండగా... దేవదత్‌ పడిక్కల్‌ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు రానున్నాడు. కెపె్టన్‌ గిల్‌ నాలుగో స్థానంలో బరిలోకి దిగనుండగా... ఆ తర్వాత పంత్, ధ్రువ్‌ జురేల్, రవీంద్ర జడేజా బ్యాటింగ్‌ చేస్తారు. 

సర్ఫరాజ్‌ ఖాన్‌కు తుది జట్టులో చోటు కష్టమే. ఒకప్పుడు స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటారనే పేరున్న భారత ప్లేయర్లు... ఇటీవలి కాలంలో ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. లంక జట్టులో ప్రభాత్‌ జయసూర్య, రమేశ్‌ మెండిస్‌ వంటి నాణ్యమైన స్పిన్నర్‌లు ఉన్నారు. ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతో బరిలోకి దిగడం ఖాయమే కాగా... సిరాజ్‌తో పాటు ప్రసిధ్‌ కొత్త బంతిని పంచుకోనున్నాడు. జడేజా, కుల్దీప్, మానవ్‌ స్పిన్‌ భారం మోస్తారు.    

తుది జట్లు (అంచనా) 
భారత్‌: గిల్‌ (కెప్టెన్‌), రాహుల్, జైస్వాల్, పడిక్కల్, పంత్, జురేల్, జడేజా, మానవ్‌ సుతార్, కుల్దీప్, సిరాజ్, ప్రసిధ్‌. శ్రీలంక: ధనంజయ డిసిల్వా (కెపె్టన్‌), లహిరు, నిషాన్, దినేశ్, కమిందు, డిక్‌వెల్లా, సోనల్, ప్రభాత్, రమేశ్, అషిత ఫెర్నాండో, లహిరు కుమార.

పిచ్, వాతావరణం 
గాలె పిచ్‌ గతంలో మాదిరిగా పూర్తిగా స్పిన్నర్‌లకు అనుకూలించకపోవచ్చని శ్రీలంక కెప్టెన్‌ ధనంజయ్‌ పేర్కన్నాడు. పిచ్‌పై తేమ ఎక్కువగా ఉండటంతో బ్యాటర్లకు లబ్ది చేకూరే అవకాశం ఉంది. టాస్‌ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్‌కే మొగ్గుచూపనుంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement