breaking news
galle international stadium
-
భారత్‌కు భారీ ఆధిక్యం
గాలే: శ్రీలంకతో తొలి టెస్టులో భారత జట్టు విజయావకాశాన్ని సృష్టించుకుంది. అయితే మూడు రోజుల పాటు మ్యాచ్‌ను వెంటాడుతూ ప్రభావం చూపించిన వర్షం మరో రెండు రోజులు కూడా ఇబ్బంది పెట్టవచ్చు. గరిష్టంగా 196 ఓవర్లు పడే అవకాశం ఉండగా, రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఎన్ని పరుగులు చేసి లక్ష్యాన్ని నిర్దేశిస్తుందనేది ఆసక్తికరం. మ్యాచ్ మూడో రోజు సోమవారం శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 79.4 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా భారత్‌కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. సోనాల్ దినుషా (168 బంతుల్లో 100; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, నిరోషన్ డిక్వెలా (115 బంతుల్లో 80; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. ఒకదశలో లంక 90/5 వద్ద కష్టాల్లో ఉండగా వీరిద్దరు ఆరో వికెట్‌కు 36.1 ఓవర్లలో 146 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్‌కు 4, జడేజాకు 3 వికెట్లు దక్కాయి. భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లు ఆడాల్సి ఉన్నా... వెలుతురులేమి వల్ల ఆట సాధ్యం కాలేదు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 460/9తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ మరో 4 బంతులాడి తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైంది. భారీ భాగస్వామ్యం...తొలి సెషన్లోనే శ్రీలంకపై భారత్ సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శిస్తూ ఐదు వికెట్లతో దెబ్బ కొట్టింది. లంక ఇన్నింగ్స్‌లో రెండో బంతికే మదుషంక (0)ను అవుట్ చేసి సిరాజ్ శుభారంభం అందించాడు. సుతార్ తన తొలి బంతికే చండీమల్ (4)ను వెనక్కి పంపించాడు. కొద్దిసేపు క్రీజ్‌లో నిలిచిన ఉడారా (44 బంతుల్లో 27; 6 ఫోర్లు) వికెట్ కూడా సుతార్ ఖాతాలోకే చేరింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కమిందు మెండిస్ (14)ను కుల్దీప్, ధనంజయ డిసిల్వా (21)లను జడేజా పెవిలియన్ పంపించి తామూ వికెట్ల ఖాతా తెరిచారు. భారత బౌలర్ల జోరు చూస్తూ లంక కుప్పకూలడానికి ఎంతోసేపు పట్టదనిపించింది. లంచ్ సమయానికి స్కోరు 99/5 కాగా, ఆ తర్వాత డిక్వెలా, దినుషా ద్వయం ఆతిథ్య జట్టును గట్టెక్కించింది. 20 పరుగుల వద్ద డిక్వెలా ఇచి్చన క్యాచ్‌ను స్లిప్‌ను రాహుల్ వదిలేయడం కూడా కలిసొచ్చింది. అనంతరం డిక్వెలా, దినుషా అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. టీ విరామానంతరం ఎట్టకేలకు ఈ జోడీని విడదీయడంలో భారత్ సఫలమైంది. ప్రసిధ్ బౌలింగ్‌లో డిక్వెలా వెనుదిరగ్గా, తక్కువ వ్యవధిలో లంక మరో రెండు వికెట్లు చేజార్చుకుంది. మరోవైపు పట్టుదలగా ఆడిన దినుషా 167 బంతుల్లో తన తొలి శతకాన్ని అందుకున్నాడు. అయితే అదే స్కోరు వద్ద దినుషా ఆట ముగియగా, మరో పది పరుగులకు లంక ఆలౌటైంది.స్కోరు వివరాలుభారత్ తొలి ఇన్నింగ్స్: 462; శ్రీలంక తొలి ఇన్నింగ్స్: మదుషంక (సి) పడిక్కల్ (బి) సిరాజ్ 0; ఉడారా (సి) జైస్వాల్ (బి) సుతార్ 27; చండీమల్ (సి) పంత్ (బి) సుతార్ 4; కమిందు (సి) గిల్ (బి) కుల్దీప్ 14; ధనంజయ (సి) రాహుల్ (బి) జడేజా 21; దినుషా (ఎల్బీ) (బి) జడేజా 100; డిక్వెలా (సి) పంత్ (బి) ప్రసిధ్ 80; నువాంతా (సి) గిల్ (బి) జడేజా 2; జయసూర్య (సి) జురేల్ (బి) సుతార్ 10; కుమార (స్టంప్డ్) పంత్ (బి) సుతార్ 10; ఫెర్నాండో (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (79.4 ఓవర్లలో ఆలౌట్) 284. వికెట్ల పతనం: 1–0, 2–27, 3–53, 4–59, 5–90, 6–236, 7–243, 8–274, 9–274, 10–284. బౌలింగ్: సిరాజ్ 9–3–29–1, ప్రసిధ్ 14–0–47–1, సుతార్ 21.4–1–76–4, కుల్దీప్ 14–0–65–1, జడేజా 21–5–57–3.350: జడేజా 350 వికెట్ల మైలురాయిని దాటాడు. భారత్ తరఫున కుంబ్లే, అశ్విన్, కపిల్, హర్భజన్ తర్వాత ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్‌గా జడేజా నిలిచాడు. బోథమ్, కపిల్, వెటోరి తర్వాత టెస్టుల్లో 350కి పైగా వికెట్లు, 4 వేలకు పైగా పరుగులు చేసిన నాలుగో ఆల్‌రౌండర్‌గా జడేజా నిలవడం విశేషం. -
సుదీర్ఘ సమరానికి సై
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా భారత జట్టు... శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. సొంతగడ్డపై వరుస సిరీస్ పరాజయాల నుంచి కోలుకొని టీమిండియా సత్తా చాటాలని భావిస్తుంటే... శ్రీలంక స్పిన్‌తో ప్రత్యరి్థని దెబ్బతీయాలని ప్రణాళికలు రచిస్తోంది. భారత జట్టుకు ఇది 600వ టెస్టు మ్యాచ్ కావడం మరో విశేషం. గాలె: సుదీర్ఘ విరామం అనంతరం భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడనుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం తొలి టెస్టు ప్రారంభం కానుంది. 1932లో తొలి టెస్టు ఆడిన టీమిండియాకు ఇది 600వ మ్యాచ్ కానుండగా... మైలురాయి మ్యాచ్‌లో విజయం సాధించాలని శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు పట్టుదలగా ఉంది. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు టీమిండియా 9 టెస్టులు ఆడనుంది. ఇందులో ఏడింట గెలిస్తే భారత్ నేరుగా తుదిపోరుకు అర్హత సాధించనుంది. దీంతో విజయమే లక్ష్యంగా గిల్ సేన బరిలోకి దిగనుంది. గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టి20 ప్రపంచకప్, ఆసియాకప్, చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమిండియా... సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. దీంతో గంభీర్‌పై కూడా అదనపు ఒత్తిడి ఉంది. స్పిన్‌కు ఎదురొడ్డితేనే... 2017లో విరాట్ కోహ్లి సారథ్యంలో లంకలో పర్యటించిన భారత జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3–0తో ‘క్లీన్ స్వీప్’ చేసింది. ఆ సమయంలో టీమిండియా స్టార్ బ్యాటర్లతో దట్టంగా ఉండగా... ఇప్పుడు అలాంటి అనుభవజు్ఞలు కరువయ్యారు. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా... దేవదత్ పడిక్కల్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు రానున్నాడు. కెపె్టన్ గిల్ నాలుగో స్థానంలో బరిలోకి దిగనుండగా... ఆ తర్వాత పంత్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తారు. సర్ఫరాజ్ ఖాన్‌కు తుది జట్టులో చోటు కష్టమే. ఒకప్పుడు స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటారనే పేరున్న భారత ప్లేయర్లు... ఇటీవలి కాలంలో ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. లంక జట్టులో ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్ వంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతో బరిలోకి దిగడం ఖాయమే కాగా... సిరాజ్‌తో పాటు ప్రసిధ్ కొత్త బంతిని పంచుకోనున్నాడు. జడేజా, కుల్దీప్, మానవ్ స్పిన్ భారం మోస్తారు. తుది జట్లు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్), రాహుల్, జైస్వాల్, పడిక్కల్, పంత్, జురేల్, జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్, సిరాజ్, ప్రసిధ్. శ్రీలంక: ధనంజయ డిసిల్వా (కెపె్టన్), లహిరు, నిషాన్, దినేశ్, కమిందు, డిక్వెల్లా, సోనల్, ప్రభాత్, రమేశ్, అషిత ఫెర్నాండో, లహిరు కుమార.పిచ్, వాతావరణం గాలె పిచ్ గతంలో మాదిరిగా పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలించకపోవచ్చని శ్రీలంక కెప్టెన్ ధనంజయ్ పేర్కన్నాడు. పిచ్‌పై తేమ ఎక్కువగా ఉండటంతో బ్యాటర్లకు లబ్ది చేకూరే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్‌కే మొగ్గుచూపనుంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి. -
గాలె స్టేడియాన్ని కూల్చుతున్నారు!
గాలె: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ క్రికెట్ స్టేడియాల్లో శ్రీలంకలోని గాలె అంతర్జాతీయ స్టేడియం కూడా ఒకటి. ఈ స్టేడియాన్ని 1984లో నిర్మించారు. 1998లో తొలిసారి ఈ మైదానంలో టెస్టు మ్యాచ్ జరిగింది. అయితే, 2004 డిసెంబర్లో వచ్చిన సునామీకి గాలె స్టేడియంలో చాలా భాగం దెబ్బతింది. ఆ తర్వాత ఈ స్టేడియానికి మరమ్మతులు చేశారు. అయితే, తాజాగా ఈ స్టేడియానికి ఆనుకొని ఉన్న 17వ శతాబ్దానికి చెందిన డచ్‌ఫోర్ట్‌ను కాపాడేందుకు గాను ప్రస్తుతం ఈ స్టేడియంలోని పెవిలియన్ స్టాండ్‌ను కూల్చేందుకు శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. స్టేడియంలోని పెవిలియన్ స్టాండ్ వల్ల కోట గోడ దెబ్బతినే అవకాశం ఉన్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఈ డచ్ ఫోర్ట్ యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకుంది. కాగా, స్టేడియంలో నిర్మించిన 500 సీట్ల సామర్థ్యం కలిగిన పెవిలియన్ స్టాండ్ వల్ల వారసత్వ జాబితాలో చోటు కోల్పోయే ప్రమాదంలో ఉంది. ఈ విషయాన్ని శ్రీలంక సాంస్కృతిక శాఖ మంత్రి విజయదాస రాజపక్సే పార్లమెంట్లో వెల్లడించారు. దక్షిణ కొలంబోకు 115 కిలోమీటర్ల దూరంలో గాలెలోనే మరొక స్టేడియాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన తెలిపారు. గాలె పిచ్ స్పిన్‌కు అనుకూలం. 1998 తరువాత గాలె వేదికగా జరిగిన చాలా మ్యాచ్‌ల్లో శ్రీలంక ఘన విజయాలు సాధించింది. శ్రీలంక జట్టుకు అదృష్ట స్టేడియంగా చెప్పొచ్చు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక 278 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 'కోటకు ఉన్న వారసత్వ సంపద గుర్తింపును కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. క్రికెట్ మైదానానికి మరో ప్రత్యమ్నాయం చూడాలి' అని క్రీడా శాఖ మంత్రి ఫైజర్ ముస్తఫా చెప్పాడు. ఈ క్రమంలోనే నవంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు మ్యాచ్ గాలె స్టేడియం వేదికగా జరిగే చివరి మ్యాచ్ కానుందని అధికార వర్గాలు తెలిపాయి.


