breaking news
Sri Lanka vs india
-
ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన పడిక్కల్, అతడికి కెరీర్ బెస్ట్!
శ్రీలంకతో ముగిసిన టెస్టు సిరీస్‌లో రెండు సెంచరీలతో అదరగొట్టిన భారత క్రికెటర్ దేవదత్ పడిక్కల్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. బుధవారం విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో పడిక్కల్ ఐదు స్థానాలు ఎగబాకి 54వ స్థానంలో నిలిచాడు. నిజానికి ఇదేమి గొప్ప ర్యాంక్ కాకపోయినప్పటికీ, పడిక్కల్ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకోవడమే గాక, భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా (328 పరుగులు) నిలిచాడు. టెస్టు సిరీస్‌ను 1-0తో భారత్ గెలవడం వెనుక పడిక్కల్ కీలకపాత్ర పోషించాడు. గిల్, పంత్ మినహామిగతా బ్యాటర్ల విషయానికొస్తే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ లంక సిరీస్‌లో ఒక అర్థసెంచరీ మాత్రమే సాధించాడు. దీంతో ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు దిగజారి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం తన ఏడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ విభాగంలో టాప్-10లో భారత్ నుంచి గిల్, పంత్ మాత్రమే చోటు దక్కించుకున్నారు. రెండుకు ఎగబాకిన స్మిత్ఇదే సిరీస్‌లో రెండు సెంచరీలతో భారత్‌కు కొరకరాని కొయ్యగా మారిన లంక బ్యాటర్ సోనల్ దినూష ఏకంగా 29 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 25వ స్థానానికి చేరుకోవడం విశేషం. ఇక టాప్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (856 పాయింట్లు) కొనసాగుతుండగా, ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ ఒక స్థానం ఎగబాకి రెండో స్థానానికి చేరుకోగా, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మూడో స్థానానికి పడిపోయాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. మోకాలి గాయంతో లంక టూర్‌కు దూరమైన టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానానికి పడిపోగా, బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించాడు. న్యూజిలాండ్ బౌలర్ మాట్ హెన్రీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో భారత స్టార్ రవీంద్ర జడేజా తన నెంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకోగా, ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు. భారత్ నుంచి జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ (ఏడో స్థానం) టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.Read: తిలక్ వర్మ వన్‌మ్యాన్ షో.. ఫైనల్లో సౌత్‌జోన్ -
‘నోబాల్ వేస్తే ఫ్రీ హిట్ కాదు.. కఠిన శిక్షలు వేయాలి’
శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమిండియా 1-0తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే రెండో టెస్టులో విజయానికి చేరువగా వచ్చినప్పటికీ, ఆట చివరి రోజు నాలుగు వికెట్లు తీయడంలో టీమిండియా బౌలర్లు విఫలమయ్యారు. దీంతో లంక మ్యాచ్‌ను డ్రా చేసుకోగా, భారత్‌కు విజయం చేజారింది. ఈ విషయం పక్కనబెడితే, శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో టీమిండియా బౌలర్లు నోబాల్స్ ఎక్కువగా వేశారు. భారత టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత ఎక్కువగా నోబాల్స్ నమోదైన టెస్టు సిరీస్ కూడా ఇదే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో భారత దిగ్గజం సునీల్ గావస్కర్ టెస్టుల్లో నోబాల్స్‌ను కంట్రోల్ చేసేందుకు ఫ్రీహిట్ లాంటిది సరిపోవని, మరేదైనా కఠిన రూల్స్ తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.గావస్కర్ మాట్లాడుతూ.. "టెస్టు క్రికెట్లో బ్యాటర్లకు పరుగులు చేయడం ఇప్పటికే చాలా సులభంగా మారింది. ఓవర్‌కు రెండు బౌన్సర్ల పరిమితి, బౌండరీ లైన్లను దగ్గరకు జరపడం వంటివి ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఫ్రీ హిట్లు ప్రవేశపెట్టి బ్యాటింగ్‌ను మరింత సులభతరం చేయొద్దు. నో బాల్స్ వేయకుండా ఉండటం అనేది పూర్తిగా ఆటగాళ్ల నియంత్రణలో ఉండే అంశం. టేప్ మెజర్‌తో రనప్ మార్క్ చేసుకునే ఈ ఆధునిక రోజుల్లో ఇలాంటి పొరపాట్లకు క్షమాపణలు ఉండవు" అని చెప్పుకొచ్చాడు.ఈ సందర్భంగా టెస్టుల్లో నోబాల్స్ సమస్యను తప్పించుకోవడానికి గవాస్కర్ పలు కీలక సూచనలు చేశాడు."నో బాల్ వేసిన ఆటగాడికి భారీ జరిమానా విధించాలి. అదే తప్పు మళ్లీ పునరావృతం చేస్తే ఆ జరిమానాను రెట్టింపు చేయాలి. అంతటితో ఆగకుండా, ఆటగాడి జరిమా నాలో సగం మొత్తాన్ని బౌలింగ్ కోచ్‌కు కూడా విధించాలి. అప్పుడే బాధ్యత పెరుగుతుంది" అని అన్నాడు. ఈ జరిమానాల ద్వారా వసూలైన మొత్తంతో సిరీస్ చివరలో టీమ్ సభ్యులందరికీ డిన్నర్ ఏర్పాటు చేయవచ్చని, ఇది జట్టులో బంధాన్ని మరింత పెంచుతుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. 2021 నుంచి టెస్టుల్లో భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా 85 కంటే ఎక్కువ నోబాల్స్ వేసి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. దీనిలో భాగంగానే సునీల్ గావస్కర్ తాజాగా నోబాల్స్ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించాడు.Read: ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం.. పాక్‌కు ఓటమి తప్పదా? -
'కోహ్లి ఉండుంటే ఆ "సైంధవుడి" ఆట సాగేది కాదు!'
కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టును టీమిండియా డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. అయితే చివరి రోజు ఆటలో నాలుగు వికెట్లు కూల్చడంలో విఫలమైన భారత్ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది. సోనల్ దినూష (133 నాటౌట్) అజేయ సెంచరీతో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో సైంధవుడిలా మారి భారత విజయాన్ని ఒంటిచేత్తో అడ్డుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటతీరుపై విమర్శలు వస్తున్న వేళ మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కొలంబో టెస్టులో విరాట్ కోహ్లి ఆడి ఉంటే మాత్రం ఫలితం వేరేలా ఉండేదని, ఆ సైంధవుడి (సోనల్ దినూష) ఆటలు సాగేవి కాదంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు."టెస్టు క్రికెట్ ఆడడం అంత సులువు కాదు. లాంగ్ ఫార్మాట్ గేమ్‌గా పిలువబడే ఆటలో ఓపిక, సహనం చాలా అవసరం. అలసిపోయినా గంటల కొద్ది ఓవర్లు బౌలింగ్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆడి ఉంటే ప్రతీసారి జట్టును ఎంకరేజ్ చేస్తూ గెలుపుకోసం పోరాడుదామని ప్రేరణనిస్తూ జట్టులో స్ఫూర్తిని నింపేవాడేమో. కోహ్లి ఆడి ఉంటే సోనల్ దినూషను ఎక్కువగా టార్గెట్ చేస్తూ అతడిని ఔట్ చేసేందుకు పదేపదే బౌలర్లను మారుస్తూ ఫలితం రాబట్టేవాడు. కోహ్లి ఉంటే ప్రత్యర్థిని తన వ్యూహాలతో బోల్తా కొట్టించి వాళ్లను ఒత్తిడిలోని నెట్టేసేవాడు. లాంగ్‌ఫార్మాట్ అయిన టెస్టుల్లో కొన్నిసార్లు మనం బౌలింగ్ చేస్తూనే పోతాం.. బంతి బాగా టర్న్ అయ్యి వికెట్పడుతుందిలే అనుకొని పొరపాటు పడతాం. కొలంబో టెస్టులో ఇలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకోకపోవడం వల్లే ఫలితం ఇలా వచ్చిందేమో." అని కైఫ్ చెప్పుకొచ్చాడు.ఇక 2025 మేలో విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటినుంచి కోహ్లి కేవలం వన్డే ఫార్మాట్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. 2027 వన్డే ప్రపంచకప్ అనంతరం కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశముంది. 123 టెస్టులాడిన కోహ్లి 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు, 31 హాఫ్ సెంచరీలున్నాయి.Read: ‘పబ్జీ’ మొబైల్ గేమ్ సృష్టికర్త మృత్యువాత! -
జడేజా ఖాతాలో ఊహకు కూడా అందని చెత్త రికార్డు!
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్టుల్లో ఊహకు అందని విధంగా అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. డీఆర్ఎస్ కోరడంలో 22 సార్లు విఫలమై చెత్త రికార్డు మూటగట్టుకున్న జడేజా ఖాతాలో ఇప్పుడు నోబాల్స్ రికార్డు కూడా వచ్చి చేరడం గమనార్హం. 2021 నుంచి ఐదేళ్ల కాలంలో జడేజా అత్యధిక నోబాల్స్ వేసిన స్పిన్నర్‌గా నిలిచాడు. అతని ఖాతాలో ఏకంగా 88 నో-బాల్స్ నమోదయ్యాయి. ఫాస్ట్ బౌలర్లు నోబాల్స్ వేయడం సర్వ సాధారణం. ఎందుకంటే రనప్‌లో తేడా వచ్చిన ప్రతీసారి వాళ్లు నోబాల్స్ వేయడం కనిపిస్తుంది. కానీ స్పిన్నర్లు మాత్రం వీలైనంత తక్కువగానే నోబాల్స్ వేయడం చూస్తుంటాం.కానీ జడేజా విషయంలో మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయింది. 2021 నుంచి ఇప్పటివరకు జడేజా 88 నో బాల్స్ వేయడం గణాంకాల పరంగా ఆందోళన కలిగించే అంశం. తాజాగా కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో జడేజా నో-బాల్ వేయడం మరోసారి చర్చనీయాంశమైంది. అంతేకాదు ఇదే టెస్టులో భారత స్పిన్నర్లు ఇప్పటివరకు మొత్తం 10 నో-బాల్స్ వేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.నో-బాల్స్ జాబితాలో జడేజా టాప్2021 నుంచి టెస్టు క్రికెట్ లో స్పిన్నర్లు వేసిన నో-బాల్స్ గణాంకాలను పరిశీలిస్తే జడేజా అందరికంటే ముందున్నాడు. పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీ 40 నోబాల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. జడేజా వేసిన నో-బాల్స్ సంఖ్య తన తర్వాతి స్థానంలో ఉన్న బౌలర్‌కు రెట్టింపు సంఖ్యలో ఉండడం గమనార్హం.2021 నుంచి టెస్టుల్లో స్పిన్నర్లు వేసిన నో-బాల్స్:👉రవీంద్ర జడేజా (భారత్): 88👉నోమన్ అలీ (పాకిస్థాన్): 40👉లసిత్ ఎంబల్దేనియా (శ్రీలంక): 33👉జాక్ లీచ్ (ఇంగ్లాండ్): 19👉జోమెల్ వార్రికాన్ (వెస్టిండీస్): 17👉జహిర్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్): 17ఇక మ్యాచ్ విషయానికొస్తే కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ముగిసేసరికి భారత్ పటిష్టమైన స్థితిలో నిలిచింది. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి శ్రీలంక 229/6 స్కోరుతో ఉండగా, ఆతిథ్య జట్టు కేవలం 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకముందు లంక తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌట్ కాగా, భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేసింది.Most no-balls by spinners in Tests since 2021: 88* - Ravindra Jadeja. 40 - Noman Ali. 33 - Lasith Embuldeniya. pic.twitter.com/y9EsOgImCP— Mufaddal Vohra (@mufaddal_vohra) August 26, 2026Read: 21 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ -
అలా జరగొద్దు.. టీమిండియాకు పొంచి ఉన్న గండం!
కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ముగిసేసరికి భారత్ పటిష్టమైన స్థితిలో నిలిచింది. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి శ్రీలంక 229/6 స్కోరుతో ఉండగా, ఆతిథ్య జట్టు కేవలం 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. గురువారం ఆటకు చివరి రోజు కావడంతో, భారత్ గెలుపు లాంచనమే అయినప్పటికీ, వర్షం ముప్పు కూడా పొంచి ఉంది. ఒకవేళ వర్షంతో ఐదో రోజు ఆటలో ఒక్క బంతి కూడా సాధ్యపడకపోతే అప్పుడు మ్యాచ్ డ్రా అవుతుంది. మరి మ్యాచ్ డ్రా అయితే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడంలో భారత్‌కు ఎదురయ్యే అడ్డంకులు ఏంటనేవి ఒకసారి పరిశీలిద్దాం. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం 53.33 శాతం పాయింట్లతో (PCT) ఐదవ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా చేతిలో బంగ్లాదేశ్ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో, శ్రీలంకపై గెలిస్తే భారత్ నాలుగో స్థానానికి చేరుకుంటుంది. అయితే, మ్యాచ్ డ్రా అయితే మాత్రం, భారత్ 51.52 శాతం పాయింట్ల తేడాతో ఐదవ స్థానంలోనే కొనసాగుతుంది. అయితే డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్‌కు మరో ఏడు టెస్టులు మిగిలి ఉన్నాయి. ఇప్పటివరకు ఆడిన 10 టెస్టుల్లో ఇప్పటికే నాలుగింటిలో ఓడిపోయిన శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని జట్టుకు, ఇక నుంచి ప్రతీ టెస్టు నాకౌట్ లాంటిదే. ఈ ఏడాది నవంబరులో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత్ న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. ఆ తర్వాత ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే డార్విన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టును బంగ్లాదేశ్ నెగ్గడంతో, భారత్ తమకు మిగిలిన 8 టెస్టుల్లో ఏడు గెలవాల్సి ఉంటుంది. అయితే ఇప్పడు లంకతో రెండో టెస్టు వర్షం వల్ల డ్రా అయితే మాత్రం భారత్ కచ్చితంగా ఏడింటికి ఏడు టెస్టులు గెలవాల్సి ఉంటుంది. అప్పుడే టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్లు 68.52గా ఉండడంతో పాటు ఫైనల్ ఆడేందుకు చాన్స్ ఉంటుంది. అంతేకాదు భారత్‌కు రాబోయే ఏడు టెస్టుల్లో ఎలాంటి పెనాల్టీ పాయింట్లు లభించకపోతేనే ఈ పరిస్థితులు సాధ్యమవుతాయన్న విషయం గుర్తుంచుకోవాలి.చదవండి: మాస్టర్ ప్లాన్ అదిరింది.. ధోనిని మించిపోయిన పంత్! -
మాస్టర్ ప్లాన్ అదిరింది.. ధోనిని మించిపోయిన పంత్!
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో మాత్రమే ఉంది. సోనల్ దినూష (7), కెషారా నువంత (3) క్రీజులో ఉన్నారు. సోనల్ దినూష మాత్రమే బ్యాటర్ కావడం, మిగతావాళ్లంతా టెయిలెండర్లు కావడంతో చివరి రోజు టీమిండియా బౌలర్లకు మిగతా నాలుగు వికెట్లు తీయడం కష్టమేమీ కాదు. అయితే లంక రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు బ్యాటర్ పసిందు సూరియబండార ఆయువు పట్టుగా నిలిచాడు. 21 పరుగుల వద్ద లభించిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న పసిందు ఆ తర్వాత 90 పరుగులు చేసి ఔటయ్యాడు. లంక నాలుగో రోజు ఆటను పూర్తి చేయగలిగిందంటే అదంతా పసిందు చలవే. జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన పసిందును ఔట్ చేసేందుకు టీమిండియా మాస్టర్‌ప్లాన్ వేసింది.ఆ మాస్టర్‌ప్లాన్‌లో పంత్, మానవ్ సుతార్లు కీలకపాత్ర పోషించారు. ఇన్నింగ్స్ 61వ ఓవర్ మానవ్ సుతార్ వేశాడు. ఆఫ్ స్టంప్ అవతల వేసిన స్లో బంతిని పసిందు ఆడే ప్రయత్నంలో క్రీజులైన్ దాటి బయటికి వచ్చాడు. ఇది గమనించిన పంత్ కేవలం 0.3 సెకన్ల వ్యవధిలో బెయిల్స్‌ను ఎగురగొట్టాడు. రిప్లేలో పంత్ చేసిన డిస్మిసల్ చూస్తే వారెవ్వా అనకుండా ఉండలేం. ఈ ఒక్క స్టంపౌట్ విషయంలో మాత్రం భారత మాజీ కీపర్ ఎంఎస్ ధోనిని కూడా మించిపోయాడనంలో సందేహం లేదు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలా మానవ్ సుతార్ తెలివైన బంతితో పసిందును బోల్తా కొట్టించినప్పటికీ, ఇక్కడ పంత్‌ను కూడా మెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అంతకముందు బంతికే పసిందు ఎల్బీడబ్ల్యూ నుంచి తప్పించుకున్నాడు. ఈ సమయంలో పంత్.. ‘బ్యాటర్ అలసిపోయాడు.. రెడీగా ఉండండి’ అన్న మాటలు మైక్ స్టంప్‌లో రికార్డయ్యాయి.Rishabh Pant stumped Sri Lanka’s Sooriyabandara in just 0.3 seconds 🥶🔥What a quick stumping 🔥 pic.twitter.com/lztPjNcEMf— Harshit (@I_am_Harshit_17) August 26, 2026Read: దుమ్మెత్తిపోసుకున్న జడ్డూ, సిరాజ్.. ఏం జరిగిదంటే? -
దుమ్మెత్తిపోసుకున్న జడ్డూ, సిరాజ్.. ఏం జరిగిదంటే?
కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రసకందాయంలో పడింది. ఆటకు మరో రోజు మిగిలి ఉన్న సమయంలో టీమిండియా మరో విజయం దిశగా అడుగులు వేస్తోంది. నాలుగో రోజు ఆటలో లంచ్ విరామం తర్వాత రెండో సెషన్లో జడేజా, సిరాజ్‌ల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. లంక రెండో ఇన్నింగ్స్ 31వ ఓవర్లో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. జడేజా బౌలింగ్‌లో పసిందు సూరియబండార డీప్ ఫార్వర్డ్ దిశగా స్లాగ్ స్వీప్ షాట్ ఆడాడు. బంతి బౌండరీకి వెళ్లనప్పటికీ, అక్కడే ఉన్న సిరాజ్ వెనక్కి పరిగెత్తి క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అతడికి చాలా దూరంలో పడింది. క్యాచ్ పట్టడం కష్టమని తెలిసినా కూడా జడేజా మాత్రం సిరాజ్ చర్యపట్ల అసహనం వ్యక్తం చేస్తూ గట్టిగా అరిచాడు. దీంతో సిరాజ్‌కు చిర్రెత్తుకొచ్చి.. ‘అరె జడ్డూ బాయ్.. నువ్వు నా ఏరియాలో నిలబడి ఫీల్డింగ్ చెయ్యు.. అప్పుడు నీకే క్లారిటీ వస్తుంది’ అని నవ్వుతూనే కౌంటర్ ఇచ్చాడు. దీనికి ప్రతిచర్యగా జడేజా మాత్రం ‘సరే వదిలెయ్’ అన్నట్లుగా తలూపాడు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాటలు అరుచుకున్నప్పటికీ కాసేపటికే ఇద్దరూ కూల్ అయ్యారు. మ్యాచ్ విషయానికొస్తే.. బుధవారం నాలుగో రోజు ఆటలో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దాటికి లంక టాపార్డర్ కుదేలు కాగా.. నాలుగో స్థానంలో వచ్చిన పసిందు సూరియబండారా (80) జట్టును ఆదుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్ సొనాల్ దినుష శతకం (103)తో చెలరేగాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్, ప్రసిద్ కృష్ణ చెరో మూడు వికెట్లు కూల్చగా.. డెబ్యూ ఆటగాడు సారాంశ్ రెండు, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు. దీంతో టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అయితే లంకను ఫాలో ఆన్ ఆడించేందుకు టీమిండియా మొగ్గు చూపింది. లంక తమ రెండో ఇన్నింగ్స్‌లోనూ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. రోజు ముగిసేసరికి 5 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కించుకున్న లంక 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అంతకముందు టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.pic.twitter.com/jFfDPp6M6B— crictalk (@crictalk7) August 26, 2026Read: 27 ఏళ్లకే కెరీర్ క్లోజ్; ప్రతీకార చర్యకు మాజీ క్రికెటర్ సిద్ధం! -
టీమిండియా కొంపముంచిన ప్రసిధ్.. గంభీర్, జడేజా ఆగ్రహం!
కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఫాలో ఆన్ ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఫాలో ఆన్‌లో మాత్రం లంక జాగ్రత్తగా ఆడుతోంది. భారత్‌కు విజయం దక్కనివ్వొద్దనే కాంక్షతో లంక బ్యాటర్లు జిడ్డు బ్యాటింగ్‌ను ప్రదర్శిస్తున్నారు. దీనికి తోడు టీమిండియా ఫీల్డర్లు పలు క్యాచ్‌లు జారవిడవడం కూడా లంకకు కలిసొచ్చింది. ముఖ్యంగా పసిందు సూరియబండారా భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ప్రస్తుతం 90 పరుగులతో ఆడుతున్న సూరియబండారా 21 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతడు ఇచ్చిన క్యాచ్‌ను ప్రసిధ్ క్రిష్ణ వదిలేయడం భారత్ కొంపముంచింది. జడేజా వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. జడేజా వేసిన ఫ్లైటెడ్ డెలివరీని పసిందు బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న ప్రసిధ్ క్యాచ్ అందుకోవడం కష్టతరమైనప్పటికీ, కాస్త ముందుకు డైవ్ చేసి ఉంటే సులువుగా క్యాచ్ తీసుకునేవాడే. కానీ అతడు ప్రయత్నం చేయకపోవడంతో బంతి అతని చేతి వేళ్లను తాకుతూ పక్కకు వెళ్లిపోయింది. ఇది చూసిన జడేజా..‘ అరె బాయ్.. ఏ క్యా హై?’ అంటూ ప్రసిధ్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం స్టంప్ మైక్‌లో రికార్డయింది. ఇదే సమయంలో డ్రెసింగ్ రూమ్ నుంచి గమనిస్తున్న కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ప్రసిధ్ క్యాచ్ జారవిడవడంపై అసహనం వ్యక్తం చేస్తున్న ఫొటోలు కెమెరా కంటికి చిక్కాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలా క్యాచ్ డ్రాప్‌తో బతికిపోయిన పసిందు సూరియబండారా ఇప్పుడు సెంచరీకి చేరువలో ఉన్నాడు. తనకు వచ్చిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న పసిందు ఆ తర్వాత ఫిఫ్టీ సాధించడంతో పాటు తన జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నాడు. ఒకవేళ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పసిందు ఇచ్చిన క్యాచ్‌ను ప్రసిధ్ అందుకొని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.pic.twitter.com/YHn9sJJyfU— crictalk (@crictalk7) August 26, 2026Read: నంబర్‌వన్ బౌలర్‌గా స్టార్క్.. 16 ఏళ్ల కెరీర్లో తొలిసారి -
22లో 18 వృథా.. జడేజా చెత్త రికార్డు; గిల్ జాగ్రత్త!
భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు టెస్టుల్లో మంచి రికార్డు ఉంది. అశ్విన్‌తో కలిసి బౌలింగ్‌ను పంచుకున్న జడేజా టీమిండియా సాధించిన ఎన్నో విజయాల్లో భాగమయ్యాడు. వేగంగా ఓవర్లు పూర్తి చేయడంలో జడేజా సిద్ధహస్తుడు. ఇక వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడం జడ్డూ శైలి కావడంతో బ్యాటర్లు ఎక్కువగా ఎల్బీడబ్ల్యూగానే వికెట్ ఇచ్చుకుంటారు. కానీ ఇప్పుడు అదే ఎల్బీడబ్ల్యూలకు సంబంధించి డీఆర్ఎస్ తీసుకునే విషయంలో జడేజా చెత్త రికార్డు నెలకొల్పాడు. సుదీర్ఘ ఫార్మాట్లో గణాంకాల పరంగా మెరుగ్గానే ఉన్నప్పటికీ.. డీఆర్ఎస్(అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించడం)లో మాత్రం జడ్డూ వరుసగా ఫెయిలవుతూ వస్తున్నాడు. ఇప్పటివరకూ అతడు వరుసగా 22 రివ్యూలను కోల్పోయాడు. వీటిలో నాలుగు దఫాలు మాత్రమే అంపైర్ కాల్‌గా వెళ్లాయి. గత మూడేళ్ల కాలంలో జడేజా 22 సార్లు డీఆర్ఎస్లు తీసుకోగా.. అందులో 18 రివ్యూలు వృథా అయ్యాయి.దీంతో ఇన్ని రివ్యూలు కోల్పోయిన తొలి ఆల్‌రౌండర్‌గా జడేజా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. చివరిసారిగా 2023లో జడేజా తీసుకున్న రివ్యూ విజయవంతమైంది. ఆ ఏడాది జూలైలో డొమినికా టెస్టులో వెస్టిండీస్‌పై తొలి ఇన్నింగ్స్‌లో రివ్యూతో కీమర్ రోచ్ వికెట్‌ను దక్కించుకున్నాడు. అప్పటి నుంచి జడేజా మళ్లీ రివ్యూల్లో సక్సెస్ కాలేదు. అందుకే కెప్టెన్‌గా గిల్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. గతంలో ఆటగాళ్లు పట్టుబట్టినా రివ్యూలు తీసుకోని మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి గిల్ నేర్చుకోవాల్సిన అవసరముంది. ఇక జడేజా ఇప్పటివరకు 90 టెస్టుల్లో 4,117 పరుగులు చేయడంతో పాటు 352 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 15సార్లు ఐదు వికెట్లు, మూడు దఫాలు పది వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.Ravindra Jadeja has had his last 22 DRS reviews struck down as a bowler in Tests. Only four of them have turned out to be umpire's call 🤯His last successful review as a bowler came in the West Indies' first innings in the Dominica Test in July 2023, with the dismissal of Kemar… pic.twitter.com/H6uqCc0OCR— Cricinfo (@cricinfo) August 25, 2026చదవండి: జిడ్డులా తగులుకున్నాడు.. లంక బ్యాటర్ అరుదైన రికార్డు! -
జిడ్డులా తగులుకున్నాడు.. లంక బ్యాటర్ అరుదైన రికార్డు!
కొలంబో వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్ సోనల్ దినూష ఒంటరిపోరాటం చేస్తున్నాడు. మూడోరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 8 వికెట్లు కోల్పోయినప్పటికీ దినూష వికెట్ తీయడంలో మాత్రం భారత బౌలర్లు విఫలమయ్యారు. ప్రస్తుతం దినూష 85 పరుగులతో అజేయంగా క్రీజులో ఉన్నాడు.తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన దినూష రెండో టెస్టులోనూ లంక పాలిట ఆపద్బాంధవుడయ్యాడు. ఒకపక్క వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ, దినూష మాత్రం తన బ్యాటింగ్‌తో భారత్‌కు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. ఈ నేపథ్యంలోనే సోనల్ దినూష టెస్టుల్లో ఒక అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.భారత్‌తో జరిగిన టెస్టుల్లో తొలి మూడు ఇన్నింగ్స్‌ల్లో 80 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన మూడో బ్యాటర్‌గా దినూష నిలిచాడు. తొలి టెస్టులో దినూష మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగులు, తాజాగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 85 పరుగులతో అజేయంగా కొనసాగుతున్నాడు. గతంలో జహీర్ అబ్బాస్ (176, 96, 235 నాటౌట్), ఎవర్టన్ వీక్స్ (128, 194, 162) భారత్‌పై ఈ ఫీట్ అందుకున్నారు. అయితే భారత్‌పై టెస్టుల్లో తొలి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్‌గా ఎవర్టన్ వీక్స్ నిలిచాడు.స్వీప్ షాట్లతో మరో రికార్డుపనిలో పనిగా దినూష మరో రికార్డు కూడా అందుకున్నాడు. అదేంటంటే, ఒక టెస్టు సిరీస్‌లో స్పిన్నర్ల బౌలింగ్‌లో స్వీప్ షాట్లు ఆడుతూ ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో దినూష (106 పరుగులు) ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి స్థానం కూడా జో రూట్‌దే.2021లో శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో రూట్ స్పిన్నర్ల బౌలింగ్‌లో స్వీప్ షాట్లు ఆడి 160 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత మరో ఇంగండ్ బ్యాటర్ బెన్ డకెట్ 2022లో పాకిస్తాన్ తో టెస్టు సిరీస్‌లో స్వీప్ షాట్ల రూపంలో 112 పరుగులు సాధించాడు. దినూష తర్వాత యూనిస్ ఖాన్ (103 పరుగులు), మిస్బా ఉల్ హక్ (103 పరుగులు) సంయుక్తంగా నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.లంక తరఫున రెండో బ్యాటర్గాశ్రీలంక తరఫున భారత్‌పై తొలి మూడు టెస్టు ఇన్నింగ్స్‌లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన రెండో బ్యాటర్‌గానూ సోనల్ దినూష నిలిచాడు. గతంలో 1982లో దులీప్ మెండిస్ భారత్‌పై వరుసగా 105, 105, 51 పరుగులు సాధించాడు. సోనల్ దినూష స్పిన్ బౌలింగ్‌లో సాధించిన 284 పరుగుల్లో 122 రన్స్ (42.95 శాతం) స్వీప్, స్లాగ్, రివర్స్ షాట్ల ద్వారా సాధించడం విశేషం. ఇందులో 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. మ్యాచ్ విషయానికొస్తే.. మూడోరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. సోనల్ దినూష (85), లాహిరు కుమారా (8) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్, ప్రసిధ్ క్రిష్ణలు చెరో 3 వికెట్లు తీశారు. లంక మరో 238 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పడిక్కల్, ధ్రువ్ జురెల్ శతకాలతో చెలరేగారు.Sonal Dinusha keeps Sri Lanka’s hopes alive against India in Colombo 👊#WTC27 📝: https://t.co/8NP3Qr1pnQ pic.twitter.com/3HMx47B3av— ICC (@ICC) August 25, 2026Sonal Dinusha is only the second Sri Lankan batter to score three consecutive 50+ scores in his first three Test innings against India! 🇱🇰🤍🌟#SLvIND #Tests #WTC #Sportskeeda pic.twitter.com/DlAq45rejU— Sportskeeda (@Sportskeeda) August 25, 2026Read: ఆసీస్ తరఫున క్రికెట్ ఆడనున్న సంజయ్ బంగర్ కుమార్తె! -
అంపైర్లతో గొడవ.. లంక ఆటగాడికి షాకిచ్చిన ఐసీసీ
కొలంబో వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతు రెండో టెస్టు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. ఇప్పటికే జైస్వాల్, అసితా ఫెర్నాండో వివాదంపై సీరియస్ అయిన ఐసీసీ వారిద్దరికి జరిమానాతో పాటు డీమెరిట్ పాయింట్లు కేటాయించింది. తాజాగా ఈ జాబితాలో శ్రీలంక బౌలర్ ప్రబాత్ జయసూరియా కూడా చేరిపోయాడు. రెండో రోజు ఆట చివర్లో వెలుతురు మందగించడంతో తాము ఆడలేమంటూ జయసూరియా అంపైర్లతో వాదనకు దిగాడు. కానీ అంపైర్లు ఆటను కొనసాగించడానికే మొగ్గు చూపారు. అంపైర్లతో వాదన జరిగిన మరుక్షణమే ప్రబాత్ ఔటయ్యాడు. దీంతో పెవిలియన్ వెళుతూ బౌండరీ లైన్ వద్ద కోపంతో బ్యాట్‌ను నేలకేసి కొడుతూ, గ్లౌజులను విసిరేశాడు. ప్రబాత్ జయసూరియా చర్యలు ఐసీసీ నిబంధనలకు విరుద్ధం కావడంతో చర్యలకు ఉపక్రమించింది.‘‘అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతున్న సమయంలో క్రికెట్ పరికరాలు లేదా దుస్తులు, మైదాన పరికరాలు ఇతర వస్తువులను దుర్వినియోగం చేయడం ఐసీసీ నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుంది. ప్రబాత్ జయసూరియా ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించినట్లు తేలింది. అందుకే క్రమశిక్షణా చర్య కింద ఒక డీమెరిట్ పాయింట్ విధిస్తున్నాం. గత రెండేళ్లలో అతడికి ఇదే మొదటి ఉల్లంఘన కావడంతో ప్రస్తుతం డీమెరిట్ పాయింట్‌తో సరిపెడుతున్నాం’’ అని చెప్పుకొచ్చింది. అనంతరం ప్రబాత్ జయసూరియ తన తప్పును అంగీకరించడంతో విచారణ అవసరం లేదని ఐసీసీ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ పేర్కొన్నాడు.అసలేం జరిగిందంటే?భారత్ తొలి ఇన్నింగ్స్‌ను రెండో రోజు 503/9 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. రెండో రోజు ఆటకు కొన్ని ఓవర్లు మాత్రమే మిగిలి ఉండగా.. కొలంబోలో వెలుతురు మందగించింది. లంక తొలి వికెట్ కోల్పోవడంతో నైట్‌వాచ్‌మెన్‌గా వచ్చిన ప్రబాత్ జయసూరియా వెలుతురు సరిగా లేదని, ఆడడంలో ఇబ్బంది ఎదురవుతుందని అంపైర్లకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అంపైర్లు లైట్ మీటర్‌తో వెలుతురును పరిశీలించారు. అయితే ఆటను నిలిపివేయకుండా కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంపై శ్రీలంక బ్యాటర్లు జయసూర్య, కమీల్ మిశ్రా ఇద్దరూ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయినప్పటికీ అంపైర్లు తమ నిర్ణయం ప్రకారమే ఆటను కొనసాగించారు. ఈ క్రమంలో ఔటైన తర్వాత మైదానం వీడుతున్న సమయంలో ప్రభాత్ జయసూర్య పలుమార్లు అంపైర్ల వైపు కోపంగా చూస్తూ వెళ్లాడు. పెవిలియన్‌కు చేరుకున్న తర్వాత కోపంతో తన గ్లౌజులను విసిరేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.Nightwatchman sent packing! 🚶➡️ Manav Suthar strikes to pick up the wicket of Prabath Jayasuriya and wrap up the day on a high! 💥 Watch #SLvIND, 2nd Test, Day 3, Tomorrow, 9 AM onwards, LIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV… pic.twitter.com/pAKsoOncyK— Sony Sports Network (@SonySportsNetwk) August 24, 2026🚨Prabath Jayasuriya has been sanctioned by the ICC for breaching the Code of Conduct during the 2nd Test vs India.• Breached Article 2.2 pic.twitter.com/R6d4b8qPsD— TheWicketReport (@WicketReport) August 25, 2026Read: లంక కెప్టెన్‌ను ట్రాప్ చేసిన సర్ఫరాజ్; ఏం జరిగిందంటే? -
లంక కెప్టెన్‌ను ట్రాప్ చేసిన సర్ఫరాజ్; ఏం జరిగిందంటే?
కొలంబో వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఎదురీదుతోంది. ప్రస్తుతం 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసిన లంక మరో 299 పరుగులు వెనుకబడి ఉంది. ఈ విషయం పక్కనబెడితే శ్రీలంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా వికెట్ తీయడంలో సర్ఫరాజ్ ఖాన్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. మానవ్ సుతార్ బౌలింగ్‌లో ధనంజయ వెనుదిరగడానికి ముందు షార్ట్ లెగ్, సిల్లీ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ తన మాటలతో లంక కెప్టెన్‌ను కన్ఫ్యూజన్కు గురి చేశాడు."బ్రో ఇక్కడేం లేదు బ్రో, స్ట్రెయిట్‌గా చూడు. ఎందుకు ప్రతీసారి లెఫ్ట్, రైట్ (లాంగాన్, లాంగాఫ్) చూస్తున్నావు. నువ్వు టైం మొత్తం వృథా చేస్తున్నావు. భయపడకుండా ఆడు బ్రో. నువ్వు ఒక జట్టుకు కెప్టెన్ అన్న విషయం గుర్తుంచుకో. నువ్వు ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నావు" అని చెప్పడం మైక్స్టంప్లో రికార్డయింది. ఆ వెంటనే సుతార్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో, ఎడ్జ్ అవ్వడంతో రాహుల్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో 8 పరుగులు మాత్రమే చేసిన ధనంజయ డిసిల్వా పెవిలియన్ బాట పట్టాడు. ఇక తొలి టెస్టులో జైస్వాల్ కూడా లంక బ్యాటర్‌ను ఇలాగే కన్ఫూజన్‌కు గురి చేసి అతడు ఔటవ్వడంలో కీలకపాత్ర పోషించాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పడిక్కల్, ధ్రువ్ జురెల్‌లు శతకాలతో విరుచుకుపడ్డారు. గిల్, పంత్ అర్ధసెంచరీలు సాధించారు. ఇక లంక రెండో రోజు ఆటలో టీ విరామ సమయానికి 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. సోనాల్ దినూష (52), కెషారా నువంతా (13) బ్యాటింగ్ చేస్తున్నారు.pic.twitter.com/7F5qE7iWGR— crictalk (@crictalk7) August 25, 2026 “You are wasting time bro, don’t be scared… YOU ARE THE CAPTAIN!”— Sarfaraz Khan to De Silva.Two balls later… DE SILVA DEPARTS!😭💀🔥Sarfaraz’s words aged like fine wine! 😂🏏. 📷: SonyLiv. #SrilankaVsIndia #2ndTestMatch #SarfarazKhan #DeSilva #Wickets #Cricket… pic.twitter.com/Clhw6ArMe5— Cricket Gyan (@cricketgyann) August 25, 2026చదవండి: అన్మోల్ సిక్సర్ల వర్షం..సెమీస్‌కు సౌత్ ఢిల్లీ -
‘దమ్ముంటే సెంచరీ చెయ్యు’.. లంక ప్లేయర్‌కు జురెల్ స్ట్రోక్!
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. 99 నుంచి 100 పరుగుల మార్క్ అందుకోవడానికి 22 బంతులాడినప్పటికీ, మరిచిపోలేని అనుభూతిని పొందాడు. సెంచరీ సెలబ్రేషన్లో కండల ప్రదర్శన చేయడంపై వివరణ ఇచ్చిన ధ్రువ్ జురెల్ మరో ఆసక్తికర విషయాన్ని కూడా పంచుకున్నాడు. తాను సెంచరీ చేయడం వెనుక లంక ఆటగాడు నిరోషన్ డిక్వెల్లా కూడా ఒక కారణమని జురెల్ పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జురెల్ మాట్లాడుతూ.. ‘‘నేను క్రీజులోకి వచ్చిన వెంటనే డిక్వెల్లా నీకు దమ్ముంటే ఇక్కడ సెంచరీ చేసి చూపించు. కానీ నువ్వు అది చేయలేవు అని సవాల్ విసిరాడు. కానీ ఆ క్షణంలో నేనేమీ మాట్లాడలేదు. నోటితో కాకుండా బ్యాట్‌తో సమాధానం చెప్పాలని అనుకున్నా. నేను అనుకున్నట్లుగానే ఓపికను ప్రదర్శించి అద్భుత సెంచరీతో అజేయంగా నిలిచాను. ఆ తర్వాత డిక్వెల్లా దగ్గరకు వెళ్లి నువ్వు అడిగింది నేను చేసి చూపించాను.. ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగాను. కానీ అతడి నుంచి మాత్రం ఎలాంటి సమాధానం రాలేదు.’’ అని చెప్పుకొచ్చాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి 8 పరుగులు చేసింది. ప్రస్తుతం లంక జట్టు మరో 495 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పడిక్కల్, జురెల్ శతకాలతో చెలరేగగా, గిల్, పంత్ అర్ధసెంచరీలతో రాణించారు.This DJ’s got some crazy drops! 🎧💯Second Test ton for Dhruv Jurel, with a little late drama for good measure! 😮💨 Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/EPPFd2doQS— Sony Sports Network (@SonySportsNetwk) August 24, 2026Read: సెంచరీ సెలబ్రేషన్.. కండల ప్రదర్శనపై జురెల్ స్పందన! -
సెంచరీ సెలబ్రేషన్.. కండల ప్రదర్శనపై జురెల్ స్పందన!
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్ ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీతో మెరిశాడు. టెస్టుల్లో ఏడో స్థానం లేదా అంతకంటే తక్కువ స్థానంలో వచ్చి సెంచరీ బాదిన రెండో భారత బ్యాటర్‌గా జురెల్ రికార్డులకెక్కాడు. సెంచరీ చేసిన వెంటనే గాలిలోకి పిడికిలి బిగించిన జురెల్, ఆ తర్వాత హెల్మెట్ తీసేసి కండలను ప్రదర్శించడం హైలైట్‌గా నిలిచింది. అయితే అతడి ఎడమ చేతి బైసిప్స్పై పచ్చబొట్టు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. జురెల్ చేతిపై ఉన్న టాటూ ఏంటా అని అభిమానులు ఆరా తీయగా.. ‘జై జవాన్.. జై కిసాన్’ అని రాసి ఉండడం కనిపించింది.సెంచరీ చేయగానే సెలబ్రేషన్స్‌లో భాగంగా జురెల్ కండలు చూపించాడనుకుంటే మాత్రం పొరపాటే అవుతుంది. నిజానికి అతను ప్రదర్శించిన పచ్చబొట్టు వెనుక చిన్న కథ దాగుంది. తాజాగా మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కండలను ప్రదర్శించడం వెనుక దాగున్న అసలు విషయాన్ని ధ్రువ్ జురెల్ పంచుకున్నాడు.‘కండల ప్రదర్శన ఊరికే చేయలేదు. మా తాత రైతు, తండ్రి సైనికుడు. వారి మూలాలను ఎప్పటికీ మర్చిపోకూడదనే ఉద్దేశంతోనే కండల ప్రదర్శనతో సెలబ్రేషన్ చేసుకున్నా. ఆ టాటు వెనుక ఉన్న అర్ధం కూడా అదే’ అని జురెల్ చెప్పుకొచ్చాడు. సెంచరీ తర్వాత తాను చేసిన సెలబ్రేషన్స్ కూడా తన కుటుంబానికి అంకితం చేశానని జురెల్ పేర్కొన్నాడు.జురెల్ గతంలోనూ భారత్ తరపున హాఫ్ సెంచరీ లేదా సెంచరీ చేసిన సందర్భాల్లో తన తండ్రికి నివాళిగా ఆర్మీ సెల్యూట్ చేసేవాడు. ఇప్పుడు టాటూను చూపిస్తూ చేసిన కొత్త రకమైన సెలబ్రేషన్ చేయడం వెనుక, తన కుటుంబ నేపథ్యం ముడిపడి ఉండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం.ఇక మ్యాచ్ విషయానికొస్తే రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసేసమయానికి శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి 8 పరుగులు చేసింది. ప్రస్తుతం లంక జట్టు మరో 495 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పడిక్కల్, జురెల్ శతకాలతో చెలరేగగా, గిల్, పంత్ అర్ధసెంచరీలతో రాణించారు.HUNDRED MOMENT OF DHRUV JUREL! 💯🇮🇳DHruv Jurel’s 2nd Test century — and both times, Mohammed Siraj was at the non-striker’s end to celebrate with him. Truly special!🥹❤️pic.twitter.com/9Fo8bBKIHu— Cricket Apna 🇮🇳 (@cricketapna1) August 24, 2026 "जय जवान, जय किसान"🗣️ My grandfather was a farmer and my father, a soldier.🫡Dhruv Jurel reveals the reason behind the special celebration and the tattoo on his arm after reaching his 💯 👌#TeamIndia | #SLvIND | @dhruvjurel21 pic.twitter.com/pQlM1r84hN— BCCI (@BCCI) August 24, 2026చదవండి: నిరాశపరిచిన భారత్.. సెమీస్ చేరకుండానే ఇంటిబాట -
హద్దుమీరిన జైస్వాల్; ఇది రెండోసారి.. నిషేధం తప్పదా?
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి లంక ఆటగాళ్లను రెచ్చగొట్టే చర్యతో వివాదంలో చిక్కుకున్నాడు. లంక ఇన్నింగ్స్ సమయంలో ఆ జట్టు వికెట్ పడిన సందర్భంలో జైస్వాల్ శ్రుతిమించిపోయాడు. ప్రసిధ్ క్రిష్ణ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో లాహిరు ఉదారా ఔటయ్యాడు. ఇన్‌స్వింగర్ అయిన బంతిని లాహిరు ఉదారా డిఫెన్స్ చేసే ప్రయత్నంలో అతడి బ్యాట్ ఎడ్జ్‌కు తగిలింది. మూడో స్లిప్‌లో ఉన్న జైస్వాల్ వైపు బంతి దూసుకెళ్లింది. అంతే వేగంగా స్పందించిన జైస్వాల్ కుడివైపుకు పూర్తిగా డైవ్ చేసి అద్భుతరీతిలో క్యాచ్ అందుకున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ, అసలు కథ ఇక్కడే మొదలైంది. లాహిరు ఉదారా క్యాచ్ పట్టిన జైస్వాల్ గట్టిగా అరుస్తూ బంతిని గాల్లోకి విసిరాడు. అంతటితో ఆగకుండా లంక బ్యాటర్‌ను ఉద్దేశించి మాటల తూటాలు వదిలి మరోసారి ఐసీసీ క్రమశిక్షణా నిబంధనలను ఉల్లఘించాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం, ఆట స్ఫూర్తికి విరుద్ధంగా, దూకుడుగా లేదా అనుచితంగా సంబరాలు చేసుకునే ఆటగాళ్లు హద్దులు దాటి, అవుటైన బ్యాటర్‌ను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే సదరు ఆటగాళ్లను ఐసీసీ శిక్షిస్తుంది.ఆర్టికల్ 2.5 ప్రకారం, బ్యాటర్ అవుటైన తర్వాత అతని నుంచి తీవ్రమైన ప్రతిచర్యను రేకెత్తించే విధంగా ఆటగాళ్లు భాష, చర్యలు లేదా సంజ్ఞలను ఉపయోగించడాన్ని ఐసీసీ ఉపేక్షించదు. బ్యాటర్‌కు దగ్గరగా అతి ఉద్వేగభరితంగా లేదా దూకుడుగా సెండ్-ఆఫ్ చేయడం, లేదా ఆటగాడి ముఖం వద్దకు పరుగెత్తుకు వెళ్లడం వంటివి లెవెల్ 1 ఉల్లంఘన కిందకు వస్తోంది. దీని ఫలితంగా ఆటగాడి మ్యాచ్ ఫీజులో 15 నుంచి 50 శాతం వరకు జరిమానాతో పాటు అదనపు డీమెరిట్ పాయింట్లు కూడా విధించబడవచ్చు.ఇప్పటికే తొలి ఇన్నింగ్స్ సమయంలో అసితా ఫెర్నాండో కారణంగా ఐసీసీ నుంచి జరిమానా ఎదుర్కొన్న జైస్వాల్‌ను తాజా వివాదం ఎక్కడిదాకా తీసుకెళ్తుందో చూడాలి. ఒకవేళ జైస్వాల్ చర్యను ఐసీసీ పరిగణలోకి తీసుకుంటే మాత్రం జైస్వాల్‌కు ఈసారి భారీ జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం ఎదుర్కొనే అవకాశం కూడా లేకపోలేదు.Looks like Yashasvi Jaiswal has found his favourite opponent! 👀Just look at his reaction after taking that catch 😤#Cricket #SLvIND #yashasvijaiswalpic.twitter.com/9gRxm3SXNv— CREX (@Crex_live) August 24, 2026 🔴 PEAK AGGRESSION FROM YASHASVI JAISWAL 🤯- Looks like he still hasn’t forgotten the sledging from the Sri Lankan players 😭 pic.twitter.com/HBgvEmKvRN— Sam (@cricsam02) August 24, 2026Read: దులీప్ ట్రోఫీలో ఈస్ట్‌జోన్ బౌలర్ సంచలనం -
కష్టాల్లో పడిన లంక.. రెండోరోజు భారత్‌దే ఆధిపత్యం
కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. కమిల్ మిషారా 5 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మానవ్ సుతార్, ప్రసిధ్ క్రిష్ణలు చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం లంక 495 పరుగుల వెనుకబడి ఉంది. మొదటి రోజులాగే రెండో రోజు ఆటలో కూడా భారత్‌దే ఆధిపత్యం. పడిక్కల్, జురెల్ శతకాలతో చెలరేగితే, ఆ తర్వాత బౌలింగ్‌లో మానవ్ సుతార్, ప్రసిధ్ క్రిష్ణలు చెలరేగడంతో లంకకు ఆదిలోనే షాకులు తగిలాయి.అంతకముందు తమ తొలి ఇన్నింగ్స్‌ను టీమిండియా 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది .బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత బ్యాటర్లు చెలరేగడంతో తొలి టెస్టు తరహాలోనే రెండో టెస్టులోనూ భారత్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. దేవదత్ పడిక్కల్ (193 బంతుల్లో 117), ధ్రువ్ జురెల్ (115 నాటౌట్)సెంచరీలతో చెలరేగారు. మిగతా బ్యాటర్లలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ (63), కెప్టెన్ గిల్ (50) అర్ధసెంచరీలు సాధించగా, జైస్వాల్ (45), జడేజా (43) రాణించారు. లంక బౌలర్లలో అసితా ఫెర్నాండో 4 వికెట్లు తీయగా, కెషారా నువంతా, ప్రబాత్ జయసూరియ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఓవర్‌నైట్ స్కోరు 300/5తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 307 పరుగుల వద్ద డెబ్యూ ఆటగాడు సారాంశ్ జైన్ (6) ఔట్ కావడంతో ఆరో వికెట్ కోల్పోయింది. మొదటి రోజు ఆటలో గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన రిషబ్ పంత్ మళ్లీ క్రీజులోకి వచ్చాడు. ధ్రువ్ జురెల్‌తో కలిసి పంత్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ ఇద్దరు కలిసి ఏడో వికెట్‌కు 152 బంతుల్లో 112 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే పంత్, జురెల్‌లు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వర్షం అంతరాయంతో టీ బ్రేక్ సమయానికి భారత్ 8 వికెట్ల నష్టానికి 475 పరుగుల వద్ద నిలిచింది. వర్షం తర్వాత భారత్ ఇన్నింగ్స్ ఎక్కువ సేపు సాగకపోయినప్పటికీ, జురెల్ తన కెరీర్లో రెండో టెస్టు సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత సిరాజ్ (3) ఔటవ్వడంతో భారత్ 489 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత జురెల్ ఒక సిక్సర్ సహా రెండు ఫోర్లు కొట్టడంతో టీమిండియా స్కోరు 500 పరుగుల మార్క్ దాటింది. వెంటనే కెప్టెన్ గిల్ 503 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.Read: వైభవ్ సూర్యవంశీ ప్లాఫ్ షో వెనుక కారణమిదే? -
పడిక్కల్, ధ్రువ్ జురెల్ శతకాలు.. భారత్ 503/9 డిక్లేర్
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది .బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై భారత బ్యాటర్లు చెలరేగడంతో తొలి టెస్టు తరహాలోనే రెండో టెస్టులోనూ భారత్ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. దేవదత్ పడిక్కల్ (193 బంతుల్లో 117), ధ్రువ్ జురెల్ (115 నాటౌట్)సెంచరీలతో చెలరేగారు.మిగతా బ్యాటర్లలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ (63), కెప్టెన్ గిల్ (50) అర్ధసెంచరీలు సాధించగా, జైస్వాల్ (45), జడేజా (43) రాణించారు. లంక బౌలర్లలో అసితా ఫెర్నాండో 4 వికెట్లు తీయగా, కెషారా నువంతా, ప్రబాత్ జయసూరియ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఓవర్‌నైట్ స్కోరు 300/5తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 307 పరుగుల వద్ద డెబ్యూ ఆటగాడు సారాంశ్ జైన్ (6) ఔట్ కావడంతో ఆరో వికెట్ కోల్పోయింది. పంత్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యంఅయితే మొదటి రోజు ఆటలో గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన రిషబ్ పంత్ మళ్లీ క్రీజులోకి వచ్చాడు. ధ్రువ్ జురెల్‌తో కలిసి పంత్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ ఇద్దరు కలిసి ఏడో వికెట్‌కు 152 బంతుల్లో 112 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే పంత్, జురెల్‌లు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. వీరిద్దరి జోడీ బలపడుతున్న తరుణంలో కెషారా నువంతా బౌలింగ్‌లో పంత్ (63) వెనుదిరిగాడు. టెస్టు కెరీర్లో రెండో సెంచరీఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మానవ్ సుతార్ (18) సాయంతో ధ్రువ్ జురెల్ ఇన్నింగ్స్ పరుగులు పెట్టించాడు. వర్షం అంతరాయంతో టీ బ్రేక్ సమయానికి భారత్ 8 వికెట్ల నష్టానికి 475 పరుగుల వద్ద నిలిచింది. వర్షం తర్వాత భారత్ ఇన్నింగ్స్ ఎక్కువ సేపు సాగకపోయినప్పటికీ, జురెల్ తన కెరీర్లో రెండో టెస్టు సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత సిరాజ్ (3) ఔటవ్వడంతో భారత్ 489 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత జురెల్ ఒక సిక్సర్ సహా రెండు ఫోర్లు కొట్టడంతో టీమిండియా స్కోరు 500 పరుగుల మార్క్ దాటింది. వెంటనే కెప్టెన్ గిల్ 503 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు.Read: వైభవ్ సూర్యవంశీ ప్లాఫ్ షో వెనుక కారణమిదే? -
జైస్వాల్, లంక బౌలర్ మధ్య వాగ్వాదం; కొట్టుకోవడమే తరువాయి!
కొలంబో వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో జైస్వాల్ ఔటైన తర్వాత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయిన జైస్వాల్ పెవిలియన్ వెళుతున్న సమయంలో లంక బౌలర్ తన మాటలతో రెచ్చగొట్టాడు. దీంతో పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న జైస్వాల్ ఒక్కసారిగా వెనక్కితిరిగి అసిత ఫెర్నాండోవైపు దూసుకొచ్చాడు. ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకోగా, కోపంతో జైస్వాల్.. ఫెర్నాండో కళ్లలోకి చూస్తూ తన హెల్మెట్‌తో అతడిని నెట్టివేసే ప్రయత్నం చేశాడు. పరిస్థితి సీరియస్‌గా మారుతుందని గ్రహించిన లంక కెప్టెన్ ధనంజయ డిసిల్వా జైస్వాల్‌ను పక్కకు తీసుకెళ్లి అక్కడి నుంచి పంపించేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా జైస్వాల్ ఔటవ్వడానికి ముందు ఫెర్నాండో బౌలింగ్‌లోనే వరుసగా మూడు ఫోర్లు బాదాడు. అయితే ఫెర్నాండో తన మరుసటి బంతికే జైస్వాల్‌ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో లంక బౌలర్ కోపంతో పరిధి దాటి కామ్‌గా వెళుతున్న జైస్వాల్‌ను గెలికి మరి కయ్యం పెట్టుకున్నాడు. ఇక మ్యాచ్‌లో జైస్వాల్ వన్డే తరహా ఆటతీరును ప్రదర్శించాడు. 53 బంతుల్లో 45 పరుగులు చేసిన జైస్వాల్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు ఉండడం విశేషం. Body contact between Jaiswal and Asitha Fernando.. #SLVIND pic.twitter.com/w3Q905WUIf— Nibraz Ramzan (@nibraz88cricket) August 23, 2026 HEATED MOMENT BETWEEN JAISWAL & ASITHA 🤯 pic.twitter.com/SzgcNjYDUN— Johns. (@CricCrazyJohns) August 23, 2026Read: 95 రన్స్‌కే బంగ్లా ఆలౌట్.. రెండో టెస్టులో ఆసీస్ ఘన విజయం -
అరంగేట్రంతోనే అరుదైన రికార్డు.. ఎవరీ సారాంశ్?
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు ద్వారా టీమిండియా తరఫున సారాంశ్ జైన్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. కాగా 21వ శతాబ్దంలో టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతిపెద్ద వయస్కుడిగా సారాంశ్ జైన్ నిలిచాడు. సారాంశ్ ప్రస్తుత వయస్సు 33 ఏళ్ల 145 రోజులు. ఈ నేపథ్యంలో 2000 సంవత్సరంలో ఢాకాలో బంగ్లాదేశ్‌పై 32 ఏళ్ల 362 రోజుల వయస్సులో అరంగేట్రం చేసిన సబా కరీం రికార్డును సారాంశ్ అధిగమించాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడ ఆటతీరును ప్రదర్శిస్తున్న సారాంశ్ జైన్‌కు ఎట్టకేలకు టీమిండియాకు ఆడే అవకాశం లభించింది. ఇన్ఫెక్షన్ కారణంగా టెస్టుకు దూరమైనట్లు పేర్కొన్నప్పటికీ, తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్ పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే అతడి స్థానంలో సారాంశ్ జైన్‌ను తుదిజట్టులోకి తీసుకున్నారు. జడేజా చేతుల మీదుగా సారాంశ్ జైన్ టెస్టు క్యాప్ అందుకున్నాడు. ఐపీఎల్ ఆడకుండానే డెబ్యూసారాంశ్ జైన్ మరో రికార్డు కూడా అందుకున్నాడు. ఐపీఎల్లో ఆడకుండానే జాతీయ జట్టుకు ఎంపికైన మూడో ఆటగాడిగా సారాంశ్ నిలిచాడు. గతంలో మురళీ విజయ్ (2008 నాగ్‌పూర్ టెస్టు వర్సెస్ ఆస్ట్రేలియా), మొహమ్మద్ షమీ (2013 ఢిల్లీ వన్డే వర్సెస్ పాకిస్తాన్) ఈ ఫీట్ సాధించారు.Photo Credit: BCCI Twitterఎవరీ సారాంశ్ జైన్?తన ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో ముప్పతిప్పలు పెట్టగల సారాంశ్ జైన్ బ్యాటింగ్ చేయడంలోనూ సమర్ధుడు. దేశవాళీ క్రికెట్లో అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్.. రెండు విభాగాల్లోను తాను ఆడిన జట్లకు విలువైన సహకారం అందిస్తూ వచ్చాడు. అయితే గాయం కారణంగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో బీసీసీఐ సెలెక్లర్ట బృందం సుందర్ స్థానంలో సారాంశ్ జైన్‌ను టెస్టు జట్టుకు ఎంపిక చేసింది. లంకతో టెస్టు సిరీస్‌కు ముందే లంక-ఏ జట్టుతో ఆడిన తొలి అనధికారిక టెస్టులోనే సారాంశ్ జైన్ తన ప్రతిభను చాటాడు. రెండో టెస్టులో ఆరు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో అజేయంగా 70 పరుగులు సాధించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. Photo Credit: BCCI Twitterఇక 2025-26 రంజీ సీజన్లో మధ్యప్రదేశ్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లలో సారాంశ్ జైన్ ఒకడు. ఆ సీజన్లో మధ్యప్రదేశ్ తరఫున ఏడు మ్యాచ్‌లాడిన సారాంశ్ 57.55 సగటుతో 518 పరుగులు చేశాడు, ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ సారాంశ్ 20.43 సగటుతో 30 వికెట్లు పడగొట్టి ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేశాడు.A new chapter begins. 🧢 Saransh Jain receives his maiden Test cap from Ravindra Jadeja in the #TeamIndia huddle ✨ Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/sXTILXMIOg— Sony Sports Network (@SonySportsNetwk) August 23, 2026 The feeling of making your Test Debut ✨#TeamIndia all-rounder Ravindra Jadeja presents the Test cap to Saransh Jain 👏👏Updates ▶️ https://t.co/r9FgXSdsMf#SLvIND pic.twitter.com/6H6KrUdSkU— BCCI (@BCCI) August 23, 2026చదవండి: టాస్ గెలిచిన టీమిండియా.. సారాంశ్ జైన్ అరంగేట్రం -
SL Vs IND: ముగిసిన తొలి రోజు ఆట.. భారత్‌దే పైచేయి
Sri Lanka Vs India 2nd Test Match Updates: కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత బ్యాటర్లు సత్తాచాటారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. దేవ్‌దత్త్ పడిక్కల్(117) సెంచరీతో కదం తొక్కగా.. శుబ్‌మన్ గిల్(50), యశస్వి జైశ్వాల్(45), రవీంద్ర జడేజా(43) రాణించారు.టీమిండియా ఐదో వికెట్ డౌన్టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన జడేజా.. ఫెర్నాండో బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి డెబ్యూ ఆటగాడు సారాన్ష్ జైన్ వచ్చాడు. 85 ఓవర్లకు భారత్ స్కోర్: 300/5నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా117 పరుగుల వద్ద దేవదత్ పడిక్కల్ ఔటయ్యాడు. కేషర నువంత బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రవీంద్ర జడేజాకు (36) జతగా ధ్రువ్ జురెల్ (5) క్రీజ్‌లోకి వచ్చాడు. పడిక్కల్ సెంచరీకొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ టీమిండియా యువ బ్యాటర్ దేవ్‌దత్త్ పడిక్కల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 168 బంతుల్లో పడిక్కల్ తన రెండో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.రిషబ్ పంత్ రిటైర్డ్ హర్ట్ కొలంబో టెస్టులో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్దు చేతి గాయం కారణంగా పంత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అతడి స్ధానంలో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. 59.4 ఓవర్లకు భారత్ స్కోర్: 215-3టీ బ్రేక్‌కు టీమిండియా స్కోరెంతంటే?టీ బ్రేక్ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. క్రీజులో దేవ్‌దత్త్ పడిక్కల్(63), రిషబ్ పంత్(0) ఉన్నారు.శుబ్‌మన్ గిల్ అవుట్శుబ్మన్ గిల్ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన గిల్.. అషితా ఫెర్నాండో బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో రిషబ్ పంత్ వచ్చాడు.గిల్ ఫిప్టీభారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 50 ఓవర్లకు టీమిండియా స్కోర్: 184/2150 రన్స్ మార్క్ దాటిన భారత్పడిక్కల్ (50) అజేయ అర్ధసెంచరీకి తోడు గిల్ (40) నిలకడగా ఆడుతుండడంతో టీమిండియా 150 పరుగుల మార్క్ దాటింది. ఈ ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 85 పరుగులు జోడించారు. ప్రస్తుతం భారత్ 42 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.సెంచరీ మార్క్ దాటిన టీమిండియాకొలంబో వేదికగా లంకతో రెండో టెస్టులో టీమిండియా సెంచరీ మార్క్ దాటింది. 30 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. గిల్ (25), పడిక్కల్ (18) పరుగులతో క్రీజులో ఉన్నారు. లంచ్ తర్వాత మొదలైన ఆటలంచ్ అనంతరం ఆట మొదలైంది. 27 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. పడిక్కల్ (15), గిల్ (12) పరుగులతో క్రీజులో ఉన్నారు.లంచ్ బ్రేక్లంచ్ విరామ సమయానికి టీమిండియా 25 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. పడిక్కల్ (13), శుబ్‌మన్ గిల్ (11) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు జైస్వాల్ (45) దూకుడు ఆటతీరును ప్రదర్శించగా, కేఎల్ రాహుల్ (18) ఆకట్టుకోలేకపోయాడు.రెండో వికెట్ డౌన్దూకుడుగా ఆడుతున్న భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ (45) అశితా ఫెర్నాండో బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 62 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. పడిక్కల్ 3 పరుగులతో ఆడుతున్నాడు.జైస్వాల్ దూకుడు.. టీమిండియా స్కోరెంతంటే?లంకతో రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ జోరు ప్రదర్శిస్తున్నాడు. వన్డే తరహాలో వేగంగా ఆడుతున్న జైస్వాల్ 51 బంతుల్లో 41 పరుగులతో ఆడుతున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు ఉన్నాయి. ఇక పడిక్కల్ రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం భారత్ 17 ఓవర్లలో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది.తొలి వికెట్ డౌన్18 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ లాహిరు కుమారా బౌలింగ్‌లో నిరోషన్ డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జైస్వాల్ (19), పడిక్కల్ క్రీజులో ఉన్నారు.నిలకడగా భారత్ బ్యాటింగ్లంకతో మొదలైన రెండో టెస్టులో భారత్ నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. జైస్వాల్ 14, కేఎల్ రాహుల్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.టాస్ గెలిచిన టీమిండియాశ్రీలంక, భారత్ మధ్య కొలంబో వేదికగా రెండో టెస్టు మ్యాచ్ మొదలైంది. ఈ నేపథ్యంలో సారాంశ్ జైన్ టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. సీనియర్ ఆల్‌రౌండర్ జడేజా చేతుల మీదుగా సారాంశ్ క్యాప్ అందుకున్నాడు. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపించని కుల్డీప్ యాదవ్‌పై వేటు పడింది. అతడి స్థానంలోనే సారాంశ్ తుది జట్టులోకి వచ్చాడు. భారత జట్టు అదొక్కటే మార్పు. శ్రీలంక కూడా రెండు ఛేంజెస్ చేసింది. కమిల్ మిశ్రా అరంగేట్రం చేయగా.. చండిమాల్ స్థానంలో పసిందు సూరియబండారా వచ్చాడు.భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, శరన్ష్ జైన్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణశ్రీలంక (ప్లేయింగ్ XI): లాహిరు ఉదార, కమిల్ మిషార, పసిందు సూర్యబండార, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా(కెప్టెన్), సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), కేషారా నువంత, ప్రబాత్ జయసూర్య, లహిరు కుమార, అసిత ఫెర్నాండోA look at #TeamIndia's Playing XI for the 2nd #SLvIND Test 👌👌Saransh Jain makes his international debut 👏👏Updates ▶️ https://t.co/r9FgXSdsMf pic.twitter.com/WOCtWZ9YcP— BCCI (@BCCI) August 23, 2026Read: బీసీసీఐకి కొత్త తలనొప్పి! -
గిల్, జైస్వాల్ ఫామ్‌పై నజర్.. ఒక్క ఇన్నింగ్స్ చాలు!
కొలంబో వేదికగా ఆదివారం నుంచి భారత్, శ్రీలంక మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టులో 165 పరుగుల తేడాతో విక్టరీ అందుకున్న టీమిండియా రెండో టెస్టులోనూ అదే జోరు ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే తొలి టెస్టులో కెప్టెన్ శుబ్‌మన్ గిల్, ఓపెనర్ యశస్వి జైస్వాల్‌లు రాణించడంలో విఫలమయ్యారు. దీంతో ఈ ఇద్దరు భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరముంది. అయితే గిల్ మాత్రం మంచి ఫామ్‌లో ఉన్నాడు. గత ఆరు ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు సాధించిన గిల్ తిరిగి ట్రాక్ ఎక్కేందుకు ఒక్క ఇన్నింగ్స్ చాలు. ఇప్పటికే కెప్టెన్‌గా గిల్ 10 టెస్టుల్లో 1100 పరుగులు సాధించాడు. ఇక ఓవరాల్‌గా 32 టెస్టుల్లో 1893 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్‌గా విదేశీ గడ్డపై తొలి టెస్టు సిరీస్‌ను గెలుచుకోవడానికి ఇదే మంచి అవకాశం. ఇటీవలే స్వదేశంలో ఆఫ్గన్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌ను గిల్ సారథ్యంలోనే టీమిండియా నెగ్గింది. ఇక జైస్వాల్ ఫామ్ మాత్రం కాస్త ఆందోళన కలిగిస్తోంది. గత 8 ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒక్క అర్ధసెంచరీ మాత్రమే సాధించాడు. ఆ ఒక్కటి కూడా గతేడాది న్యూఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌పై సాధించాడు. తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్‌తో సమన్వయలోపంతో రనౌట్ అయిన జైస్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.కేఎల్ రాహుల్, కుల్దీప్ గైర్హాజరు తొలి టెస్టులో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్న సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ శుక్రవారం ప్రాక్టీస్‌కు దూరంగా ఉండిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కండరాలు పట్టేసి ఇబ్బంది పడిన రాహుల్... రెండో టెస్టులో భారీ ఇన్నింగ్స్ ఆడాలని భావిస్తున్నాడు. లంకతో మొదటి టెస్టులో అతడు వరుసగా 82, 35 పరుగులు చేశాడు. గతంలోనే శ్రీలంకలో పర్యటించిన భారత జట్టులో సభ్యుడైన రాహుల్... తన అనుభవాన్నంతా రంగరించి స్పిన్ ఉచ్చును చేధించడంతోనే భారత్ తొలి మ్యాచ్‌లో సులువుగా గెలుపొందింది. అతడితో పాటు తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ప్రాక్టీస్ చేయలేదు. ఆటగాళ్లు కసరత్తులు చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న కుల్దీప్... అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయకుండానే మైదానాన్ని వీడాడు. సారాంశ్ జైన్ కొన్ని ఓవర్లు బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. అతడి బౌలింగ్‌లో పంత్, గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ‘రాహుల్, కుల్దీప్ విశ్రాంతి తీసుకుంటున్నారు’ అని బహుతులే పేర్కొన్నాడు. Read: లైవ్ మ్యాచ్.. ప్రత్యర్థి గూబ గుయ్‌మనిపించిన మెస్సీ! -
లంకపై విజయం.. గంభీర్ ప్లాన్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి సెషన్లో 20 ఓవర్ల పాటు ఒక్క వికెట్ కూడా పడకపోగా, లంక బ్యాటర్లు జిడ్డు ఆటను ప్రదర్శించారు. ముఖ్యంగా కెప్టెన్ ధనంజయ డిసిల్వా, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దినూషలు మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 95 పరుగులు జోడించారు. ఈ నేపథ్యంలోనే డ్రెస్సింగ్ రూమ్ నుంచి టీమిండియా ఆటను గమనిస్తూ వచ్చిన గంభీర్ బౌలర్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. 30 ఓవర్ల పాటు భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంపై గంభీర్ ఆగ్రహించాడు. దీంతో లంక 112 పరుగుల వద్ద ఉన్నప్పుడు డ్రింక్స్ బ్రేక్ రాగా, ఆ సమయంలో గంభీర్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి డగౌట్‌కు వచ్చి మాస్టర్ ప్లాన్ వివరించాడు. గంభీర్ ఇచ్చిన ప్లాన్ ఆటను పూర్తిగా మార్చేయడంతో ఆటకు అదే టర్నింగ్ పాయింట్ అయింది.సిరాజ్‌ను పిలిచిన గంభీర్ బౌలింగ్ ప్లాన్‌ను వివరించాడు. పేస్ అటాకింగ్‌ను పక్కనబెట్టి, పూర్తిగా స్పిన్నర్లతో బౌలింగ్ చేయించమని సిరాజ్‌కు వివరించాడు. ఈ విషయాన్ని వెంటనే కెప్టెన్ గిల్‌కు చేరవేయాలని తెలిపాడు. గంభీర్ సలహాను పాటించిన మరుక్షణమే టీమిండియాకు ఫలితం రావడం విశేషం. 94 పరుగుల జోడించి బలపడుతున్న ధనంజయ, దినూష జోడిని జడేజా విడదీశాడు. అలా టీమిండియా మళ్లీ విజయం ట్రాక్ ఎక్కినట్లయింది. మరో ఎండ్ నుంచి మానవ్ సుతార్ కూడా తన బౌలింగ్‌తో ముప్పతిప్పలు పెట్టడంతో లంక కష్టాలు రెట్టింపు అయ్యాయి. చివరకు 206 పరుగుల వద్ద లంక తమ ఇన్నింగ్స్‌ను ముగించడంతో 165 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది.🚨Gautam Gambhir Gives Mohammed Siraj a Bowling Plan to Break Sri Lanka’s Partnership🚨Indian bowlers are struggling to take wickets on the morning of Day 5, as Sri Lankan batters Dhananjaya de Silva and Sonal Dinusha are batting strongly and building a solid partnership.… pic.twitter.com/Bu6YQa8DXD— Central Cricket (@arshdeep3444) August 19, 2026చదవండి: పాక్ జట్టును అవమానించిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్! -
తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం
గాలే వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 165 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 77.4 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. సోనాల్ దినూష (84) టాప్ స్కోరర్‌గా నిలవగా, ధనంజయ డిసిల్వా (59) అర్ధసెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ ఆరు వికెట్లతో చెలరేగగా, ప్రసిధ్ క్రిష్ణ రెండు, జడేజా, సిరాజ్‌లు చెరో వికెట్ పడగొట్టారు. టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి మానవ్ సుతార్ పది వికెట్లు పడగొట్టడం విశేషం. ఈ విజయంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుంది.సంక్షిప్త స్కోర్లుభారత్ 462 & 193 ఆలౌట్శ్రీలంక 284 & 206 ఆలౌట్తొమ్మిదో వికెట్ డౌన్అంకతముందు మానవ్ సుతార్ ఐదు వికెట్లతో చెలరేగడంతో లంక 199 పరుగుల వద్ద తొమ్మిదో వికెట్ కోల్పోయింది. విజయానికి భారత్ ఒక్క వికెట్ దూరంలో ఉంది.ఎనిమిదో వికెట్ డౌన్మానవ్ సుతార్ బౌలింగ్‌లో ప్రబాత్ జయసూరియా గోల్డెన్ డకౌట్ కావడంతో శ్రీలంక 199 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అంతకముందు ప్రసిధ్ క్రిష్ణ బౌలింగ్‌లో డిక్వెల్లా వెనుదిరిగాడు. భారత్ విజయానికి మరో 2 వికెట్లు అవసరం.లంచ్ తర్వాత మొదలైన ఆటశ్రీలంక స్కోరు: 196/6(74)దినుష 81, కేశారా 13 పరుగులతో ఉన్నారులంచ్ విరామంలంచ్ విరామ సమయానికి శ్రీలంక 67 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. సోనాల్ దినూష (65 బ్యాటింగ్) ఒంటరి పోరాటం చేస్తుండగా, కెషారా నువంతా 8 పరుగులతో ఆతడికి సహకరిస్తున్నాడు. ప్రసిధ్ క్రిష్ణ, మానవ్ సుతార్ రెండు వికెట్లు తీయగా, జడేజా ఒక వికెట్ పడగొట్టాడు. భారత్ విజయానికి మరో నాలుగు వికెట్ల దూరంలో ఉంది. ఇంకా రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉన్న లంక గెలుపుకు 197 పరుగులు అవసరం. ఆరో వికెట్ డౌన్10 పరుగులు చేసిన నిరోషన్ డిక్వెల్లా ప్రసిధ్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో లంక 156 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. దినూష (54) ఒంటరిపోరాటం చేస్తున్నాడు. భారత్ విజయానికి నాలుగు వికెట్ల దూరంలో ఉంది.ఐదో వికెట్ డౌన్జడేజా బౌలింగ్‌లో ధనంజయ డిసిల్వా (59) ఔట్ కావడంతో శ్రీలంక 142 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. భారత్ విజయానికి ఐదు వికెట్లు అవసరం కాగా, గెలుపుకు లంక 230 పరుగుల దూరంలో ఉంది.లంక బ్యాటర్ల అర్ధశతకాలులంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దినూషలు హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ప్రస్తుతం లంక 4 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. లంక విజయానికి మరో 231 పరుగులు అవసరం.వంద పరుగుల మార్క్ దాటిన లంక372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక వంద పరుగుల మార్క్‌ను దాటింది. 43 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ధనంజయ (40), దినూష (33) క్రీజులో ఉన్నారు.ఐదోరోజు ఆట మొదలుగాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. ఈ నేపథ్యంలో ఐదో రోజు ఆట ప్రారంభం కాగా, భారత్ గెలుపుకు ఆరు వికెట్లు అవసరం. 372 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన లంక ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. కెప్టెన్ ధనంజయ డి సిల్లా 39 పరుగులు, సోనాల్ దినూష 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: IND vs SL: నాలుగో రోజు ఆట సాగిందిలా! -
జడ్డూ చర్యపై గంభీర్ అసహనం!
గాలే వేదికగా లంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నప్పటికీ, భారత్ విజయానికి 6 వికెట్లు అవసరం. 372 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక ప్రస్తుతం 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. కెప్టెన్ ధనంజయ డి సిల్వా 31 పరుగులు, సోనాల్ దినూష 25 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఐదోరోజు గాలేలో గంటల తరబడి భారీ వర్షం పడితే తప్ప ఆట రద్దుకు ఆస్కారం లేకపోవడంతో, లంక ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పిచ్ స్పిన్నర్లకు విపరీతంగా అనుకూలిస్తుండడంతో స్పిన్ త్రయం జడేజా, కుల్దీప్, మానవ్ సుతార్లు వికెట్ల వేటలో పడిపోయారు. ఇదిలా ఉంటే రవీంద్ర జడేజా చర్య పట్ల హెడ్‌కోచ్ గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు. నాలుగో రోజు ఆటలో జడేజా బౌలింగ్‌లో లంక కెప్టెన్ ధనంజయ డి సిల్వా ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో జడేజా వేసిన చివరి బంతి అద్భుతంగా టర్న్ తీసుకోవడంతో ఏడు పరుగులతో ఆడుతున్న ధనంజయ ఫస్ట్ స్లిప్‌లో సులభమైన క్యాచ్ ఇచ్చాడు. అయితే కీలక వికెట్ పడిందన్న ఆనందం టీమిండియాకు ఎంతోసేపు నిలవలేదు. కొంపముంచిన నో బాల్ఎందుకంటే జడేజా బంతిని వేసేటప్పుడు క్రీజు దాటి ముందుకు వెళ్లడంతో అంపైర్ దానిని నో బాల్‌గా ప్రకటించడంతో సంబరాలు ఆగిపోయాయి. అలా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ధనంజయ 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇదే సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న గంభీర్ ముఖ కవళికల్లో మార్పులు కనిపించాయి. కీలక వికెట్ పడిందన్న సంతోషం క్షణమైనా లేకుండా పోయిందే అన్న తరహాలో గంభీర్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. పనిలో పనిగా వికెట్ పడిందనుకున్న చోట జడేజా నో బాల్ కావడంతో అతడిపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గంభీర్ అసహనం వ్యక్తం చేయడం వెనుక బలమైన కారణం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఒక్కోసారి ఇలాంటి తప్పులే మ్యాచ్‌ను లాగేసుకునేందుకు ఆస్కారముంటుందన్నారు.ఆ భయంతోనే..ఏడు పరుగుల వద్ద లైఫ్ లభించిన ధనంజయ రోజు ముగిసేరికి అజేయంగా నిలిచాడు. అతడికి అండగా తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దినూష కూడా ఉండడంతో భారత్ విజయంపై చిన్న అనుమానం నెలకొని ఉంది. ఒకవేళ ధనంజయ భారత్ గెలుపుకు అడ్డుపుల్లగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదనిపిస్తోంది. అవకాశం వచ్చినప్పుడే దానిని ఉపయోగించుకోవాలి.. లేదంటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే అవుతుందేమో. అందుకే గంభీర్ జడేజా చర్యపై అసహనం వ్యక్తం చేయడం కనిపించింది. అయితే స్పిన్‌కు విపరీతంగా అనుకూలిస్తున్న గాలే పిచ్‌పై చివరి రోజు బ్యాటింగ్ చేయడం అసాధ్యం. మరి ధనంజయ, దినూషలు భారత్ విజయానికి అడ్డుకట్ట వేస్తారా లేక టీమిండియా స్పిన్నర్ల ధాటికి వెనుదిరుగుతారా అన్నది చూడాలి.🚨Ravindra Jadeja’s No-Ball Turns Gambhir’s Celebration Into Heartbreak🚨Ravindra Jadeja thought he had dismissed Dhananjaya de Silva after KL Rahul completed the catch, and Gautam Gambhir was visibly delighted. But then came the heartbreak Jadeja had overstepped, and it was… pic.twitter.com/FbSG0mGhZq— Central Cricket (@arshdeep3444) August 18, 2026A costly overstep from Ravindra Jadeja.Dhananjaya de Silva gets another life.📸: Sony LIV pic.twitter.com/8GH6rQkf7g— CricTracker (@Cricketracker) August 18, 2026చదవండి: హాకీ ప్రపంచకప్: పాక్‌తో పోరు.. భారత్‌కు ‘డూ ఆర్ డై’ -
లంకతో తొలి టెస్టు.. మంజ్రేకర్, మురళీ కార్తిక్ మధ్య వాగ్వాదం!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి చేరువైంది. విజయానికి ఆరు వికెట్ల దూరంలో ఉన్న భారత్ ఐదోరోజు ఆటను వీలైనంత తొందరగా ముగించాలని చూస్తోంది. ఆన్‌ఫీల్డ్‌లో ఇలాంటి డ్రామా నడుస్తుంటే.. ఆఫ్ ఫీల్డ్ మాత్రం మరో డ్రామాకు వేదికైంది. తొలి టెస్టుకు కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న భారత మాజీ క్రికెటర్లు సంజయ్ మంజ్రేక్, మురళీ కార్తిక్‌ల మధ్య కామెంటరీ బాక్స్‌లో బాడీ షేమింగ్ గురించి చిన్నపాటి యుద్ధం జరిగింది. ఇద్దరు మాట మాట అనుకోవడంతో ఫన్నీగా మొదలైన కామెంటరీ చివరకు మాటల యుద్ధానికి దారి తీసింది. వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. విషయంలోకి వెళితే.. టెస్టు మ్యాచ్ లంచ్ బ్రేక్ సమయంలో, స్టూడియోలో ఉన్న మురళీ కార్తిక్ మైదానం వద్ద నుంచి మాట్లాడుతున్న సంజయ్ మంజ్రేకర్ ముఖకవళికలపై కామెంట్ చేశారు. "మీరు పెట్టే ఎక్స్ ప్రెషన్స్ వల్ల మీరు ఏం మాట్లాడుతున్నారో ఒక్కోసారి సరిగా అర్థం కావడం లేదు, అది కొంచెం తగ్గించండి" అంటూ కార్తిక్ సరదాగా వ్యాఖ్యానించారు. దీంతో అసహనానికి గురైన సంజయ్ మంజ్రేకర్ వెంటనే స్పందిస్తూ.. "కెమెరాను నా నుంచి స్ప్లిట్ స్క్రీన్ చేసి పక్కనే ఉన్న అజింక్య రహానే వైపు తిప్పండి, ఆయన ముఖం చూడటానికి చాలా బాగుంటుంది, మాట్లాడటానికి కూడా మంచి వ్యక్తి" అని కౌంటర్ ఇచ్చారు. అంతేకాకుండా మురళీ కార్తిక్ అద్దంలో చూసుకుంటూ తనను తాను చూసి మురిసిపోతుంటారని ఎద్దేవా చేశారు. దానికి కార్తిక్ "నేను అద్దంలో చూసుకోను, అది మీ అలవాటే" అని రీకౌంటర్ ఇచ్చారు.అయితే, పరిస్థితి మరింత చేయి దాటిపోయే సమయంలో ఇద్దరూ సంయమనం పాటించాడు. సోషల్ మీడియాలో దీనిపై రచ్చ జరుగుతుందని గ్రహించిన మంజ్రేకర్.. 'సోషల్ మీడియాలో దీనిపై విపరీతంగా ట్రోల్స్ వస్తాయి, ఫ్యాన్స్‌కు పండగే' అంటూ సరదగా వ్యాఖ్యానిస్తూ ఆ వివాదానికి తెరదించాడు.తొలి టెస్టులో శ్రీలంక ముందు భారత్ 372 పరుగుల టార్గెట్‌ను నిర్ధేశించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి లంక జట్టు 4 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. శ్రీలంక విజయానికి మరో 288 పరుగులు అవసరం కాగా, భారత్ గెలుపుకు ఆరు వికెట్లు అవసరం.Read: పెళ్లి చేసుకోనున్న సానియా మీర్జా? -
లంకకు ఎదురుదెబ్బ.. ఆసుపత్రిలో చేరిన సీనియర్ క్రికెటర్!
టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ సమయంలో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆ జట్టు ఆటగాడు దినేశ్ చందిమల్ గాయానికి గురయ్యాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్లో కేఎల్ రాహుల్ ఆడిన స్వీప్షాట్ను అడ్డుకునే ప్రయత్నంలో బౌండరీ లైన వద్ద ఉన్న రోప్ అడ్డుతగలడంతో అతడి మెడ బాగానికి గాయమైంది. దీంతో ఫిజియో వచ్చి చందిమల్‌ను పరీక్షించారు. నొప్పితో బాధపడుతున్న చందిమల్‌ను తదుపరి స్కానింగ్‌ల కోసం ఆసుపత్రికి తరలించారు. అతడి స్థానంలో పసిందు సూరియబండారా సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్గాఆ వచ్చాడు. తాజా గాయంతో లంక రెండో ఇన్నింగ్స్ సమయంలో చందిమల్ బ్యాటింగ్‌కు వస్తాడా రాడా అనేది అనుమానంగా మారింది. ‘‘నాలుగో రోజు తొలి సెషన్లో ఫీల్డింగ్ చేస్తుండగా బౌండరీని ఆపేందుకు డైవ్ చేసినప్పుడు దినేష్ చండిమాల్ కుడి భుజానికి, మెడకు గాయమైంది. మైదానంలోనే జట్టు ఫిజియోథెరపిస్ట్, వైద్యులు అతడిని పరీక్షించారు. ముందుజాగ్రత్తగా స్కానింగ్ కోసం ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలియజేస్తాం’’ అని శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సి) తెలిపింది.నాలుగో ఇన్నింగ్స్ సమయానికి చందిమల్ కోలుకోకపోతే మాత్రం శ్రీలంకకు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. ఎందుకంటే చందిమల్ దూరమైతే అప్పుడు లంక జట్టు 10 మందితోనే ఆడాల్సి ఉంటుంది. మరోవైపు లంక సీనియర్ బ్యాటర్ అయిన చందిమల్కు భారత్‌పై మంచి రికార్డు ఉంది. టీమిండియాపై 9 టెస్టులాడిన చందిమల్ 754 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, మూడు అర్ధసెంచరీలున్నాయి.ఇక టీమిండియా తొలి టెస్టులో పట్టు బిగించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులకు ఆలౌట్ కాగా, శ్రీలంక 284 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించడంతో భారత్‌కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా వేగంగా ఆడి లంక ఎదుట భారీ టార్గెట్‌ను నిర్దేశించాలని భావిస్తోంది. ఆటకు మరో రోజు సమయం మిగిలి ఉంది.Sri Lanka batter Dinesh Chandimal has been taken to the hospital for a precautionary scan after injuring his right shoulder and neck while diving to save a boundary on day four of the first Test against India at the Galle International Stadium on Tuesday."Dinesh Chandimal… pic.twitter.com/30cqMwPpcY— IANS (@ians_india) August 18, 2026Read: రాహుల్‌ను కాపాడిన పడిక్కల్.. ముద్దు పెట్టే ప్రయత్నం! -
రాహుల్‌ను కాపాడిన పడిక్కల్.. ముద్దు పెట్టే ప్రయత్నం!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్ తెలివైన నిర్ణయంతో కాపాడాడు. విషయంలోకి వెళితే.. భారత్ రెండో ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 11వ ఓవర్ ప్రబాత్ జయసూరియా వేశాడు. ఆ ఓవర్లో ఐదో బంతిని 25 పరుగులతో ఆడుతున్న రాహుల్ భారీ సిక్సర్‌గా మలిచాడు. అయితే మరుసటి బంతిని రాహుల్ మిస్ చేయడంతో బంతి ప్యాడ్లను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. దీంతో లంక ఆటగాళ్లు అప్పీల్ చేశారు. అయితే మొదట కేఎల్ రాహుల్ తాను ఔటయ్యానని భావించి రివ్యూ తీసుకోవడానికి ఆలోచించాడు. అదే సమయంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న పడిక్కల్ మాత్రం రివ్యూకు వెళ్లాలని రాహుల్‌కు సైగ చేశాడు. దీంతో రాహుల్ రివ్యూ కోరాడు. ఇక రివ్యూలో బంతి బ్యాట్‌కు ఎక్కడా తగల్లేదు, కానీ లైన్లోనే వెళ్లడంతో మొదట ఔట్ అనిపించినప్పటికీ, బంతి స్టంప్స్ పైనుంచి వెళుతున్నట్లు కనిపించింది. దీంతో లంక ఆటగాళ్లు నిరాశలో మునిగిపోగా, కేఎల్ రాహుల్ మాత్రం పడిక్కల్ వద్దకు వచ్చి అతన్ని హగ్ చేసుకున్నాడు. రివ్యూ తీసుకోమని చెప్పినందుకు థాంక్స్ అన్నట్లుగా రాహుల్ అతడికి ముద్దు పెడుతున్నట్లుగా బ్రొమాన్స్ చేయడం కెమెరా కంటికి చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకవేళ పడిక్కల్ రివ్యూ తీసుకోవాలని చెప్పకపోయుంటే రాహుల్ పెవిలియన్ బాట పట్టేవాడే. అయితే తనకు లభించిన అవకాశాన్ని రాహుల్ వినియోగించు కోలేకపోయాడు. మళ్లీ అదే ప్రబాత్ జయసూరియా బౌలింగ్‌లో భారీ షషాట్కు యత్నించి క్యాచ్ ఔట్ అయ్యాడు.ఇక టీమిండియా తొలి టెస్టులో పట్టు బిగించిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులకు ఆలౌట్ కాగా, శ్రీలంక 284 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించడంతో భారత్‌కు 178 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా వేగంగా ఆడి లంక ఎదుట భారీ టార్గెట్‌ను నిర్దేశించాలని భావిస్తోంది. ఆటకు మరో రోజు సమయం మిగిలి ఉంది.KL Rahul hugged Devdutt Padikkal for asking Him to go upstairs to review the decision which was given out on-field. A beautiful moment. #SLVIND pic.twitter.com/ZhtI0jBzb2— Nibraz Ramzan (@nibraz88cricket) August 18, 2026KL Rahul hugging Devdutt Paddikal after a successful DRS suggested by him 😂 #SLvIND pic.twitter.com/vLEys0Vgk3— Prateek (@prateek_295) August 18, 2026 -
జైస్వాల్ ఏంటా పిచ్చి షాట్లు? రిపీటయితే అడ్రస్ గల్లంతే!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో దురదృష్టవశాత్తూ రనౌట్ అయిన జైస్వాల్ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తనకు అచ్చిరాని షాట్ ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు. టెస్టుల్లో జైస్వాల్ డకౌట్ కావడం ఇది ఏడోసారి. అశితా ఫెర్నాండో బంతిని స్టంప్ అవతల వేయగా, అనవసరంగా కట్‌షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే వెంటనే స్పందించిన కీపర్ డిక్వెల్లా ఎలాంటి తప్పు చేయకుండా ఎడ్జ్ తీసుకొని బంతిని అందుకున్నాడు. పేస్ బౌలింగ్‌లో కట్‌షాట్ ఆడే ప్రయత్నంలో జైస్వాల్ తరచూ విఫలమవుతున్నాడు. అయితే ఇదే జైస్వాల్ తన డెబ్యూ టూర్ ఇంగ్లండ్ సిరీస్‌లో 293 పరుగులు చేసి నాలుగుసార్లు మాత్రమే ఔటయ్యాడు. 2025 నుంచి చూసుకుంటే మాత్రం కట్‌షాట్ ఆడే ప్రయత్నంలో కేవలం 47 పరుగులు మాత్రమే చేసిన జైస్వాల్ నాలుగుసార్లు ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో తప్పుడు షాట్ల రేటు 31 శాతం నుంచి 48 శాతానికి పెరగడం గమనార్హం. అసలే టీమిండియా ఓపెనింగ్ స్లాట్‌కు పోటీ పెరిగిపోతున్న వేళ జైస్వాల్ విఫలమవ్వడం అతడి స్థానానికి ఎసరు తెచ్చే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికే వన్డే, టీ20 జట్టులో తీవ్ర పోటీ కారణంగా జైస్వాల్‌కు జట్టులో చోటు లభించడం లేదు. ఇప్పుడు టెస్టుల్లో కూడా ఇలాంటి ప్రదర్శన చేస్తే త్వరలో ఇక్కడ కూడా చోటు కోల్పోవడం ఖాయం. పైగా సాయి సుదర్శన్, సర్ఫరాజ్ ఖాన్ వంటి క్రికెటర్ల నుంచి పోటీ తీవ్రంగా ఉంది. సాయి సుదర్శన్ గాయంతో తొలి టెస్టుకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకోవడంతో సాయి సుదర్శన్ రెండో టెస్టు ఆడే అవకాశముంది. దీంతో రెండో టెస్టుకు జట్టు నుంచి సాయికి అవకాశమివ్వాలనుకుంటే జైస్వాల్‌ను తప్పించే చాన్స్ ఎక్కువగా ఉంటుంది."Yashasvi jaiswal Got out on 0 runs 😢He is good batsmen but he needs to be consistent.#SLvIND pic.twitter.com/q7cQeFsMch— Indian Cricket Team (@criclover451807) August 18, 2026Read: సిరాజ్, లంక బ్యాటర్ మధ్య మాటల యుద్ధం! -
IND vs SL: విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్
SL Vs IND 1st Test Day-4 Updates: గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య తొలి టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌటైన టీమిండియా.. శ్రీలంకకు 372 పరుగుల టార్గెట్ విధించింది.గెలుపునకు 6 వికెట్ల దూరంలో భారత్శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ గెలుపునకు 6 వికెట్ల దూరంలో ఉంది. 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలవాలంటే చివరి రోజు 288 పరుగులు చేయాలి. ఇది అంతా సులువుగా జరిగే పని కాదు. భారత్ మాత్రం మరో 6 వికెట్లు తీస్తే విజయం సొంతం చేసుకుంటుంది. అయితే చివరి రోజు భారత గెలుపుకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో సోనల్ దినుష (25), కెప్టెన్ ధనంజయ డిసిల్వ (31) క్రీజ్‌లో ఉన్నారు.నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక21.4 ఓవర్: మానవ్ సుతార్ బౌలింగ్‌లో జురెల్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగిన లాహిరు ఉదార (16). శ్రీలంక స్కోరు: 47-4. సొనాల్ దినుష క్రీజులోకి రాగా.. ధనంజయ 19 పరుగులతో ఉన్నాడు.15 ఓవర్లలో శ్రీలంక స్కోరు: 33-3ఉదార 15, ధనంజయ 7 పరుగులతో ఉన్నారు. విజయానికి 339 పరుగుల దూరంలో శ్రీలంక.మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక10.4 ఓవర్: ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించిన కమిందు మెండిస్. రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటైన కమిందు. లంక స్కోరు: 21-3. ఉదార 11 పరుగులతో ఉండగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ క్రీజులోకి వచ్చాడు.రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక7.2 ఓవర్: మానవ్ సుతార్ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా పెవిలియన్ చేరిన పసిందు. అరంగేట్రంలోనే డకౌట్‌గా పసిందు. లంక స్కోరు 14-2. ఉదార 6 పరుగులతో ఉండగా.. కమిందు మెండిస్ క్రీజులోకి వచ్చాడు.తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక6.6: సిరాజ్ బౌలింగ్‌లో ప్రసిద్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగిన నిశాన్ మధుష్క (6). లంక స్కోరు 13-1 (7). విజయానికి ఇంకా 359 పరుగులు కావాలి. ఉదార 5 పరుగులతో ఉండగా.. పసిందు సూరియబండారా క్రీజులోకి వచ్చాడు.లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకఆరు ఓవర్లలో స్కోరు: 12-0ఉదార 4, నిశాన్ 6 పరుగులతో ఉన్నారు. విజయానికి ఇంకా 360 పరుగులు కావాలి.వర్షం వల్ల అంతరాయంశ్రీలంక లక్ష్య ఛేదనకు దిగాల్సి ఉండగా.. వాన వల్ల అంతరాయం కలిగింది193 పరుగులకు ఆలౌటైన టీమిండియాభారత్ రెండో ఇన్నింగ్స్‌లో 193 పరుగులకు ఆలౌటైంది. తద్వారా శ్రీలంక ముందు 372 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. తొమ్మిదో వికెట్ కోల్పోయిన భారత్190 పరుగుల వద్ద భారత్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో ధనంజయ డిసిల్వకు క్యాచ్ ఇచ్చి కుల్దీప్ యాదవ్ (5) ఔటయ్యాడు. ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్188 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. అశిత ఫెర్నాండో బౌలింగ్‌లో డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి మానవ్ సుతార్ (9) ఔటయ్యాడు.9 పరుగులు చేసిన జడేజాను లాహిరు కుమారా పెవిలియన్ చేర్చడంతో భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 357 పరుగులుగా ఉంది.పంత్ (66) ఔట్66 పరుగులు చేసిన పంత్ కుమారా బౌలింగ్‌లో డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో టీమిండియా 174 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 352 పరుగులుగా ఉంది.సిక్సర్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న పంత్లాహిరు కుమారా బౌలింగ్‌లో భారీ సిక్సర్ కొట్టిన పంత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 54 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్న పంత్ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం భారత్ 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. భారత్ ఆధిక్యం 336 పరుగులు.36 ఓవర్లలో టీమిండియా స్కోరు 151-5పంత్ 47, జడేజా 4 పరుగులతో ఉన్నారు. భారత్ ఆధిక్యం 329 పరుగులు.ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియాఅసితా ఫెర్నాండో బౌలింగ్‌లో నిరోషన్ డిక్విల్లాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ధ్రువ్ జురెల్ (7). క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా. టీమిండియా స్కోరు 120-5 (31). పంత్ 23 పరుగులతో ఉన్నాడు.లంచ్ తర్వాత మొదలైన ఆటలంచ్ విరామంగాలే టెస్టులో భాగంగా నాలుగో రోజు ఆటలో లంచ్ విరామ సమయానికి టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (21), ధ్రువ్ జురెల్ (5) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 294 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో రాణించిన పడిక్కల్ (44) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడగా, రాహుల్ (35) పర్వాలేదనిపించాడు. లంక బౌలర్లలో ప్రబాత్ జయసూరియా 2 వికెట్లు తీయగా, కెషారా, అశితా ఫెర్నాండో చెరో వికెట్ పడగొట్టారు.పడిక్కల్ ఔట్.. నాలుగో వికెట్ డౌన్టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్లు చేజార్చుకుంటుంది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో పడిక్కల్ 44 పరుగుల వద్ద కెషారా నువంతా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో భారత్ 111 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 289 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.మూడో వికెట్ కోల్పోయిన టీమిండియాఇన్నింగ్స్ 21వ ఓవర్లో శుబ్‌మన్ గిల్ (8) రూపంలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. పడిక్కల్ (35), పంత్ (1) పరుగుతో ఆడుతున్నారు.రెండో వికెట్ డౌన్65 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (35) రూపంలో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రబాత్ జయసూరియా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన రాహుల్ మిలన్ రత్ననాయకేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ 243 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.ఫిఫ్టీ మార్క్ దాటిన టీమిండియారెండో ఇన్నింగ్స్‌లో 14 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 30, పడిక్కల్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటివరకు భారత్ 237 పరుగుల ఆధిక్యంలో ఉంది.తొలి వికెట్ డౌన్గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో 178 పరుగుల ఆధిక్యంతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. అశితా ఫెర్నాండో బౌలింగ్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (1), పడిక్కల్ (10) పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. దినూష (100) శతకంతో రాణించగా, నిరోషన్ డిక్వెల్లా (80) అర్ధసెంచరీ చేశాడు. ఒకదశలో లంక 90/5 వద్ద కష్టాల్లో ఉండగా వీరిద్దరు ఆరో వికెట్‌కు 36.1 ఓవర్లలో 146 పరుగులు జోడించి జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్‌కు 4, జడేజాకు 3 వికెట్లు దక్కాయి. భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లు ఆడాల్సి ఉన్నా... వెలుతురులేమి వల్ల ఆట సాధ్యం కాలేదు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 460/9తో మూడో రోజు ఆట కొనసాగించిన భారత్ మరో 4 బంతులాడి తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. -
సిరాజ్, లంక బ్యాటర్ మధ్య మాటల యుద్ధం!
గాలే వేదికగా శ్రీలంక, టీమిండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మహ్మద్ సిరాజ్, లంక బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా మధ్య జరిగిన మాటల యుద్ధం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడో రోజు ఆటలో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ, లంక బ్యాటర్లు డిక్వెల్లా, దినూషలు తమ జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్లను ఇబ్బందిపెట్టారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సిరాజ్.. డిక్వెల్లాతో వాగ్వాదానికి దిగాడు. లంక ఇన్నింగ్స్ 54వ ఓవర్లో ఇది చోటచేసుకుంది. 54వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన సిరాజ్ డిక్వెల్లా బ్యాట్‌ను టార్గెట్‌గా చేసుకొని అదే పనిగా బంతులను విసిరాడు. పదే పదే తనను రెచ్చగొట్టేలా బంతులు వేయడంతో సహనం కోల్పోయిన డిక్వెల్లా సిరాజ్‌తో మాటల యుద్ధానికి దిగాడు. 'బంతులను సరిగ్గా వెయ్యు' అని డిక్వెల్లా అనగా.. సిరాజ్ 'సరే ఈసారి ఇంకా ఇబ్బంది పెడుతానులే' అని ఘాటుగా ప్రతిస్పందించాడు. అనంతరం ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో అంపైర్లు జోక్యం చేసుకొని ఇద్దరిని పంపించేయడంతో వివాదం సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.ఇక టీమిండియాతో టెస్టు మ్యాచ్ ద్వారా మూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన నిరోషన్ డిక్వెల్లా మంచి ప్రదర్శనే చేశాడు. 115 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో 80 పరుగులు సాధించిన అనంతరం ప్రసిధ్ క్రిష్ణ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. డిక్వెల్లా కెరీర్లో ఇది 23వ అర్ధశతకం. అయితే 55 టెస్టులాడినప్పటికీ డిక్వెల్లా ఖాతాలో ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా లేకపోవడం గమనార్హం. అతడి అత్యధిక టెస్టు స్కోరు 96గా ఉంది. మ్యాచ్ విషయానికొస్తే శ్రీలంక 284 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 178 పరుగుల ఆధిక్యం లభించింది. సోనాల్ దినూష (100) సెంచరీ చేయగా, డిక్వెల్లా (80) అర్ధసెంచరీ చేశాడు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 4 వికెట్లు తీయగా, జడేజా మూడు, కుల్దీప్, ప్రసిధ్, సిరాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. పడిక్కల్ సెంచరీతో చెలరేగగా, కేఎల్ రాహుల్, జురెల్ అర్ధశతకాలు సాధించారు.🚨 Heated exchange between Mohammed Siraj & Niroshan Dickwella during the live match 🚨Mohammed Siraj was continuously beating Dickwella’s bat with his deliveries and kept troubling the Sri Lankan batter.After Dickwella appeared to lose his cool, the two players were involved… pic.twitter.com/kvGVWVo1sK— Central Cricket (@arshdeep3444) August 17, 2026 -
‘వర్షం ముప్పు.. భారత్ గెలవాలంటే అదొక్కటే దారి’
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ 178 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి పట్టు బిగించింది. కానీ ఆటకు మరో రెండు రోజులు మాత్రమే ఉండడం, వర్షం అంతరాయం కలిగిస్తుండడంతో టీమిండియా మ్యాచ్ గెలుస్తుందా లేక డ్రాగా ముగుస్తుందా అన్నది ఆసక్తిగా మారింది. అయితే భారత్ ఈ మ్యాచ్ గెలవాలంటే నాలుగో రోజు ఆటలో వీలైనంత వేగంగా ఆడాల్సి ఉంటుందని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశాడు. గాలేలో వాతావరణ పరిస్థితులు మారుతున్న తరుణంలో భారత్ 40 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి లంక ఎదుట సుమారు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే బాగుంటుందని తెలిపాడు. ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. "తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 178 పరుగులకు మరో 172 పరుగులు జోడిస్తే 350 పరుగుల దాకా వస్తాయి. మ్యాచ్‌కు వర్షం అంతరాయం ఉంటుంది కాబట్టి 40 ఓవర్లలో సాధ్యమైనంత ఎక్కువ పరుగులు ఓవర్‌కు ఐదు రన్స్ చొప్పున (దాదాపు 200 పరుగులు) చేస్తే బాగుంటుంది. ఆడుతున్నది టెస్టు మ్యాచ్ అయినప్పటికీ, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మన బ్యాటర్లు ఆటను టెస్టు నుంచి వన్డే గేర్‌కు మార్చుకోవాలి. ఓపెనర్లుగా వచ్చే జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌లో దూకుడు ప్రదర్శించాలి. టీ20 క్రికెట్ కాకపోయినా, కనీసం వన్డే తరహాలో కాస్త ఫాస్ట్‌గా ఆడేందుకు ప్రయత్నించాలి. నాలుగో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించకపోతే సమస్య లేదు. కానీ వర్షం పడితే మాత్రం భారత్‌కు దెబ్బ పడుతుంది. కాబట్టి వీలైనంత మేర ఫాస్ట్‌గా ఆడేందుకు యత్నించాలి. వర్షం పడే అవకాశం ఉండడంతో నేనైతే భారత్‌కు రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లు ఇస్తాను. 150 నుంచి 175 పరుగులు చేశాకే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాలి. ఒకవేళ వర్షం పడకపోతే నాలుగో రోజు మిగిలిన 50 ఓవర్లు, చివరి రోజు 90 ఓవర్ల ఆట ఉంటుంది కాబట్టి టీమిండియా ఫలితం అనుకూలంగా లేదా ప్రతికూలంగా వచ్చేందుకు కూడా అవకాశముంది." అని ఆకాశ్ చోప్రా వెల్లడించాడు.Read: Virat Kohli: 18 ఏళ్ల ప్రయాణంలో 18 అద్భుత క్షణాలు -
'నమ్మినందుకు ఇరగదీస్తున్నాడు.. గిల్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే'
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత స్పిన్నర్ మానవ్ సుతార్ తనకు అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టాడు. మ్యాచ్‌లో ఇప్పటికే మానవ్ సుతార్ రెండు కీలక వికెట్లు తీశాడు. 27 పరుగులతో నిలకడగా ఆడుతున్న లాహిరు ఉడారాను బోల్తా కొట్టించిన మానవ్ సుతార్ ఆ వెంటనే ఇన్ఫామ్ బ్యాటర్ దినేశ్ చందిమల్‌ను తెలివిగా బుట్టలో వేసుకున్నాడు. ‘బిగ్ స్పిన్నర్ అవుతాడు’ఈ నేపథ్యంలో మానవ్ సుతార్‌పై టీమిండియా మాజీ క్రికెటర్లు అజయ్ జడేజా, అజింక్య రహానేలు ప్రశంసల జల్లు కురిపించారు. తొలి టెస్టుకు ఈ ఇద్దరు కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్నారు. చందిమల్‌ను ఔట్ చేసిన తర్వాత అజయ్ జడేజా మాట్లాడుతూ.. "టీమిండియా బిగ్ స్పిన్నర్ అయ్యేందుకు మానవ్ సుతార్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి. బంతిని టర్న్ చేయడంలో అతడి సామర్థ్యం అసాధారణమైనది. దీంతో లంక బ్యాటర్లు అతడిని ఎదుర్కోవడానికి తెగ ఇబ్బంది పడుతున్నారు. మానవ్ సుతార్‌పై నమ్మకముంచి అతడికి అవకాశం కల్పించిన కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే" అని చెప్పుకొచ్చాడు. అజయ్ జడేజా వ్యాఖ్యలను రహానే సమర్ధించాడు. ఆ ఇద్దరిని కలగలిపి.."జడేజా భాయ్, నేను మీ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. టెస్టు క్రికెట్లో టీమిండియాకు మ్యాచ్ విన్నర్‌గా మారే సత్తా మానవ్ సుతార్‌కు ఉంది. లంక పిచ్‌లపై అతడు అద్భుతమైన టర్న్‌ను రాబడుతున్నాడు. అతడి బౌలింగ్‌లో జడేజాలో ఉండే కచ్చితత్వం, అశ్విన్ లాగా బంతిని టర్న్ చేయడం లాంటి రెండు సామర్థ్యాలు ఒకేసారి ఉండడం సానుకూలాంశం. భవిష్యత్తులో భారత క్రికెట్లో మానవ్ సుతార్ కీలక పాత్ర పోషించనున్నాడు" అని రహానే పేర్కొన్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైంది. 460 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుకు మరో రెండు పరుగులు జోడించిన అనంతరం చివరి వికెట్ కోల్పోయింది. దేవదత్ పడిక్కల్ (167) సెంచరీతో రాణించగా, ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) అర్ధశతకాలతో మెరిశారు. లంక బౌలర్లలో ప్రబాత్ జయసూరియా 4 వికెట్లు తీయగా, కేషారా నువంతా 3, అశితా ఫెర్నాండో 2 వికెట్లు పడగొట్టాడు.ఇక మూడో రోజు ఆటలో లంచ్ విరామ సమయానికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. సోనాల్ దినుష (14), నిరోషన్ డిక్వెల్లా (8) పరుగులతో క్రీజులో ఉన్నారు. మానవ్ సుతార్ రెండు, కుల్దీప్, జడేజా, సిరాజ్ తలా ఒక వికెట్ తీశారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండడంతో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. 🚨 Ajay Jadeja & Ajinkya Rahane Praise Manav Suthar During IND vs SL Live Match 🚨Ajay Jadeja 🗣️: Manav Suthar has the potential to become India’s next big Test spinner. His ability to turn the ball is exceptional, and the Sri Lankan batters are struggling against him. Credit… pic.twitter.com/BcZjpmepqy— Central Cricket (@arshdeep3444) August 17, 2026 Manav Suthar gets his second of the innings as Sri Lanka slip to three down on Day 3! 💥 Watch #SLvIND, 1st Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/FANRuZ6FDO— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026Manav Suthar lures Chandimal into the edge, and Rishabh Pant makes no mistake behind the stumps! 🧤 Watch #SLvIND, 1st Test | Day 3, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #SLvIND #BeautifulGameOfTestCricket pic.twitter.com/Dsy7xz9Ciw— Sony Sports Network (@SonySportsNetwk) August 17, 2026Read: తప్పించాలని డిమాండ్లు; బ్యాట్‌తోనే జవాబు.. ఆ ఇద్దరి వల్లే! -
తప్పించాలని డిమాండ్లు; బ్యాట్‌తోనే జవాబు.. ఆ ఇద్దరి వల్లే!
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్ ధ్రువ్ జురెల్ అర్ధశతకంతో మెరిశాడు. అయితే గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో జురెల్ బ్యాట్ నుంచి ఒక్క ఫిఫ్టీ కూడా రాలేదు. ఈ నేపథ్యంలో లంకతో తొలి టెస్టుకు జురెల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశమివ్వాలని డిమాండ్లు కూడా వచ్చాయి. కానీ జట్టు మేనేజ్మెంట్ మాత్రం జురెల్‌పై నమ్మకాన్ని ఉంచింది. అందుకే జురెల్ హాఫ్ సెంచరీ చేయగానే కోచ్ గంభీర్‌తో పాటు చీఫ్ సెలెక్టర్ అగార్కర్ చప్పట్లు కొడుతూ అభినందించడం కెమెరాలకు చిక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తాజాగా జురెల్ లంకతో తొలి టెస్టులో ఫిఫ్టీ మార్క్ సాధించి జట్టుతో పాటు కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే రెండో రోజు ఆట ముగిసిన తర్వాత జురెల్ తన ప్రదర్శనపై స్పందించాడు. ‘‘నిజాయితీగా చెప్పాలంటే నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమే గొప్ప విషయంగా భావిస్తున్నా. నా ఆట విషయంలో అటు కోచ్.. ఇటు కెప్టెన్ అన్ని వేళలా మద్దతుగా నిలిచారు. పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ ఆడాలని సలహా ఇచ్చారు. వాళ్లు చెప్పినట్లే పరిస్థితులకు తగినట్లుగా ఆడి ఇవాళ అర్ధశతకంతో మెరిశాను. నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. జట్టుకు ఏం కావాలో అది చేయడమే నా పని. ఇండియా-ఏ తరఫున మ్యాచ్ ఆడేందుకు పది రోజుల ముందే శ్రీలంకలో అడుగుపెట్టాము. కొలంబోలో ప్రాక్టీస్ చేయడం సహా గాలేలోనూ మ్యాచ్ ఆడాము. దీంతో రెండు వేదికలపై పూర్తి అవగాహన వచ్చింది, అది ఇవాళ బ్యాటింగ్‌లో రాణించేందుకు ఉపయోగపడుతోంది. అంతేకాదు ఇక్కడి వాతావరణం, పరిస్థితులు అర్థం చేసుకునేందుకు కూడా ఎంతో దోహదపడింది’’ అని చెప్పుకొచ్చాడు. Gautam Gambhir and Ajit Agarkar keeping an eye on Dhruv Jurel’s 50.He will definitely be in consideration for white-ball cricket. pic.twitter.com/72d1IXjZ2h— AS4 (@lostbeyond777) August 16, 2026చదవండి: భారత్ 462 ఆలౌట్.. అరంగేట్రంలోనే లంక బౌలర్ చెత్త రికార్డు -
భారత్ 462 ఆలౌట్.. అరంగేట్రంలోనే లంక బౌలర్ చెత్త రికార్డు
గాలే వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక డెబ్యూ బౌలర్ కెషారా నువంతా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. అరంగేట్రం టెస్టులో అత్యధిక పరుగులు సమర్పించుకున్న నాలుగో బౌలర్‌గా కెషారా నిలిచాడు. భారత తొలి ఇన్నింగ్స్‌లో 39 ఓవర్లు వేసిన కెషారా నువంతా మూడు వికెట్లు తీసి 175 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక లంక తరఫున అరంగేట్రం టెస్టులో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా సూరజ్ రన్‌దివ్ నిలిచాడు. 2010లో కొలంబో వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 73 ఓవర్లు వేసిన సూరజ్ రన్‌దివ్ రికార్డు స్థాయిలో 222 పరుగులు సమర్పించుకున్నాడు. 2025లో గాలే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో తరిందు రత్ననాయకే 49.2 ఓవర్లలో 196 పరుగులు సమర్పించుకుని రెండో స్థానంలో ఉన్నాడు. 1999లో ఢాకా వేదికగా పాక్‌తో టెస్టులో ఉపుల్ చందన 47.5 ఓవర్లలో 179 పరుగులిచ్చుకొని మూడో స్థానంలో ఉన్నాడు. ఇక 2020లో సౌతాఫ్రికాతో టెస్టులో 171 పరుగులు సమర్పించుకున్న వనిందు హసరంగ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.టీమిండియా ఆలౌట్ఇక మ్యాచ్ విషయానికొస్తే భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైంది. 460 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుకు మరో రెండు పరుగులు జోడించిన అనంతరం చివరి వికెట్ కోల్పోయింది. దేవదత్ పడిక్కల్ (167) సెంచరీతో రాణించగా, ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) అర్ధశతకాలతో మెరిశారు. లంక బౌలర్లలో ప్రబాత్ జయసూరియా 4 వికెట్లు తీయగా, కేషారా నువంతా 3, అశితా ఫెర్నాండో 2 వికెట్లు పడగొట్టాడు. చదవండి: 'పంత్ వల్ల కాలేదు బట్లర్ సాధించాడు.. చాలా సంతోషం' -
SL Vs IND: శ్రీలంక ఆలౌట్.. మూడో రోజు ముగిసిన ఆట
గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. సోమవారం బ్యాటింగ్ మొదలుపెట్టిన శ్రీలంక 284 పరుగులకు ఆలౌట్ అయింది. దినుష సెంచరీ (100), నిరోషన్ డిక్విల్లా 80 పరుగులతో అదరగొట్టారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. అంతకు ముందు భారత్ 462 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇక లంక 284 పరుగులకు ఆలౌట్ కావడంతో.. భారత్‌కు 178 పరుగుల మేర భారీ ఆధిక్యం లభించింది. కాగా ముగిసిన మూడో రోజు ఆటలంక ఇన్నింగ్స్ తర్వాత ఆకాశం నల్లని మబ్బులతో నిండిపోయింది. దీంతోగ్రౌండ్ సిబ్బంది వచ్చి కవర్లతో పిచ్‌ను కప్పివేశారు. భారీ వర్షం పడే సూచనలు ఉండటంతో మూడో రోజు ఆటను అంతటితో ముగించేశారు.UPDATESసొనాల్ దినుష అవుట్సెంచరీ పూర్తి చేసుకున్న సొనాల్ జడ్డూ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. దీంతో శ్రీలంక తొమ్మిదో వికెట్ కోల్పోగా.. అసిత ఫెర్నాండో క్రీజులోకి వచ్చాడు. లాహిరు కుమార 0 పరుగులతో ఉన్నాడు. లంక స్కోరు: 274-9.ఎనిమిదో వికెట్ డౌన్మానవ్ సుతార్ బౌలింగ్‌లో జురెల్‌కు క్యాచ్ ఇచ్చి ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగిన ప్రభాత్ జయసూర్య (10). లంక స్కోరు 274-8 (78). లాహిరు కుమార క్రీజులోకి రాగా.. దినుష 100 పరుగులతో ఉన్నాడు.శతక్కొట్టిన దినుష167 బంతుల్లో వంద పరుగుల మార్కు అందుకున్న దినుష. మానవ్ సుతార్ బౌలింగ్‌లో సింగిల్ తీసి టెస్టుల్లో తొలి శతకం నమోదు చేసిన దినుష.ఏడో వికెట్ డౌన్66.4: జడేజా బౌలింగ్‌లో గిల్‌కు క్యాచ్ ఇచ్చి ఏడో వికెట్‌గా పెవిలియన్ చేరిన కేశారా (2). లంక స్కోరు: 243-7. ప్రభాత్ జయసూర్య క్రీజులోకి రాగా.. దినుష 79 పరుగులతో ఆడుతున్నాడు.ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంకక్రీజులో పాతుకుపోయిన నిరోషన్ డిక్వెల్లా- సొనాల్ దినుష జోడీని ప్రసిద్ కృష్ణ విడదీశాడు. ప్రసిద్ బౌలింగ్‌లో రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చిన డిక్వెల్లా ఆరో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 80 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అతడి స్థానంలో కేశారా నువాంత క్రీజులోకి రాగా.. దినుష 74 పరుగులతో ఆడుతున్నాడు. లంక స్కోరు: 236-6 (61.5). కాగా దినుషతో కలిసి డిక్విల్లా ఆరో వికెట్‌కు 146 పరుగులు జోడించాడు.టీ విరామానికి శ్రీలంక స్కోర్: 214/5టీ విరామ సమయానికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజులో సోనల్(62), డిక్వెల్లా(71) ఉన్నారు. లంక ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే 248 పరుగులు వెనకబడి ఉంది.సొనాల్ అర్ధ శతకంకుల్దీప్ బౌలింగ్‌లో సింగిల్ తీసి సొనాల్ దినుష.. 92 బంతులలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంకస్కోరు: 184-5 (49)ఫిఫ్టీ బాదిన డిక్వెల్లానిరోషన్ డిక్వెల్లా 68 బంతుల్లో అర్ధసెంచరీ మార్క్ సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు ఉన్నాయి. ప్రస్తుతం లంక 46 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దినూష (39) అతడికి సహకరిస్తున్నాడు.దినూష, డిక్వెల్లా నిలకడలంచ్ విరామం అనంతరం లంక ఆట తిరిగి గాడిన పడింది. మిడిలార్డర్లో దినూష (34), డిక్వెల్లా (38) నిలకడగా ఆడుతుండడంతో లంక జట్టు 150 పరుగుల మార్క్‌ను దాటింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌కు లంక మరో 311 పరుగులు వెనుకబడి ఉంది.👉 లంచ్ విరామం అనంతరం ఆట తిరిగి ప్రారంభమైంది. 30 ఓవర్లు ముగిసేసరికి లంక ఐదు వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. దినుష (20), నిరోషన్ డిక్వెల్లా (12) పరుగులతో క్రీజులో ఉన్నారు.లంచ్ విరామంలంచ్ విరామ సమయానికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. సోనాల్ దినుష (14), నిరోషన్ డిక్వెల్లా (8) పరుగులతో క్రీజులో ఉన్నారు. మానవ్ సుతార్ రెండు, కుల్దీప్, జడేజా, సిరాజ్ తలా ఒక వికెట్ తీశారు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుండడంతో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. లంక కోల్పోయిన ఐదు వికెట్లలో నాలుగు స్పిన్నర్లకే దక్కడం విశేషం. శ్రీలంక మరో 363 పరుగులు వెనుకబడి ఉంది.ఐదో వికెట్ డౌన్26.1: రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన ధనంజయ డి సిల్వ (21). లంక స్కోరు 90-5 (26.1). సొనాల్ 13 పరుగులతో ఉండగా.. నిరోషన్ డెక్విల్లా క్రీజులోకి వచ్చాడు.నాలుగో వికెట్ కోల్పోయిన శ్రీలంక16.1: కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగిన కమిందు మెండిస్ (14). క్రీజులోకి వచ్చిన సొనాల్ దినుష. 17 ఓవర్లలో లంక స్కోరు: 62-4. మూడో వికెట్ డౌన్53 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక కష్టాల్లో పడింది. 27 పరుగులు చేసిన లాహిరు ఉదారా మానవ్ సుతార్ బౌలింగ్‌లో జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫిఫ్టీ మార్క్ దాటిన లంకశ్రీలంక 50 పరుగుల మార్క్‌ను దాటింది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ, లాహిరు ఉదారా (27 బ్యాటింగ్), కమిందు మెండిస్ (12 బ్యాటింగ్) ఆడుతుండడంతో లంక కుదురుకుంది. ప్రస్తుతం 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది.రెండో వికెట్ డౌన్తొలి టెస్టులో శ్రీలంక 27 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. మానవ్ సుతార్ బౌలింగ్‌లో 4 పరుగులు చేసిన దినేశ్ చందిమల్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లంక 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది.👉6 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. లాహిరు ఉడారా (10), చందిమల్ (4) క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన లంకతమ ఇన్నింగ్స్ ఆరంభంలోనే శ్రీలంకకు షాక్ తగిలింది. సిరాజ్ బౌలింగ్‌లో ఓపెనర్ నిశాన్ ఫెర్నాండో డకౌట్ అయ్యాడు. అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌటైంది. 460 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుకు మరో రెండు పరుగులు జోడించిన అనంతరం చివరి వికెట్ కోల్పోయింది. దేవదత్ పడిక్కల్ (167) సెంచరీతో రాణించగా, ఓపెనర్ కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) అర్ధశతకాలతో మెరిశారు. లంక బౌలర్లలో ప్రబాత్ జయసూరియా 4 వికెట్లు తీయగా, కేషారా నువంతా 3, అశితా ఫెర్నాండో 2 వికెట్లు పడగొట్టాడు.👉అయితే రెండో రోజు ఆటలో దాదాపు సగం వర్షార్పణమయింది. దీంతో 47 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అయితే మూడో రోజు మాత్రం ఉదయం నుంచి ఎండ కాస్తుండడం శుభ పరిణామం. అయితే మూడో రోజు నుంచి పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తే మాత్రం బ్యాటింగ్ కష్టంగా మారనుంది.👉ఇక తొలి రోజు ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని మంచి పునాది వేసుకున్న టీమిండియా... రెండో రోజు దాన్ని మరింత బలపరుచుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 288/2తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్... రెండో రోజు ఆట ముగిసే సమయానికి 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. వర్షం కారణంగా రెండో రోజు 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడింది.👉 సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్ (230 బంతుల్లో 167; 15 ఫోర్లు, 1 సిక్స్) క్రితం రోజు స్కోరుకు మరో 36 పరుగులు జోడించి అవుట్ కాగా... ధ్రువ్ జురేల్ (68 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో మెరిశాడు. గాయం నుంచి కోలుకొని బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ (175 బంతుల్లో 82; 10 ఫోర్లు, 1 సిక్స్) మరో ఐదు పరుగులే చేశాడు.Innings Break!#TeamIndia post 4⃣6⃣2⃣ in the first innings 👏👏Devdutt Padikkal top-scores with 1⃣6⃣7⃣ 🫡Fifties from KL Rahul & Dhruv Jurel 👌Over to our bowlers 💪Scorecard ▶️ https://t.co/M9LVyCAp8y#SLvIND pic.twitter.com/cdMA1JyumY— BCCI (@BCCI) August 17, 2026 -
‘కామన్సెన్స్ లేదు.. అతడిని పక్కనబెట్టడమే మంచిది’
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పంత్ 39 పరుగుల వద్ద ఔటయ్యాడు. రెండో రోజు ఆటలో పడిక్కల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన పంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 39 పరుగులతో టచ్‌లో కనిపించినప్పటికీ మరోసారి నిర్లక్ష్యంతో వికెట్ పారేసుకొని విమర్శలు మూటగట్టుకున్నాడు. ముఖ్యంగా లంక ఆఫ్ స్పిన్నర్ కెషారా నువంతా తెలివిగా ఫ్లైటెడ్ డెలివరీలు వేసి పంత్‌ను బోల్తా కొట్టించాడు. దీంతో పంత్ కనీసం కామన్సెన్స్ ఉపయోగించకుండా బ్యాటింగ్ చేశాడని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మండిపడ్డాడు. ‘రిషబ్ పంత్ ఔట్ విషయంలో నాకు ఎలాంటి కంప్లైంట్ లేదు. అతని ఆట విధానమే అలా ఉంటుంది. కానీ నా కంప్లైంట్ ఏంటంటే పంత్ కామన్సెన్స్ లేకుండా ఆడడమే. లంక జట్టు కొత్త బంతి తీసుకున్న తర్వాత తొలి ఓవర్లోనే పంత్ ఔటయ్యాడు. ఆఫ్ స్పిన్నర్ కెషారా తెలివిగా ఫ్లైటెడ్ బంతులను డెలివరీ చేశాడు. అప్పటికే మూడుసార్లు కట్‌షాట్ ఆడేందుకు ప్రయత్నించి పంత్ విఫలమయ్యాడు. కానీ పంత్ ఇక్కడే కామన్సెన్స్ మరిచిపోయాడు. కొత్త బంతిని ఐదు నుంచి ఆరు ఓవర్ల దాకా జాగ్రత్తగా ఆడాలి. ఇది టెస్టు మ్యాచ్ అన్న సంగతి మరిచిపోయి అనవసర షాట్లకు యత్నించి పంత్ వికెట్ పారేసుకున్నాడు. అతను ఓవర్లోని మొదటి బంతికే అలా దూకుడుగా ఆడటం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఒక బ్యాటర్ 150 పరుగుల వద్ద ఉన్నప్పటికీ, కొత్త బంతి వచ్చినప్పుడు మరికొన్ని బంతులు ఆడతాడు. ఆ విషయంలో పంత్‌ను తప్పుబట్టాల్సిందే. లాజిక్ లేకుండా ఆడుతూ క్రికెట్ పరిజ్ఞానంలో పంత్ చాలా వెనుకబడిపోయాడనిపిస్తోంది’ అని చెప్పుకొచ్చాడు. మరోవైపు అభిమానులు కూడా పంత్ నిర్లక్ష్యపు ఆటతీరును విమర్శించారు. పంత్‌ను పక్కనబెట్టి సర్ఫరాజ్‌కు అవకాశమివ్వడం మంచిది అని కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. రెండు వికెట్ల నష్టానికి 288 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా రోజు ముగిసేసరికి 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. సెంచరీ చేసిన పడిక్కల్ (167 పరుగులు) కెరీర్ బెస్ట్ స్కోరు నమోదు చేయగా, ధ్రువ్ జురెల్ (51) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కుల్దీప్ యాదవ్ (12), ప్రసిధ్ క్రిష్ణ (1) క్రీజులో ఉన్నారు. ప్రబాత్ జయసూరియా 4 వికెట్లు పడగొట్టాడు. -
ముగిసిన రెండో రోజు ఆట.. భారత స్కోరెంతంటే?
Sri Lanka Vs India 1st Test Day-2 Live Updates: గాలే వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 460 పరుగుల చేసింది. క్రీజులో ప్రసిద్ద్ కృష్ణ(1), కుల్దీప్ యాదవ్(12) ఉన్నారు. వర్షం కారణంగా రెండో రోజు కేవలం 47 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. భారత బ్యాటర్లలో దేవ్‌దత్త్ పడిక్కల్(167) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కేఎల్ రాహుల్(82), ధ్రువ్ జురెల్(51) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు.వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన టీమిండియాటీమిండియా వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. 447 పరుగుల వద్ద తొలుత సిరాజ్ (11) ఆతర్వాత సుతార్ (24) ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ 9 వికెట్లు కోల్పోయింది.ఏడో వికెట్ కోల్పోయిన భారత్432 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో ధనంజయకు క్యాచ్ ఇచ్చి ధృవ్ జురెల్ (51) ఔటయ్యాడు. మానవ్ సుతార్ (21)కు జతగా సిరాజ్ క్రీజ్‌లోకి వచ్చాడు. టీమిండియా ఆరో వికెట్ డౌన్టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన రవీంద్ర జడేజా.. కేశర నువంత బౌలింగ్‌లో ఔటయ్యాడు. 101 ఓవర్లు ముగిసే సరికి భారత్ 6 వికెట్ల నష్టానికి 388 పరుగులు చేసింది.టీ బ్రేక్‌కు భారత్ స్కోరెంతంటే?రెండో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి భారత్ 5 వికెట్ల నష్టానికి 364 పరుగుల స్కోర్ సాధించింది. క్రీజులో రవీంద్ర జడేజా(4), ధ్రువ్ జురెల్(19) ఉన్నారు.పడిక్కల్ అవుట్పడిక్కల్ రూపంలో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 167 పరుగులు చేసిన పడిక్కల్.. ప్రభాత్ జైసూర్య బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. 93 ఓవర్లకు భారత్ స్కోర్: 361/5. క్రీజులో జురెల్(19), జడేజా(1) ఉన్నారుభారత్ నాలుగో వికెట్ డౌన్భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. 82 పరుగులు చేసిన రాహుల్.. నువాంత బౌలింగ్‌లో ఔటయ్యాడు. 87 ఓవర్లకు భారత్ స్కోర్: 335/4భారత్ మూడో వికెట్ డౌన్భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన పంత్.. కేశర నువాంత బౌలింగ్‌లో ఔటయ్యాడు. తొలి రోజు ఆటలో గాయపడిన కేఎల్ రాహుల్ తిరిగి బ్యాటింగ్‌కు వచ్చాడు. 81 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఆట తిరిగి ప్రారంభంఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. దీంతో రెండో రోజు ఆట తిరిగి ప్రారంభమైంది. 75 ఓవర్లకు టీమిండియా స్కోర్: 296/2. క్రీజులో పడిక్కల్(133), రిషబ్ పంత్(32) ఉన్నారు.మళ్లీ మొదలైన వర్షంమధ్యాహ్నం 2:11 గంటలు- రెండు గంటల విరామం తర్వాత వర్షం మళ్లీ మొదలైంది. ఆట దాదాపుగా ప్రారంభం కావాల్సిన సమయంలో వరుణుడు మరోసారి పలకరించాడు. దంచుతున్న వానలంచ్ విరామం అనంతరం కాసేపు ఎండ పలకరించినప్పటికీ, వరుణుడు మరోసారి విజృంభించాడు. దీంతో స్టేడియంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రెండో రోజు ఆట ప్రారంభమవుతుందా? లేదా అన్నది ఆసక్తిగా మారిపోయింది.శాంతించిన వరుణుడు..గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట మొదటి సెషన్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. అయితే లంచ్ విరామ సమయానికి వర్షం ఆగిపోయింది. దీంతో లంచ్ బ్రేక్ అనంతరం మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. పిచ్‌పై కవర్లను తొలగించిన సిబ్బంది గ్రౌండ్‌ను సాపింగ్ చేశారు.👉గాలే వేదికగా శ్రీలంక, భారత్ మధ్య మొదలైన తొలి టెస్టు రెండో రోజు ఆటకు వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో పిచ్‌పై కవర్లను కప్పి ఉంచారు. 👉రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. శనివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 73 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. వన్‌డౌన్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ (178 బంతుల్లో 131 బ్యాటింగ్; 12 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్లో తొలి సెంచరీతో అదరగొట్టాడు. పంత్ (36 బంతుల్లో 27 బ్యాటింగ్; 3 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నాడు.👉 అంతకముందు సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (162 బంతుల్లో 77; 9 ఫోర్లు, 1 సిక్స్) కూడా హాఫ్ సెంచరీతో మెరవడంతో టీమిండియా ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. అర్ధశతకం అనంతరం రాహుల్ గాయంతో మైదానాన్ని వీడగా... పడిక్కల్‌తో కలిసి యశస్వి జైస్వాల్ (37 బంతుల్లో 32; 5 ఫోర్లు) రనౌట్‌గా వెనుదిరగగా... కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (16) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య ఏకైక వికెట్ పడగొట్టాడు. -
క్రికెట్ చరిత్రలో అద్భుతం.. నాడు కోహ్లి, నేడు పడిక్కల్!
శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా క్రికెటర్ దేవదత్ పడిక్కల్ అజేయ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో పడిక్కల్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఒక రికార్డు విషయంలో మాత్రం పడిక్కల్ తన గురువు విరాట్ కోహ్లితో సమంగా నిలిచాడు. అదేంటంటే విరాట్ కోహ్లి తన తొలి టెస్టు సెంచరీని రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) రోజున చేశాడు. 2012 జనవరి 26న అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో కోహ్లి 116 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లికి టెస్టుల్లో అదే తొలి సెంచరీ కావడం విశేషం. తాజాగా దేవదత్ పడిక్కల్ స్వాతంత్య్ర దినోత్సవం రోజున తన తొలి టెస్టు సెంచరీని బాదడం ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం. ఇలా తన గురువు కోహ్లి రిపబ్లిక్ డే రోజున మెయిడెన్ టెస్టు శతకం సాధిస్తే.. శిష్యుడు పడిక్కల్ ఇండిపెండెన్స్ రోజున తొలి టెస్టు శతకం అందుకోవడం గమనార్హం. మరో విషయమేంటంటే.. రిపబ్లిక్ డే రోజున సెంచరీ చేసిన ఒకే ఒక్క బ్యాటర్‌గా కోహ్లి చరిత్ర సృష్టిస్తే.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున టీమిండియా తరఫున సెంచరీ బాదిన ఏకైక క్రికెటర్‌గా పడిక్కల్ రికార్డులకెక్కాడు. కోహ్లి ఇండిపెండెన్స్ రోజున కూడా సెంచరీ బాదినప్పటికీ, అది వన్డే ఫార్మాట్లో వచ్చింది.తొలి బ్యాటర్‌గా రికార్డుపడిక్కల్ కంటే ముందు భారత తరపున ఏ బ్యాటర్ కూడా ఇండిపెండెన్స్ డే రోజు టెస్టుల్లో మూడంకెల స్కోర్‌ను అందుకోలేదు. గతంలో విరాట్ కోహ్లి వెస్టిండీస్‌పై ఆగస్టు 15న వన్డే సెంచరీ చేయగా.. టెస్టు సెంచరీ చేసింది మాత్రం పడిక్కలే కావడం గమనార్హం. అదేవిధంగా 21వ శతాబ్దంలో టీమిండియా తరపున మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి టెస్ట్ సెంచరీ బాదిన రెండో ప్లేయర్‌గా పడిక్కల్ రికార్డులెక్కాడు.పడిక్కల్ కంటే ముందు సౌరవ్ గంగూలీ మాత్రమే ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా భారత్ తరఫున నెంబర్ 3 పొజిషన్లో టెస్ట్ సెంచరీ సాధించిన ఎడమ చేతి వాటం బ్యాటర్‌గా సలీమ్ దురానీ, బాపూ నాడ్కర్ణి, అజిత్ వాడేకర్, ఏక్నాథ్ సోల్కర్, సురీందర్ అమర్నాథ్, వినోద్ కాంబ్లీ పడిక్కల్ చేరాడు.Virat Kohli was the only Indian batter to score a century on Republic Day, achieving the feat in 2012, which was also his maiden Test century. 🇮🇳Now, Devdutt Padikkal becomes the only Indian batter to score a century on Independence Day, and it’s his maiden Test century too!… pic.twitter.com/CxgE0Q3VnV— CREX (@Crex_live) August 15, 2026Read: మూడో స్థానంపై బేఫికర్.. గిల్ నమ్మినబంటు పడిక్కల్ -
మూడో స్థానంపై బేఫికర్.. గిల్ నమ్మినబంటు పడిక్కల్
దేశవాళీల్లో దుమ్మురేపి భారత జట్టుకు ఎంపికైన దేవదత్ పడిక్కల్ అంతర్జాతీయ స్థాయిలోనూ అదే జోరు కనబరిచాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ప్రత్యర్థి బౌలర్లతో చెడుగుడు ఆడుకున్న పడిక్కల్ శ్రీలంకతో తొలి టెస్టులో అజేయ సెంచరీతో కదం తొక్కాడు. ఫలితంగా టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నమ్మకాన్ని ఒక్క శతకంతో పడిక్కల్ నిలబెట్టుకున్నాడు. 'లంకతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాలో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు ఎవరు వస్తున్నారు?' అనే ప్రశ్న గిల్‌కు ఎదురైంది. కానీ గిల్ ఏమాత్రం తడబడకుండా దేవదత్ పడిక్కల్ పేరును బయటికి చెప్పాడు. మూడో స్థానంలో అంతకంటే మంచి బ్యాటర్‌ను తాను చూడలేదని, ఈ సిరీస్‌లో పడిక్కల్ బ్యాటింగ్‌కు వెన్నుముకలా మారుతాడని గిల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. తాజాగా తొలి టెస్టులో సూపర్ సెంచరీతో గిల్‌కు నమ్మిన బంటు అయ్యాడు పడిక్కల్.2024లో అనూహ్య పిలుపు..2024లో ఆ్రస్టేలియాపై చివరి టెస్టు మ్యాచ్ ఆడిన దేవదత్ పడిక్కల్ శ్రీలంక పర్యటనకు ఎంపికైనా... అతడికి తుది జట్టులో చోటు దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. అయితే గాయం కారణంగా సాయి సుదర్శన్ సిరీస్‌కు దూరం కావడం... అదే సమయంలో శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారీ సెంచరీ చేయడంతో పడిక్కల్‌కు ఆ అవకాశం వచ్చింది. రెండేళ్ల తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకున్న పడిక్కల్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. గత 20 టెస్టుల్లో భారత జట్టు తరఫున మూడో స్థానంలో బరిలోకి దిగిన ప్లేయర్ ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోగా... ఆ లోటును పడిక్కల్ భర్తీ చేశాడు. ఆరంభంలో వన్డే తరహాలో బంతికో పరుగు చొప్పున రాబట్టిన అతడు... ఆ తర్వాత మంచి బంతులను గౌరవిస్తూ ముందుకు సాగాడు. స్పిన్నర్లను ఎదుర్కొనే క్రమంలో చక్కటి స్వీప్ షాట్లు ఆడిన పడిక్కల్... పేసర్లకు ‘నటరాజ్’ షాట్లతో బదులిచ్చాడు. స్క్వేర్ లెగ్ దిశగా సులువుగా పరుగులు రాబట్టిన అతడు... తన ట్రేడ్‌మార్క్ పంచ్ షాట్లతో అలరించాడు. కర్ణాటక తరఫున దేశవాళీల్లో రాహుల్‌తో కలిసి ఎన్నో మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్... అంతర్జాతీయ స్థాయిలోనూ అదే దూకుడు కనబర్చాడు. సెంచరీ అనంతరం కూడా అలసత్వానికి తావివ్వకుండా పూర్తి నియంత్రణతో బ్యాటింగ్ చేస్తూ అభిమానులను ఆకట్టుకున్నాడు. రెండో రోజు కూడా అతడు ఇదే జోరు కొనసాగిస్తూ క్రీజులో పాతుకుపోతే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయం. అంతేకాదు పుజారా రిటైర్మెంట్ తర్వాత తన స్థానాన్ని భర్తీ చేసేందుకు పడిక్కల్‌కు ఇంతకంటే మంచి అవకాశం మళ్లీ రాదు. ఈ సిరీస్‌లో విశేషంగా రాణిస్తే మాత్రం పడిక్కల్ స్థానానికి ఢోకా ఉండదు.MAIDEN TEST HUNDRED! 💯A special moment on a special day for Devdutt Padikkal in Galle 🥳Updates ▶️ https://t.co/M9LVyCAp8y#TeamIndia | #SLvIND pic.twitter.com/8x1HcYeFbA— BCCI (@BCCI) August 15, 2026Read: నడవలేని స్థితిలో కేఎల్ రాహుల్.. గాయంపై బిగ్ అప్డేట్! -
నడవలేని స్థితిలో కేఎల్ రాహుల్.. గాయంపై బిగ్ అప్డేట్!
గాలే వేదికగా మొదలైన తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ కండరాల నొప్పితో మైదానం వీడడం భారత శిబిరంలో ఆందోళన కలిగించింది. అర్ధశతకం సాధించిన రాహుల్ శతకం వైపు పరుగులు తీస్తున్న క్రమంలోనే కండరాల నొప్పితో విలవిల్లాడిపోయాడు. కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడడంతో టీ బ్రేక్ తర్వాత బ్యాటింగ్‌కు రాలేకపోయాడు.దీంతో లంకతో టెస్టు సిరీస్‌కు కేఎల్ రాహుల్ దూరమవుతాడా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ కేఎల్ రాహుల్ గాయంపై బిగ్ అప్డేట్ ఇచ్చాడు. రాహుల్ ఫిట్‌నెస్‌పై అందోళన వద్దని అంటున్నాడు. కండరాలు పట్టేశాయని, భారత ఓపెనర్ ఫిట్‌గానే ఉన్నాడని సితాన్షు వెల్లడించాడు.‘కేఎల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. నా దృష్టిలో అతడికి క్రాంప్స్ వచ్చాయంతే. రోజు ముగిసే సరికి అతడు బాగానే ఉన్నాడు. కండరాలు పట్టేయడం మొదలయ్యాక .. తొడ కండరాలు నొప్పి మొదలవుతుంది. ఒక్కోసారి గజ్జల్లోనూ నొప్పి వస్తుంది. కానీ, అతడు బాగానే ఉన్నాడు. రేపు అతడు బ్యాటింగ్‌కు సిద్ధంగా ఉంటాడు’ అని సితాన్షు పేర్కొన్నాడు.గాలే వేదికగా శ్రీలంకతో తొలి టెస్టును భారత్ ఘనంగా ఆరంభించింది. మొదటి రోజు ఆటలో ఆతిథ్య జట్టుపై టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 73 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 288 పరుగుల భారీ స్కోర్ సాధించింది. యువ బ్యాటర్ దేవ్‌దత్త్ పడిక్కల్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. పడిక్కల్ 131 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడితో పాటు రిషబ్ పంత్ (31) క్రీజులో ఉన్నాడు. A worrying moment in Galle. 😟💔KL Rahul has retired hurt after struggling with an issue in his right-hand finger, along with severe cramps.He was seen receiving treatment before walking back to the dressing room. Hoping it’s nothing serious and KL is back soon. 🙏❤️📸:… pic.twitter.com/Q8w6XdHuwx— CricTracker (@Cricketracker) August 15, 2026Read: ఆఫ్గన్ కెప్టెన్ రికార్డు సెంచరీ.. ఐర్లాండ్ క్లీన్‌స్వీప్ -
రాహుల్ దెబ్బకు మైదానం వీడిన లంక ప్లేయర్!
గాలే వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక ఆటగాడు నిషాన్ మదుష్క గాయంతో మైదానం వీడడం కలకలం రేపింది. టీమిండియా ఇన్నింగ్స్ 9వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రబాత్ జయసూరియా వేసిన బంతిని కేఎల్ రాహుల్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో నిషాన్ మదుష్క మెడ భాగంలో బలంగా తగిలింది. దీంతో మైదానంలో కిందపడిపోయిన నిషాన్ వద్దకు ఫిజియో పరిగెత్తుకు వచ్చారు. అయితే నిషాన్ మెడపై బంతి తాకిన ప్రదేశంలో వాపు రావడంతో డాకర్లు వెంటనే అతడిని పెవిలియన్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారు. దీంతో కంకషన్‌కు గురైన నిషాన్ మదుష్క స్థానంలో సూరియాబండారా సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. ఒకవేళ నిషాన్ మదుష్క గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం తొలి టెస్టుకు అతడు దూరమయ్యే అవకాశాలున్నాయి. అదే గనుక జరిగితే నిషాన్ స్థానంలో సూరియా బండారా టెస్టు అరంగేట్రం చేయనున్నాడు. ఒకవేళ మదుష్క దూరమైతే మాత్రం శ్రీలంకకు ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు. ఇటీవలే ఇండియా-ఏతో జరిగిన అనధికారిక మ్యాచ్‌లో ఆడిన నిషాన్ 4 ఇన్నింగ్స్‌లు కలిపి 256 పరుగులు సాధించాడు. అంతేకాదు శ్రీలంక తరఫున టెస్టుల్లో 64.50 సగటుతో పరుగులు సాధించిన మదుష్క ఖాతాలో రెండు అర్ధసెంచరీలున్నాయి. గాయంతో నిషాన్ మదుష్క దూరమైతే అతడి స్థానంలో రానున్న పసిందు సూరియబండారా కూడా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మంచి రికార్డు కలిగి ఉన్నాడు. 54.36 సగటుతో 4,893 పరుగులు సాధించాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం అంతరాయం కలిగించే సమయానికి టీమిండియా 27 ఓవర్లలో వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. పడిక్కల్ (35), కేఎల్ రాహుల్ (32) పరుగులు చేశారు. అంతకముందు జైస్వాల్ (32) రాహుల్‌తో సమన్వయ లోపంతో రనౌట్‌గా వెనుదిరిగాడు.😳 NASTY BLOW FOR NISHAN MADUSHKA!KL Rahul’s powerful sweep struck Nishan Madushka on the helmet, forcing the Sri Lankan fielder to leave the field. 🏏Hoping Madushka is absolutely fine and back on the field soon! 🙏🇱🇰#INDvsSL pic.twitter.com/MxtoXiJEuC— CricInformer (@CricInformer) August 15, 2026Read: ఆరు వికెట్లతో ఇరగదీశాడు.. ఆసీస్ బౌలర్ అరుదైన ఫీట్ -
అగార్కర్ పదవి ఉంటుందా? ఊడుతుందా? డెడ్‌లైన్ అప్పుడే!
శ్రీలంకతో టెస్టు సిరీస్ తర్వాత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భవితవ్యంపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌తో అగార్కర్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలోనే అతడిని కొనసాగించాలా లేక వేరేవారికి అవకాశమివ్వాలా అనే దానిపై బీసీసీఐ ఒక నిర్ణయానికి రానుంది. అయితే 2027 వన్డే ప్రపంచకప్ వరకు అగార్కర్‌ను కొనసాగించాలనే అంశం కూడా బీసీసీఐ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 2023లో అగార్కర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు అతడిని వివాదంలోకి నెట్టేశాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి తొలగించడంలో అగార్కర్ తెర వెనుక ప్రధాన పాత్ర పోషించాడనే వార్త అప్పట్లో బాగా వైరలయ్యింది. అంతేకాదు ఇంగ్లండ్‌తో జులైలో జరిగిన వన్డే సిరీస్ తర్వాత రోహిత్‌ను జట్టు నుంచి తప్పించే ఆలోచన ఉందని సెలెక్టర్లు అతడికి తెలిపినట్లు నివేదిక పేర్కొంది. అయితే బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాత్రం రోహిత్ జట్టు ప్రణాళికల్లో ఉన్నంతకాలం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాడని వ్యాఖ్యానించారు.2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని రోహిత్ భవిష్యత్తును ప్రతి సిరీస్ తర్వాత సమీక్షించాలని బీసీసీఐ కోరుకుంటున్నట్లు సమాచారం. అయితే సైకియా చేసిన వ్యాఖ్యలు సెలెక్టర్లకు అసంతృప్తి కలిగించినట్లు నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో అగార్కర్‌తో జరగనున్న సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. సెలక్షన్ కమిటీ పనితీరు, భవిష్యత్ ప్రణాళికలతో పాటు రోహిత్ అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.ఇక బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పదవీకాలం పొడిగింపు సందర్భాలు చాలా తక్కువ. గతంలో శివసుందర్ దాస్, ఎస్. శరత్, సుబ్రోతో బెనర్జీ, అజయ్ రాత్రా సహా మిగిలినవాళ్లంతా తన పదవీ కాలం ముగియగానే బయటికి వెళ్లిపోయారు. కానీ అగర్కార్ సెలెక్టర్‌గా వచ్చిన తర్వాత అతడు మంచి ఫలితాలు సాధించాడు. అతడి సెలెక్షన్ పర్యవేక్షణలో టీమిండియా నాలుగు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్ చేరడంతో పాటు వాటిలో మూడు టైటిల్స్‌ను అందుకుంది. జట్టులో మార్పులు కూడా ఫలితాలు ఇవ్వడంతో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ అగార్కర్‌కు మద్దతు ఇచ్చింది. మధ్యలో రోహిత్ శర్మ విషయంలో బీసీసీఐతో అభిప్రాయబేధాలు వచ్చినప్పటికీ, ఇవేవీ పట్టించుకోకుండా అగార్కర్ పదవీకాలాన్ని పొడిగించే యోచనలో ఉంది. అంతకముందు 2022 టీ20 ప్రపంచకప్ సమయంలో టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా ఉన్న చేతన్ శర్మపై విమర్శలు వచ్చాయి. ఇక 2019 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ భారత్ ఫైనల్ చేరడంలో విఫలం కావడంతో అప్పటి సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్‌పై అటు బీసీసీఐ, ఇటు అభిమానుల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరి అగార్కర్‌పై విశ్వాసముంచి బీసీసీఐ అతడి పదవిని పొడిగిస్తుందా? తొలగిస్తుందా అనేది వచ్చే నెలతో తేలిపోనుంది.Read: సైక్లింగ్‌లో విషాదం.. ప్రాణం తీసిన అజాగ్రత్త! -
IND vs SL: తొలి రోజు భారత్‌దే
Sri Lanka Vs India 1st Test Live Updates: గాలే వేదికగా శ్రీలంకతో ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజు ఆటలో భారత బ్యాటర్లు అదరగొట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. క్రీజులో పడిక్కల్(131), రిషబ్ పంత్(27) ఉన్నారు.శుబ్‌మన్ గిల్ అవుట్61.5: ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో లాహిరు ఉదారకు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్‌గా వెనుదిరిగిన గిల్ (16). స్కోరు 236-2. పడిక్కల్ 107 పరుగులతో ఉన్నాడు. పంత్ క్రీజులోకి వచ్చాడు.పడిక్కల్ సెంచరీటీమిండియా వన్‌డౌన్‌బ్యాటర్ దేవదత్ పడిక్కల్ శతక్కొట్టాడు. 134 బంతులలో వంద పరుగుల మార్కు అందుకున్నాడు. టీమిండియా స్కోరు: 235/1(61). పడిక్కల్ 106, గిల్ 16 పరుగులతో ఉన్నారు.కేఎల్ రాహుల్‌కు గాయంటీమిండియాకు భారీ షాక్ తగిలింది. సెంచరీ దిశగా దూసుకుపోతున్న కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. దీంతో అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అతడిస్థానంలో కెప్టెన్ గిల్ వచ్చాడు. కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీటీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను పూర్తి చేసుకున్నాడు. 46 ఓవర్లకు భారత్ స్కోర్: 166/1. క్రీజులో రాహుల్(53), పడిక్కల్(78) ఉన్నారు.పడిక్కల్ హాఫ్ సెంచరీదేవ్దత్త్ పడిక్కల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 81 బంతుల్లో తన రెండో ఆర్ధ శతకాన్ని అతడు అందుకున్నాడు. 37 ఓవర్లకు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 126 పరుగులు చేసింది. క్రీజులో పడిక్కల్‌తో పాటు రాహుల్(41) ఉన్నాడు.తిరిగి మొదలైన ఆట2 PM: వాన తెరిపినివ్వడంతో ఆట మళ్లీ మొదలైంది.మొదలైన జల్లులు!12.38 PM: గాలెలో చిరుజల్లులు మొదలయ్యాయి. ఆకాశం నల్లని మేఘాలతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో గ్రౌండ్ సిబ్బంది వచ్చి పిచ్‌ను కవర్లతో కప్పుతున్నట్లు సమాచారం. వాన వల్ల ఆటకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.లంచ్ బ్రేక్: టీమిండియా స్కోరు 101/1లంకతో జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజు లంచ్ సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 101 పరుగులు చేసింది. పడిక్కల్ (35), కేఎల్ రాహుల్ (32) పరుగులతో ఆడుతున్నారు. తొలి సెషన్లో జైస్వాల్ రనౌట్ మినహా భారత బ్యాటర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. Lunch on Day 1 of the First #SLvIND Test.A solid morning session as #TeamIndia move to 101/1 👌👌Stay tuned for the second session of the day. Scorecard ▶️ https://t.co/M9LVyCAp8y pic.twitter.com/ru1NamfAn4— BCCI (@BCCI) August 15, 2026జైసూ స్థానంలోక్రీజులోకి పడిక్కల్👉18 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (22), పడిక్కల్ (20) పరుగులతో ఆడుతున్నారు.👉 లంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్‌తో జరిగిన సమన్వయ లోపంతో ఇద్దరు ఒకే ఎండ్‌కు రావడంతో జైస్వాల్ (32) రనౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా 47 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.👉 8 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. జైస్వాల్ (23), కేఎల్ రాహుల్ (10) పరుగులతో ఆడుతున్నారు.రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గాలే వేదికగా శనివారం శ్రీలంక, భారత్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. సర్ఫరాజ్ ఖాన్ ఆడుతాడని అంతా భావించినప్పటికీ గిల్ మాత్రం ధ్రువ్ జురెల్వైపే మొగ్గుచూపాడు. ఇక ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగింది.తుది జట్లు:టీమిండియా : యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.శ్రీలంక: లాహిరు ఉదార, నిషాన్ మదుష్క, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా(కెప్టెన్), సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), కేశర నువంత, ప్రబాత్ జయసూర్య, లాహిరు కుమార, అసిత ఫెర్నాండో.1932లో తొలి టెస్టు ఆడిన టీమిండియాకు ఇది 600వ మ్యాచ్ కానుండగా... మైలురాయి మ్యాచ్‌లో విజయం సాధించాలని శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు పట్టుదలగా ఉంది. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు టీమిండియా 9 టెస్టులు ఆడనుంది. ఇందులో ఏడింట గెలిస్తే భారత్ నేరుగా తుదిపోరుకు అర్హత సాధించనుంది. దీంతో విజయమే లక్ష్యంగా గిల్ సేన బరిలోకి దిగనుంది. గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టి20 ప్రపంచకప్, ఆసియాకప్, చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమిండియా... సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. దీంతో గంభీర్‌పై కూడా అదనపు ఒత్తిడి ఉంది. 2017లో విరాట్ కోహ్లి సారథ్యంలో లంకలో పర్యటించిన భారత జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3–0తో ‘క్లీన్ స్వీప్’ చేసింది. ఆ సమయంలో టీమిండియా స్టార్ బ్యాటర్లతో దట్టంగా ఉండగా... ఇప్పుడు అలాంటి అనుభవజ్ఞులు కరువయ్యారు. Captain Shubman Gill wins the toss and elects to bat first at Galle.A look at our Playing XI for the game.Live - https://t.co/bg2q0J2x1f #SLvIND pic.twitter.com/ll2Xa9sTm3— BCCI (@BCCI) August 15, 2026 టీమిండియా పంద్రాగష్టు సంబరాలు హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కలిసి జాతీయ జెండా ఎగురవేశారు. On the occasion of Independence Day, #TeamIndia gathered at Galle to hoist the Tricolour 🇮🇳 ahead of the First #SLvIND Test.#IndependenceDay pic.twitter.com/tHKIggV6AU— BCCI (@BCCI) August 15, 2026 -
‘సారథ్యం భారం కాదు.. ఈ టెస్టు మ్యాచ్ నాకు ప్రత్యేకం’
గాలె: భారత క్రికెట్ జట్టు సరైన దిశలోనే ప్రయాణిస్తోందని టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వెల్లడించాడు. సారథ్య బాధ్యతలు తనపై ఎలాంటి అదనపు భారం వేయడం లేదన్న గిల్... భవిష్యత్తులో జట్టు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఖాయమని ఆశాభావం వ్యక్తంచేశాడు. గతేడాది కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఇంగ్లండ్ పర్యటనలో అదరగొట్టిన గిల్... టీమిండియా 2–2తో సిరీస్ ‘డ్రా’ చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఆ తర్వాత అతడి కెప్టెన్సీలో స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు సిరీస్ పరాజయాలు ఎదుర్కొంది. 2027లో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు భారత జట్టు ఇంకా 9 టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో సింహభాగం విజయాలు సాధిస్తేనే తుదిపోరుకు చేరనుంది. ఈ క్రమంలో నేటి నుంచి శ్రీలంకతో భారత జట్టు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు, ప్లేయర్ల దృక్పథం, కీలక ఆటగాళ్ల గాయాలపై గిల్ చెప్పిన వివరాలు అతడి మాటల్లోనే... అదే ప్రధాన లక్ష్యం... కెప్టెన్సీతో నాకెలాంటి ఇబ్బంది లేదు. గతేడాది కాలంగా నా ప్రదర్శనను గమనిస్తే ఆ విషయం ఎవరికైనా అర్థమైపోతుంది. నా దృష్టిలో సారథ్య బాధ్యతలు చేపట్టిన అనంతరం నా ఆటతీరు మరింత మెరుగైందనిపిస్తుంది. ప్రస్తుతం జట్టు సరైన దిశలోనే సాగుతోంది. ఇప్పుడు మా ముందున్న ప్రధాన లక్ష్యం వచ్చే ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించడమే. రానున్న ఆరు, ఏడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధిస్తే అది సాధ్యమవుతుంది. శ్రీలంక పర్యటనతోనే ఆ దిశగా ముందడుగు వేయాలనుకుంటున్నాం. అందుకోసం బాగా సన్నద్ధమయ్యాం. నెట్స్‌లో తీవ్రంగా శ్రమించడంతో పాటు... ప్రాక్టీస్ మ్యాచ్‌లో సైతం మెరుగైన ప్రదర్శన చేశాం. అరుదైన 600వ టెస్టు దేశానికి ప్రాతినిధ్యం వహించడమే గొప్ప అవకాశం. అందులో సారథ్యం వహించడం మరింత గర్వకారణం. అలాంటిది టీమిండియా మైలురాయి టెస్టు మ్యాచ్‌లో జట్టును నడిపించనుండటం ఆ ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది. భారత్ ఆడిన 100వ టెస్టు మ్యాచ్‌కు మన్సూర్ అలీఖాన్ పటౌడీ సారథ్యం వహించగా... 500వ మ్యాచ్‌కు విరాట్ కోహ్లి కెప్టెన్‌గా ఉన్నాడు. ఇప్పుడు 600వ మ్యాచ్‌కు నేను కెప్టెన్ కావడం... అది కూడా దేశ 80వ స్వాతంత్ర దినోత్సవం నాడు కావడం మరింత ప్రత్యేకం. శ్రీలంక పిచ్‌లు స్పిన్‌కు అనుకూలించడం పరిపాటి కాగా... పరిస్థితులను అర్థం చేసుకొని ఆడితేనే మెరుగైన ఫలితాలు సాధించగలం. ప్రసిధ్కే మొగ్గు... ఫాస్ట్ బౌలర్లు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. గుర్నూర్ బ్రార్, ఆఖిబ్ నబీలో ఎంతో నైపుణ్యం ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో గుర్నూర్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. బంతి పాతబడ్డ తర్వాత అతడు మరింత ప్రమాదకరం. అదనపు బౌన్స్, అదనపు వేగంతో ప్రత్యరి్థని సులువుగా బోల్తా కొట్టించగలడు. అదే సమయంలో ప్రసిధ్ కృష్ణ నిలకడ కనబరుస్తున్నాడు. అతడికి అనుభవం కూడా ఉంది. దీంతో తుది జట్టు ఎంపిక మరింత కష్టమవుతుంది. స్టార్ పేసర్ బుమ్రా గైర్హాజరీలో ఇతర బౌలర్లు సత్తాచాటేందుకు ఇది సరైన సమయం. పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా... లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడి వికెట్లు రాబడితేనే జట్టుకు ప్రయోజనం చేకూరుతుంది. నైపుణ్యానికి కొదవలేదు... జట్టులో నైపుణ్యం గల ఆటగాళ్లకు కొదవలేదు. ఏ స్థానానికైనా తగిన రిప్లేస్మెంట్ సిద్ధంగా ఉంది. సాయి సుదర్శన్ గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఎవరికి అవకాశం ఇచ్చినా వారు సత్తా చాటగలరు. సుదీర్ఘ ఫార్మాట్లో పరుగులు సాధించడం అంత సులువు కాదు. జట్టులోకి వచ్చిన వెంటనే పరుగుల వరద పారించడం ఎవరికీ సాధ్యం కాదు. కొంతమంది ఆటగాళ్లు త్వరగా లయ అందుకుంటారు. మరికొంతమందికి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అది ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. పడిక్కల్ చాలా మంచి ప్లేయర్. గతంలోనూ అతడు చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ ఫార్మాట్లో విజయవంతం అయ్యేందుకు అవసరమైన సత్తా అతడిలో పుష్కలంగా ఉంది. 2017లో శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడిన రాహుల్, రవీంద్ర జడేజా అనుభవం మాకు ఎంతగానో ఉపయోగపడుతోంది. రిస్క్ తీసుకోలేం... ప్లేయర్ల జీవితంలో గాయాలు సహజం. ఈ సిరీస్‌కు మొదట ఎంపిక చేసిన బుమ్రా, సాయి సుదర్శన్ గాయాలతోనే దూరమయ్యారు. దీంతో ఒకింత ఇబ్బందికి గురయ్యాం. అయితే వారితో నిరంతరం టచ్‌లో ఉంటూ పురోగతి తెలుసుకుంటున్నాం. సుదీర్ఘ ఫార్మాట్లో రిస్క్ తీసుకోలేం. ఐదు రోజుల పాటు మైదానంలో గడపాలంటే మెరుగైన ఫిట్నెస్ తప్పనిసరి. టి20, వన్డేలతో పోల్చుకుంటే... ప్లేయర్లు తమ ప్రతిభను చాటుకునేందుకు టెస్టుల్లో ఎక్కువ అవకాశాలుంటాయి. తొలి రోజు మెరుగ్గా ఆడలేకపోతే... రెండో రోజు దాన్ని మరిపించే ప్రదర్శనతో మన్ననలు అందుకునే చాన్స్ టెస్టుల్లోనే ఉంటుంది. మానవ్ సుతార్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు. దీంతో జట్టులో ఎనిమిదో స్థానం వరకు బ్యాటర్లు ఉన్నట్లే. -
సుదీర్ఘ సమరానికి సై
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు అర్హత సాధించడమే లక్ష్యంగా భారత జట్టు... శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. సొంతగడ్డపై వరుస సిరీస్ పరాజయాల నుంచి కోలుకొని టీమిండియా సత్తా చాటాలని భావిస్తుంటే... శ్రీలంక స్పిన్‌తో ప్రత్యరి్థని దెబ్బతీయాలని ప్రణాళికలు రచిస్తోంది. భారత జట్టుకు ఇది 600వ టెస్టు మ్యాచ్ కావడం మరో విశేషం. గాలె: సుదీర్ఘ విరామం అనంతరం భారత క్రికెట్ జట్టు శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడనుంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం తొలి టెస్టు ప్రారంభం కానుంది. 1932లో తొలి టెస్టు ఆడిన టీమిండియాకు ఇది 600వ మ్యాచ్ కానుండగా... మైలురాయి మ్యాచ్‌లో విజయం సాధించాలని శుబ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు పట్టుదలగా ఉంది. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు టీమిండియా 9 టెస్టులు ఆడనుంది. ఇందులో ఏడింట గెలిస్తే భారత్ నేరుగా తుదిపోరుకు అర్హత సాధించనుంది. దీంతో విజయమే లక్ష్యంగా గిల్ సేన బరిలోకి దిగనుంది. గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టి20 ప్రపంచకప్, ఆసియాకప్, చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన టీమిండియా... సుదీర్ఘ ఫార్మాట్లో మాత్రం ఆశించిన ఫలితాలు సాధించలేకపోతోంది. దీంతో గంభీర్‌పై కూడా అదనపు ఒత్తిడి ఉంది. స్పిన్‌కు ఎదురొడ్డితేనే... 2017లో విరాట్ కోహ్లి సారథ్యంలో లంకలో పర్యటించిన భారత జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 3–0తో ‘క్లీన్ స్వీప్’ చేసింది. ఆ సమయంలో టీమిండియా స్టార్ బ్యాటర్లతో దట్టంగా ఉండగా... ఇప్పుడు అలాంటి అనుభవజు్ఞలు కరువయ్యారు. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా... దేవదత్ పడిక్కల్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు రానున్నాడు. కెపె్టన్ గిల్ నాలుగో స్థానంలో బరిలోకి దిగనుండగా... ఆ తర్వాత పంత్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తారు. సర్ఫరాజ్ ఖాన్‌కు తుది జట్టులో చోటు కష్టమే. ఒకప్పుడు స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటారనే పేరున్న భారత ప్లేయర్లు... ఇటీవలి కాలంలో ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. లంక జట్టులో ప్రభాత్ జయసూర్య, రమేశ్ మెండిస్ వంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతో బరిలోకి దిగడం ఖాయమే కాగా... సిరాజ్‌తో పాటు ప్రసిధ్ కొత్త బంతిని పంచుకోనున్నాడు. జడేజా, కుల్దీప్, మానవ్ స్పిన్ భారం మోస్తారు. తుది జట్లు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్), రాహుల్, జైస్వాల్, పడిక్కల్, పంత్, జురేల్, జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్, సిరాజ్, ప్రసిధ్. శ్రీలంక: ధనంజయ డిసిల్వా (కెపె్టన్), లహిరు, నిషాన్, దినేశ్, కమిందు, డిక్వెల్లా, సోనల్, ప్రభాత్, రమేశ్, అషిత ఫెర్నాండో, లహిరు కుమార.పిచ్, వాతావరణం గాలె పిచ్ గతంలో మాదిరిగా పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలించకపోవచ్చని శ్రీలంక కెప్టెన్ ధనంజయ్ పేర్కన్నాడు. పిచ్‌పై తేమ ఎక్కువగా ఉండటంతో బ్యాటర్లకు లబ్ది చేకూరే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్‌కే మొగ్గుచూపనుంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి. -
తొలి టెస్టుకు ముగ్గురు స్పిన్నర్లతో.. సర్ఫరాజ్‌కు చాన్స్!
శ్రీలంకతో గాలే వేదికగా జరగనున్న తొలి టెస్టుకు టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గాలే పిచ్ తొలి రెండు రోజులు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని, ఆ తర్వాతి మూడు రోజులు స్పిన్నర్లకు ఉపయుక్తంగా ఉంటుందని పిచ్ రిపోర్ట్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. మ్యాచ్‌కు ఒక్కరోజు మాత్రమే మిగిలిఉన్నప్పటికీ, తుదిజట్టు ఇంకా ఖరారు కాలేదు. గాలే పిచ్ పరిస్థితులను బట్టి ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని టీమిండియా మేనేజ్మెంట్ యోచిస్తోంది. ఈ లెక్కన కుల్దీప్ యాదవ్‌తో పాటు రవీంద్ర జడేజా, మానవ్ సుతార్ లేదా సారాంశ్ జైన్‌లో ఒకరు స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా చోటు దక్కించుకోనున్నారు. ఇక సిరాజ్, గుర్నూర్ బ్రార్ లేదా ప్రసిధ్ క్రిష్ణలు పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు. ఇక బ్యాటింగ్ విభాగంలో తొలి ఐదు స్థానాల్లో (జైస్వాల్, కేఎల్ రాహుల్, పడిక్కల్, గిల్, పంత్) ఎలాంటి మార్పు లేనప్పటికీ, ఆరో స్థానంపై తెగ చర్చ నడుస్తోంది. ఆరో స్థానంలో జురెల్ లేదా సర్ఫరాజ్ల్లో ఒకరికే చాన్స్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే సీనియార్టీ ప్రకారం జురెల్ కంటే సర్ఫరాజ్ వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. దీంతో సర్ఫరాజ్ లంకతో తొలి టెస్టులో ఆడడం దాదాపు ఖాయమైనట్లే.టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్: జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవద్ పడిక్కల్, గిల్ (కెప్టెన్), పంత్ ( వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్/సారాంశ్, సిరాజ్, గుర్నూర్/ప్రసిధ్ క్రిష్ణ.🚨 NOT A TURNER ❌ - Galle pitch is likely to be batting friendly in first 2 days. [Sahil Malhotra from TOI]India likely to field 2 quicks & 3 spinners for depth and balance. pic.twitter.com/vx6k5h5aLy— Johns. (@CricCrazyJohns) August 14, 2026Read: వీవీఎస్ లక్ష్మణ్‌కు బీసీసీఐ అత్యున్నత పదవి? -
‘ఒళ్లు దగ్గరపెట్టుకొని ఆడు’.. స్టార్ ప్లేయర్‌కు గంభీర్ వార్నింగ్!
గాలే వేదికగా రేపటి నుంచి శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టుకు టీమిండియా తుది జట్టు ఇంకా ఖరారు కాలేదు. తుది జట్టుపై ఒక స్పష్టత ఉన్నప్పటికీ, ఒక్క స్థానం విషయంలో మాత్రం మేనేజ్మెంట్ ఎటూ తేల్చుకోలేకపోతుంది. సాయి సుదర్శన్ గాయపడడంతో సర్ఫరాజ్ ఖాన్ అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. దీంతో ధ్రువ్ జురెల్ తుది జట్టులో కొనసాగడంపై సందేహాలు నెలకొన్నాయి.జురెల్‌తో పోలిస్తే సర్ఫరాజ్ ఖాన్‌కు టెస్టుల్లో మంచి రికార్డు ఉండడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో ధ్రువ్ జురెల్‌కు మేనేజ్మెంట్ నుంచి హెచ్చరికలు వస్తున్నట్లు తెలుస్తోంది. టెస్టు క్రికెట్ జట్టులో చోటు ఉండాలంటే ధ్రువ్ జురెల్ మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుందని, లేదంటే జట్టులో చోటు కోల్పోవాల్సి వస్తుందని కోచ్ గంభీర్ అతడికి సున్నితంగానే హెచ్చరించినట్లు సమాచారం. పంత్ రెగ్యులర్ వికెట్ కీపర్‌గా ఉండడంతో ఇంతకాలం జురెల్ అదనపు బ్యాటర్‌గా జట్టులో కొనసాగాడు. తాను ఆడిన 10 టెస్టుల్లో బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో జురెల్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇక 2025లో స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ ధ్రువ్ జురెల్ విఫలమయ్యాడు. దీంతో ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు నిలుపుకోవాలంటే జురెల్ తన ప్రదర్శనను గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరముందని యాజమాన్యం భావిస్తోంది. ఆఫ్గన్‌తో ఏకైక టెస్టులోనూ జురెల్ కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. అయితే లంక-ఏ జట్టుపై సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించి టచ్‌లోకి వచ్చినట్లు అనిపించాడు. కానీ ఇటీవలే లంక ఎలెవెన్‌తో వార్మప్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో జురెల్ వరుసగా 1, 17 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పటికే సర్ఫరాజ్ ఖాన్ జట్టులోకి రావడంతో జురెల్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. ఆరో స్థానంలో ఈ ఇద్దరిలో ఎవరిని ఆడించాలనే దానిపై మేనేజ్మెంట్ మల్లగుల్లాలు పడుతున్న వేళ ధ్రువ్ జురెల్ రాణించకపోవడం అతడికి మైనస్‌గా మారే అవకాశముంది. అంతేకాదు జురెల్‌తో పోలిస్తే సర్ఫరాజ్ నాలుగు టెస్టులు తక్కువే ఆడినప్పటికీ, ఒక సెంచరీతో పాటు రెండు అర్ధసెంచరీలు ఎక్కువగా సాధించడం విశేషం. దీంతో లంకతో తొలి టెస్టుకు జురెల్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌కు అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.Read: లంకతో తొలి టెస్టు.. రికార్డుల వేటకు టీమిండియా సిద్ధం! -
లంకతో తొలి టెస్టు.. రికార్డుల వేటకు టీమిండియా సిద్ధం!
శ్రీలంక, భారత్ మధ్య శనివారం నుంచి గాలే వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే లంక తొలి టెస్టు కోసం తమ తుది జట్టును ప్రకటించగా, భారత్ తుది జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది. తుది జట్టుపై ఒక అంచనా ఉన్నప్పటికీ, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌లో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో గాలేలో టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులపై కన్నేశారు.👉భారత వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ టెస్టుల్లో 100 సిక్సర్లు పూర్తి చేయడానికి మరో మూడు సిక్సర్ల దూరంలో ఉన్నాడు. ఈ ఘనత సాధిస్తే టెస్ట్ క్రికెట్లో వంద సిక్సర్లు బాదిన తొలి భారతీయ క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. అలాగే డబ్ల్యూటీసీ చరిత్రలో మూడువేల పరుగులు పూర్తి చేసిన మొదటి వికెట్ కీపర్‌గా నిలవడానికి పంత్‌కు మరో 220 పరుగులు కావాలి. శ్రీలంకలో ఇప్పటివరకు ఏ భారతీయ వికెట్ కీపర్ కూడా టెస్ట్ సెంచరీ చేయలేదు, ఈసారి పంత్ ఆ రికార్డును అందుకుంటాడా అన్నది చూడాలి.👉యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టుల్లో 50 సిక్సర్ల మైలురాయిని చేరుకోవడానికి కేవలం 5 సిక్సర్ల దూరంలో ఉన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మల తర్వాత ఈ ఘనత సాధించిన మూడో భారతీయ ఓపెనర్‌గా జైస్వాల్ నిలవనున్నాడు. 24 ఏళ్ల వయసులోనే 5 వేర్వేరు దేశాల్లో టెస్ట్ సెంచరీలు సాధించిన రెండో భారతీయ బ్యాటర్ గా సచిన్ టెండూల్కర్ సరసన చేరేందుకు జైస్వాల్‌కు ఒక్క శతకం అవసరం.👉అంతర్జాతీయ క్రికెట్లో 10వేల పరుగులు (అన్ని ఫార్మాట్లు) పూర్తి చేసుకోవడానికి కేఎల్ రాహుల్ మరో 170 పరుగుల దూరంలో ఉన్నాడు. సునీల్ గవాస్కర్ తర్వాత విదేశాల్లో 10 టెస్ట్ సెంచరీలు చేసిన రెండో ఆసియా ఓపెనర్ నిలిచేందుకు రాహుల్ కు రెండు సెంచరీలు దూరంలో నిలిచాడు.👉ఇక టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ టెస్ట్ క్రికెట్లో మూడువేల పరుగులు పూర్తి చేసుకోవడానికి మరో 31 పరుగులు అవసరం. కెప్టెన్‌గా 2వేల పరుగులు సాధించడానికి అతడికి 150 పరుగులు కావాలి. ఇక సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిల తర్వాత శ్రీలంకలో టెస్ట్ సెంచరీ చేసిన మూడో భారత కెప్టెన్‌గా నిలిచేందుకు గిల్ ఎదుట సువర్ణావకాశం ఉంది.👉లంకతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను గెలుచుకుని, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరచుకోవాలని టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న భారత్, 2017 తర్వాత తొలిసారిగా శ్రీలంక గడ్డపై టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. -
తొలి టెస్టుకు వర్షం ముప్పు.. గాలే చేరుకున్న టీమిండియా
శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు ఆగస్టు 5న లంక గడ్డపై అడుగుపెట్టింది. ఆగస్టు 7 నుంచి మూడు రోజుల పాటు కొలంబో వేదికగా లంక ఎలెవెన్‌తో వార్మప్ మ్యాచ్ ఆడిన టీమిండియా ఘన విజయాన్ని అందుకుంది. వార్మప్ మ్యాచ్ ఇచ్చిన విజయం జోష్‌తో టీమిండియా తొలి టెస్టు ఆడేందుకు గాలేలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా గాలే ఎయిర్‌పోర్టు నుంచి టీమిండియా ఆటగాళ్లు బయటికి వస్తున్న ఫొటోలను బీసీసీఐ బుధవారం ఎక్స్ వేదికగా పంచుకుంది. జడేజా, పంత్, జైస్వాల్, సిరాజ్, సర్ఫరాజ్ ఖాన్ సహా ఇతర ఆటగాళ్లు, కోచ్ గంభీర్ కనిపించారు. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక బస్సులో గాలే స్టేడియం సమీపంలోని హోటల్‌కు చేరుకున్నారు. బుధవారం విశ్రాంతి తీసుకోనున్న గిల్ సేన గురువారం ప్రాక్టీస్ చేయనుంది. శనివారం ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది.దంచికొట్టిన వాన..అయితే గాలేలో వాతావరణం రెండు రోజుల నుంచి చల్లగానే ఉంది. సోమవారం నుంచి మేఘావృతమై ఉన్న గాలేలో మంగళవారం వాన దంచికొట్టింది. రాబోయే రెండు, మూడు రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉండడంతో తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు లేకపోలేదు. ఇక ఈ టెస్టు సిరీస్ రెండు జట్లకు కీలకమే. 2027లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధించాలంటే ఈ సిరీస్‌లో విజయం తప్పనిసరి. ఒక్క మ్యాచ్ రద్దయినా అవకాశాలు సంక్లిష్టం కానున్నాయి. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో భారత్ ఐదో స్థానంలో ఉండగా, శ్రీలంక ఆరో స్థానంలో కొనసాగుతోంది.కోహ్లి కెప్టెన్సీలో ఘన విజయంగాలేలో గతంలో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. 2017లో కోహ్లి కెప్టెన్సీలో గాలే వేదికగా శ్రీలంకతో ఆడిన టెస్టులో ఇన్నింగ్స్ 304 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 600 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ (190), పుజారా (153) సెంచరీలతో చెలరేగారు. లంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి సెంచరీ, అభినవ్ ముకుంద్ 81 పరుగులు చేయడంతో టీమిండియా 241 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో లంక ముంగిట 550 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచగా, భారత బౌలర్ల ధాటికి లంక 245 పరుగులకే కుప్పకూలింది. దీంతో గాలే టెస్టులో టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. జడేజా ఒక్కడే..కాగా అప్పటి జట్టులో సభ్యుడిగా ఉన్న జడేజాకు మాత్రమే గాలేలో ఆడిన అనుభవముంది. పడిక్కల్, గుర్నూర్ బ్రార్, సారాంశ్ జైన్, అకిబ్ నబీలు ఇటీవలే ఇదే గాలే వేదికగా లంక-ఏ జట్టుతో అనధికారిక టెస్టు ఆడిన సంగతి తెలిసిందే. ఇక తొలి టెస్టు శనివారం నుంచి జరగనుండగా, రెండో టెస్టు కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి 27 వరకు జరగనుంది.Colombo 🚌 Galle#TeamIndia have arrived for the #SLvIND Test series opener 🙌 pic.twitter.com/UXoo0gTzCv— BCCI (@BCCI) August 12, 2026Read: బంగ్లాను తేలిగ్గా తీసుకోం.. బలమైన జట్టుతోనే బరిలోకి! -
టెస్టుల్లో ఎవరికీ సాధ్యం కాలేదు.. జైస్వాల్ సరికొత్త ఫీట్
భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్లో ఒక అరుదైన ఫీట్ సాధించాడు. బహుశా జైస్వాల్ సాధించిన ఫీట్ ఎవరికీ సాధ్యం కాలేదనుకుంటా. ఇప్పటివరకు జైస్వాల్ తన కెరీర్లో 29 టెస్టు మ్యాచ్‌లు ఆడితే అవన్నీ వివిధ వేదికల్లోనే ఆడడం విశేషం. మాములుగా ఒక ఆటగాడు వేర్వేరు వేదికల్లోనే మ్యాచ్‌లు ఆడినప్పటికీ, కొన్నిసార్లు ఒకే మైదానంలో మ్యాచ్‌లు ఆడడం చూస్తుంటాం.కానీ జైస్వాల్ విషయంలో మాత్రం లెక్క మారింది. అతడు ఆడిన 29 టెస్టులకు సంబంధించిన వేదికలు మళ్లీ రిపీట్ కాకపోవమే ఇక్కడ గమనించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో జైస్వాల్ ఫీట్ టెస్టు క్రికెట్లో అరుదైన ఘటనగా నిలిచిపోనుంది. ఇక శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లోని తొలి మ్యాచ్ ద్వారా అతను తన 30వ టెస్టు మ్యాచ్‌ను గాలే వేదికగా ఆడబోతున్నాడు. గాలేలో జైస్వాల్‌కు ఇదే తొలి మ్యాచ్ కావడంతో, ఈ 30వ మ్యాచ్ ద్వారా కూడా అతని వేదికల వైవిధ్యం సజీవంగా కొనసాగనుంది. ఇక శ్రీలంక ఎలెవెన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేయడం ద్వారా జైస్వాల్ టచ్‌లోకి వచ్చినట్లు అనిపిస్తోంది. ఇప్పటివరకు జైస్వాల్ 29 టెస్టుల్లో 48.75 సగటుతో మొత్తం 2,535 పరుగులు చేశాడు. ఇందులో 7 శతకాలు, 13 అర్ధ శతకాలు ఉన్నాయి. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 214 పరుగులు కాగా, కెరీర్లో రెండు డబుల్ సెంచరీలు కూడా సాధించాడు.2023లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన జైస్వాల్ అఫ్గానిస్థాన్‌తో చివరి టెస్టు ఆడాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో కూడా అవకాశాలు పొందినప్పటికీ, టెస్టుల్లో మాత్రం భారత జట్టుకు రెగ్యులర్ ఓపెనర్ గా మారాడు. ఇక శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో భాగంగా గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి 19 వరకు తొలి టెస్టు, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా రెండో టెస్ట్ జరగనున్నాయి. మొత్తంగా ప్రపంచ క్రికెట్లో వరుసగా 30 మ్యాచ్‌లు వేర్వేరు స్టేడియాల్లో ఆడిన ఏకైక ఆటగాడిగా జైస్వాల్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు.చదవండి: ‘కెప్టెన్‌గా ఫెయిలైనా ఫిట్‌నెస్‌కు కొత్త అర్ధం చెప్పాడు’ -
లంకతో తొలి టెస్టుకు భారత జట్టు.. తెరపైకి ఊహించని పేరు!
భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. తన జట్టులో సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు కల్పించిన కైఫ్.. ధ్రువ్ జురెల్ కంటే సర్ఫరాజ్ ఎందుకు బెస్ట్ ఆప్షన్ అనేది కూడా స్పష్టంగా వివరించాడు. ధ్రువ్ జురెల్‌తో పోలిస్తే సర్ఫరాజ్ స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఆడగలడని, గాలే పిచ్ పరిస్థితులకు సర్ఫరాజ్ బ్యాటింగ్ శైలి సరిగ్గా నప్పుతుందని పేర్కొన్నాడు. "ట్రెండ్‌ను ఫాలో అవుతూ ప్రస్తుతం ఉన్న జట్టులో జురెల్‌కు అవకాశం కల్పిస్తారేమో. అతడు నిలకడ ప్రదర్శన చేయనప్పటికీ, ఇప్పటికే జురెల్ జట్టులో భాగమని భావిస్తే మాత్రం సర్ఫరాజ్ అవకాశం కోసం వేచి చూడాల్సిందే. కానీ నా దృష్టిలో మాత్రం ఐదు లేదా ఆరో స్థానంలో స్పిన్‌ను సమర్థంగా ఆడగల సత్తా సర్ఫరాజ్ ఖాన్‌కు ఉందని అనుకుంటున్నా. సుదీర్ఘంగా సాగే టెస్టు ఫార్మాట్లో పిచ్ పరిస్థితులు అర్ధమయ్యేకొద్దీ సర్ఫరాజ్ రకరకాల షాట్లు ఆడుతూ తన శైలి బ్యాటింగ్ కొనసాగించగలడు. ముఖ్యంగా ఉపఖండపు పిచ్‌ల్లో టెస్టుల్లో నాలుగు లేదా ఐదో రోజు వచ్చేసరికి స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది. ఈ సమయంలో బ్యాటింగ్ కష్టంగా మారుతుంది. ఇలాంటి సమయంలోనే సర్ఫరాజ్ ఖాన్ జట్టుకు బాగా ఉపయోగపడగలడు. అతనికి స్వీప్‌లు, రివర్స్ స్వీప్‌లు, ఎక్స్ట్రా కవర్స్, బ్యాక్‌ఫుట్ ఇలా ఏ షాటైనా స్పిన్ బౌలింగ్‌లో ఆడగలడు. ఇక జురెల్ ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల శ్రీలంక ఎలెవెన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో జురెల్ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 18 పరుగులు మాత్రమే చేశాడు. దీన్నిబట్టి ఇటీవలి అతడి టెస్టు రికార్డు, ఫామ్ అంత గొప్పగా లేవనిపిస్తోంది" అని చెప్పుకొచ్చాడు.ధ్రువ్ జురెల్ ఇప్పటివరకు 10 టెస్టులాడి 478 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, అర్ధసెంచరీ ఉన్నాయి. మరోవైపు 2024లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఆరు టెస్టుల్లో 371 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ సహా మూడు హాఫ్ సెంచరీలున్నాయి. శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య తొలి టెస్టు గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది.కైఫ్ ప్లేయింగ్ ఎలెవెన్: కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభమన్ గిల్, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్/ సారాంశ్ జైన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ. -
బాడీ షేమింగ్ ట్రోల్స్.. కట్‌చేస్తే టీమిండియాలోకి రీఎంట్రీ!
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో 28 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్‌కు జట్టులో అవకాశం కల్పించింది. అయితే రెండేళ్ల తర్వాత తిరిగి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సర్ఫరాజ్ ఖాన్ తన ఎంపికపై తొలిసారి స్పందించాడు. తన బాడీషేమింగ్‌పై వచ్చిన ట్రోల్స్‌ను చాలెంజ్‌గా తీసుకున్న సర్ఫరాజ్ ఖాన్ సీరియస్ వర్కౌట్స్ చేసి బరువు తగ్గిన కొత్త ఫొటోలను పంచుకున్నాడు. తొలి ఫోటోలో తనను జట్టులోకి ఎంపిక చేసినందుకు కృతజ్ఞతగా షేక్ హ్యాండ్ ఇస్తున్న ఎమోజీతో పాటు లవ్ ఇండియా సింబల్‌ను ట్యాగ్ చేశాడు. ఇక రెండో ఫొటోలో తన తండ్రి నౌషద్ ఖాన్‌తో కలిసి ఉన్న క్లిప్‌ను పంచుకున్నాడు. స్వతహాగా క్రికెట్ కోచ్ అయిన నౌషద్ ఖాన్ భారత్ తరఫున తన కుమారుడి అంతర్జాతీయ అరంగేట్రం కోసం చాలానే కష్టపడ్డాడు. 2024లో తన కుమారుడు తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికైన సందర్భంలో నౌషద్ ఖాన్ హర్షం వ్యక్తం చేసిన ఫొటోలు అప్పట్లో వైరలయ్యాయి. తండ్రి పర్యవేక్షణలో..అంతేకాదు ఫామ్‌లేమి, ఫిట్నెస్ సమస్యలతో జట్టులో చోటు కోల్పోయి ఇబ్బంది పడుతున్న కొడుకుకు అండగా నిలిచి, అతడు బరువు తగ్గడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ క్రమంలో గాయపడ్డ సాయి సుదర్శన్ స్థానంలో జట్టుకు ఎంపిక కావడంతో సర్ఫరాజ్ సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి. కాగా తండ్రితో కలిసి దిగిన ఫొటోకు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. 13 గంటల్లోనే 169 లక్షల వ్యూస్ రావడం విశేషం.2024లో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు అనూహ్యంగా చోటు దక్కించుకున్న సర్ఫరాజ్ ఖాన్ ఆ సిరీస్‌లో 371 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలున్నాయి. సూపర్ ఫామ్‌తో న్యూజీలాండ్‌తో సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు. అయితే తొలి మ్యాచ్‌లో 150 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న సర్ఫరాజ్ ఆ తర్వాత వరుసగా 11, 9, 0, 1.. విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోయాడు.జురెల్, పడిక్కల్‌తో పోటీఇదే సమయంలో ధ్రువ్ జురెల్ ఎంట్రీ ఇవ్వడం, ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ రాణించడంతో సర్ఫరాజ్ ఖాన్ క్రమంగా జట్టుకు దూరమయ్యాడు. అయితే తాజాగా సాయి సుదర్శన్ గాయంతో లంకతో సిరీస్‌కు దూరమవ్వడంతో అతడి స్థానంలో సర్ఫరాజ్ జట్టులోకి వచ్చాడు. ధ్రువ్ జురెల్ ఇప్పటికే జట్టులో ఉండడంతో లంకతో తొలి టెస్టుకు సర్ఫరాజ్‌కు అవకాశం రావడం కష్టమే.2024లో టీమిండియాలో చోటు కోల్పోయిన సర్ఫరాజ్ తొలుత ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. కఠిన శిక్షణతో బరువు తగ్గిన సర్ఫరాజ్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఆ తర్వాత 2025-26 రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో ఒక డబుల్ సెంచరీ సాయంతో 429 పరుగులు సాధించాడు. ఈ ప్రదర్శనతోనే సర్ఫరాజ్.. ఆరో స్థానం కోసం ధ్రువ్ జురెల్, దేవదత్ పడిక్కల్‌తో పోటీ పడుతున్నాడు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా పడిక్కల్ తొలి టెస్టులో ఆడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక లంకతో తొలి టెస్టు గాలే వేదికగా ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది.Sarfaraz Khan in India kit with his Father. Deserved comeback 🤝. pic.twitter.com/asooA1XJxY— CricketGully (@thecricketgully) August 10, 2026SARFARAZ KHAN ON THE WAY TO SRI LANKA 🔥 [Sahil Malhotra] - All the best, Sarfaraz Khan. pic.twitter.com/dBp2cQ2RC7— Johns. (@CricCrazyJohns) August 9, 2026 Sarfaraz Khan’s special words for his son after being picked once again for the Indian Test team.🇮🇳❤️ pic.twitter.com/VogFjGFOZ4— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 10, 2026Read: భయపెడుతున్న గాయాలు.. గిల్ ఫిట్‌నెస్‌పై కీలక అప్డేట్! -
భారత్‌తో మ్యాచ్.. శ్రీలంక జట్టు ప్రకటన! కెప్టెన్ ఎవరంటే?
భారత్-శ్రీలంక మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియా ఆగస్టు 7 నుంచి కొలంబో వేదికగా శ్రీలంక-ఎతో మూడు రోజుల వార్మాప్ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ క్రమంలో వార్మప్ మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా సోనాల్ దినుషాను నియమించారు.ఈ జట్టులో రమేష్ మెండిస్, లహిరు కుమార వంటి సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. అదేవిధంగా దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న నిషాన్ మదుష్క, పసిందు సూరియబండార వంటి యువ ఆటగాళ్లను లంక సెలక్టర్లు 'ఎ' జట్టుకు ఎంపిక చేశారు.కాగా శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే శ్రీలంక గడ్డపై అడుగు పెట్టింది. అయితే ఈ టూర్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. అతడి స్దానంలో జమ్మూ కాశ్మీర్ స్పీడ్ స్టార్ ఆకిబ్ నబీకి సెలక్టర్లు అవకాశమిచ్చారు.భారత్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ కోసం లంక-ఎ జట్టునిషాన్ మదుష్క, రవిందు రశాంత, పసిందు సూరియబండార, పవన్ రత్నాయకే, అహన్ విక్రమసింఘే, సోనాల్ దినుషా(కెప్టెన్), అంజల బండార(వికెట్ కీపర్), నిపున్ దనంజయ, లహిరు కుమార, విశ్వ ఫెర్నాండో, అసంక మనోజ్, ఇసిత విజేసుందర, దిలుమ్ రమేష్ మెండిస్చదవండి: DPL 2026: పప్పూ యాదవ్ తనయుడి విధ్వంసం.. 7 ఫోర్లు, 8 సిక్స్‌లతో -
భారత్‌తో టీ20 సిరీస్.. శ్రీలంక హెడ్ కోచ్‌గా సనత్ జయసూర్య
శ్రీలంక పురుషుల క్రికెట్ జట్టు తాత్కాలిక హెడ్ కోచ్‌గా ఆ దేశ మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ (SLC) సోమవారం ప్రకటించింది. కాగా టీ20 వరల్డ్‌కప్-2024లో శ్రీలంక దారుణ ఆటతీరుతో గ్రూపు స్టేజిలోనే నిష్కమ్రించింది. దీంతో అప్పటివరకు లంక హెడ్‌కోచ్‌గా పని చేసిన క్రిస్ సిల్వర్‌వుడ్ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలో కొత్త హెడ్‌కోచ్‌ను భర్తీ చేసే పనిలో శ్రీలంక క్రికెట్ బోర్డు పడింది. అయితే కొత్త కోచ్ వచ్చే అంతవరకు లంక తాత్కాలిక హెడ్‌కోచ్‌గా జయసూర్య పనిచేయనున్నాడు. కాగా జయసూర్య ఇటీవల ముగిసిన పొట్టి ప్రపంచకప్‌లో శ్రీలంక కన్సల్టెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. డిసెంబర్ 2023 నుండి శ్రీలంక క్రికెట్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నా డు. ఇప్పుడు ప్రమోషన్ పొంది హెడ్‌కోచ్‌గా సేవలు అందించున్నాడు ఈ లెజండరీ క్రికెటర్. స్వదేశంలో ఈ నెల 27 నంచి భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో లంక తాత్కాలిక హెడ్‌కోచ్‌గా సనత్ జయసూర్య ప్రయాణం మొదలు కానుంది. లంక పర్యటనలో భాగంగా భారత్ మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లలో ఆతిథ్య జట్టుతో తలపడనుంది. కాగా ఈ పర్యటనతోనే భారత జట్టుకు కూడా కొత్త హెడ్‌కోచ్ వచ్చే ఛాన్స్ ఉంది.చదవండి: #Abhishek Sharma: చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. తొలి భారత క్రికెటర్‌గా -
Ind Vs Sl 2nd Test: క్లీన్‌స్వీప్ చేసే సమయం ఆసన్నమైంది...
భారత్ టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసే సమయం ఆసన్నమైంది...తొలిరోజు బౌలింగ్‌లో కొంతైనా ప్రతాపం చూపిన శ్రీలంక రెండో రోజు ఇటు బ్యాటింగ్‌లో అటు బౌలింగ్‌లో పూర్తిగా కుదేలైంది. వంద పరుగులు దాటిన కాసేపటికే తొలి ఇన్నింగ్స్‌ను ముగించుకున్న లంక తర్వాత రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్‌ను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయింది. దీంతో కొండంత లక్ష్యం ముందు లంక ఓడేందుకు చేరువవుతోంది. పంత్ మెరుపు బ్యాటింగ్, అయ్యర్ మరో చక్కటి ఇన్నింగ్స్ రెండో రోజు హైలైట్‌గా నిలిచాయి. బెంగళూరు: రెండో టెస్టులో విజయానికి అవసరమైన ఏర్పాట్లన్నీ భారత్ రెండో రోజే చేసేసింది. ప్రత్యర్థి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ను తక్కువ స్కోరుకే ముగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యానికి తోడు రెండో ఇన్నింగ్స్‌లో పటిష్టమైన స్కోరుతో భారీ లక్ష్యాన్ని నిర్మించింది. ఆదివారం హాయిగా స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులకు రిషభ్‌పంత్ (31 బంతుల్లో 50; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) పసందైన బ్యాటింగ్ విందు ఇచ్చాడు. రెండో రోజుకు సరిపడే వినోదం అతనిదైతే... మొత్తం మ్యాచ్‌లో భారత్‌ను శ్రేయస్ అయ్యర్ (87 బం తుల్లో 67; 9 ఫోర్లు) పటిష్ట స్థితిలో నిలిపాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 303/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసి శ్రీలంక ముందు 447 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. బుమ్రా వేసిన మూడో బంతికే తిరిమన్నె (0) అవుట్ కాగా, కరుణరత్నే (10 బ్యాటింగ్), కుశాల్ మెండిస్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. శ్రీలంక 109 ఆలౌట్ రెండో రోజు లంకను ఆలౌట్ చేసేందుకు భారత్‌కు ఎక్కువ సేపు పట్టలేదు. ఆదివారం మరో ఆరు ఓవర్లయినా పూర్తిగా ఆడలేకపోయిన ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 35.5 ఓవర్లలో 109 పరుగులకే ఆలౌ టైంది. ఓవర్‌నైట్ స్కోరుకు మరో 23 పరుగులు మాత్రమే జోడించి జట్టు మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. బుమ్రా కెరీర్లో 8వ సారి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగుల ఆధిక్యం లభించింది. అయ్యర్ మళ్లీ సూపర్ రెండో ఇన్నింగ్స్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ (79 బంతుల్లో 46; 4 ఫోర్లు), మయాంక్ అగర్వాల్ (22; 5 ఫోర్లు) నిలకడగా ఆడారు. వీళ్లిద్దరి తర్వాత హనుమ విహారి (35; 4 ఫోర్లు) కాస్త మెరుగనిపించగా, కోహ్లి (13) విఫలమయ్యాడు. మరో వైపు శ్రేయస్ అయ్యర్ మళ్లీ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఐదో వికెట్‌కు పంత్, అయ్యర్ 6.2 ఓవర్లలోనే 45 పరుగులు జోడించారు. జడేజాతో కలిసి శ్రేయస్ కుదురుగా బ్యాటింగ్ చేశాడు. డిన్నర్ బ్రేక్ పూర్తయిన వెంటనే జట్టు స్కోరు 200 పరుగులు దాటింది. ఆరో వికెట్‌కు వీళ్లిద్దరు 63 పరుగులు జత చేశాక జడేజా (22) అవుటయ్యాడు. ఆ తర్వాత 69 బంతుల్లో అయ్యర్ అర్ధ సెంచరీ పూర్తయింది. వరుసగా రెండు రోజుల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతను ఫిఫ్టీలతో అదరగొట్టాడు. స్కోరు 300 దాటి 9వ వికెట్ పడగానే భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్ 252; శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 109; భారత్ రెండో ఇన్నింగ్స్: మయాంక్ (సి) ధనంజయ (బి) ఎంబుల్డెనియా 22; రోహిత్ (సి) మాథ్యూస్ (బి) ధనంజయ 46; విహారి (బి) జయవిక్రమ 35; కోహ్లి (ఎల్బీ) (బి) జయవిక్రమ 13; పంత్ (సి) అండ్ (బి) జయవిక్రమ 50; అయ్యర్ (ఎల్బీ) (బి) ఎంబుల్డెనియా 67; జడేజా (బి) ఫెర్నాండో 22; అశ్విన్ (సి) డిక్వెలా (బి) జయవిక్రమ 13; అక్షర్ (బి) ఎంబుల్డెనియా 9; షమీ నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (68.5 ఓవర్లలో) 303/9 డిక్లేర్డ్. వికెట్ల పతనం: 1–42, 2–98, 3–116, 4–139, 5–184, 6–247, 7–278, 8–278, 9–303. బౌలింగ్: లక్మల్ 10–2–34–0; ఎంబుల్డెనియా 20.5–1–87–3, ఫెర్నాండో 10–2–48–1, ధనంజయ 9–0–47–1, జయవిక్రమ 19–2–78–4. -
Ind Vs Sl 2nd Test: విహారికి ఛాన్స్.. మరి సిరాజ్?
India Vs Sri Lanka 2nd Test- బెంగళూరు: మూడు రోజుల్లోపే తొలి టెస్టులో శ్రీలంక ఆట ముగించిన భారత్ ఇప్పుడు అదే ప్రదర్శనను పునరావృతం చేసేందుకు సిద్ధమైంది. నేటి నుంచి చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. తాజా ఫామ్, బలాబలాల దృష్ట్యా ప్రత్యర్థికంటే ఎంతో పటిష్టంగా ఉన్న టీమిండియాకు ఇక్కడా అడ్డు ఉండకపోవచ్చు. తొలి పోరులో ఘోర వైఫల్యం తర్వాత రెండో టెస్టులో లంక ఏమాత్రం పోటీనిస్తుందనేది చూడాలి. ఫ్లడ్ లైట్ల వెలుగులో ‘డే అండ్ నైట్’గా గులాబీ బంతితో జరగనున్న ఈ మ్యాచ్‌కు మైదానంలో ప్రేక్షకులను 100 శాతం అనుమతిస్తుండటం చెప్పుకోదగ్గ విశేషం. సిరాజ్‌కు అవకాశం ఇస్తారా! మొహాలీలో భారత జట్టు ప్రదర్శన చూసిన తర్వాత సహజంగానే తుది జట్టులో మార్పులకు అవకాశం కనిపించదు. రోహిత్‌తో పాటు సొంతగడ్డపై మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. మూడో స్థానంలో హనుమ విహారికి మళ్లీ అవకాశం ఖాయం కాగా... కోహ్లి ఈ మ్యాచ్‌లోనైనా సెంచరీ సాధించి సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతాడా చూడాలి. శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, రవీంద్ర జడేజాలతో మిడిలార్డర్ పటిష్టంగా ఉండగా ఆ తర్వాత అశ్విన్ కూడా సత్తా చాటగలడు. బుమ్రా, షమీ ఖాయం కాగా... మూడో స్పిన్నర్‌గా జయంత్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్‌ను ఆడించడంపై టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది. అయితే ‘పింక్ బంతి’ బాగా స్వింగ్ అయ్యే అవకాశం ఉండటంతో దాదాపు సొంత మైదానంలాంటి చిన్నస్వామిలో మూడో పేసర్‌గా హైదరాబాద్ బౌలర్ సిరాజ్‌కు చాన్స్ లభిస్తుందేమో చూడాలి. తుది జట్టులో ఎవరు? మొదట టి20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయి తొలి టెస్టులోనూ ఓడిన శ్రీలంక ఇప్పుడు రెండో మ్యాచ్ కోసం తుది జట్టును సిద్ధం చేసుకోవడమే కష్టంగా మారింది. గత మ్యాచ్‌లో ఆడిన కుమార, నిసాంకా గాయాలతో దూరం కాగా, ఆడే అవకాశం ఉన్న చమీరా కూడా గాయపడ్డాడు. కుశాల్ మెండిస్ కోలుకోవడం ఆ జట్టుకు ఊరట. అసలంక స్థానంలో చండిమాల్‌కు అవకాశం దక్కవచ్చు. మరోసారి టీమ్ బ్యాటింగ్ సీనియర్లు కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్లపైనే ఆధారపడి ఉంది. ఎంబుల్డెనియాతో పాటు కొత్తగా వస్తున్న చమిక కరుణరత్నే భారత్‌ను ఏమాత్రం కట్టడి చేయగలరో చూడాలి. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్న సురంగ లక్మల్ ఆటపై అందరి దృష్టీ ఉంది. 4:భారత్‌కు ఇది నాలుగో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్... స్వదేశంలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లపై గెలిచిన భారత్ ఆస్ట్రేలియా గడ్డపై ఓడింది. 400: మూడు ఫార్మాట్లలో కలిపి రోహిత్‌కిది 400వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. #TeamIndia vice-captain @Jaspritbumrah93 on the mental changes that need to be made for a Pink Ball Test.@Paytm #INDvSL pic.twitter.com/PCfrY6sJe7 — BCCI (@BCCI) March 11, 2022 -
సందిగ్ధంలో టీమిండియా- లంక వన్డే సిరీస్!
కొలంబొ: భారత్, శ్రీలంకల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ సందిగ్ధంలో పడింది. తాజాగా శ్రీలంక జట్టు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటీవలే ఇంగ్లండ్ పర్యటనను ముగించుకొన్న లంక ఆటగాళ్లు మంగళవారం సాయంత్రం శ్రీలంకకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రాంట్ ఫ్లవర్‌కు కోవిడ్ పాజిటివ్ అని తేలడం, అతనితో పాటు ఆటగాళ్లంతా ఒకే విమానంలో రావడంతో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం గ్రాంట్ ఫ్లవర్‌ను ఐసోలేషన్‌కు పంపగా.. మిగిలిన జట్టు సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఎవరికి పాజిటివ్‌గా తేలలేదు. దీంతో ఆటగాళ్లందరిని క్వారంటైన్‌కు తరలించారు. కాగా జూలై 13 నుంచి టీమిండియా, శ్రీలంక మధ్య సిరీస్ ప్రారంభం కావాల్సి ఉంది. కాగా సిరీస్ ప్రారంభానికి ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉండడంతో సిరీస్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే శిఖర్ ధావన్ సారధ్యంలోని టీమిండియా శ్రీలంక చేరుకొని ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నారు. -
'బాగా ఆడినా ఎంపిక చేయలేదు.. నా గుండె పగిలింది'
ముంబై: జూలైలో శ్రీలంక పర్యటన సందర్భంగా గురువారం బీసీసీఐ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత సీనియర్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడంతో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారధ్యంలో టీమిండియా రెండో జట్టు లంకతో సిరీస్ ఆడనుంది. ఐపీఎల్, ఇతర దేశవాలీ టోర్నీలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా జట్టులో చోటు కల్పించారు. రుతురాజ్, దేవదత్ పడిక్కల్, చేతన్ సకారియా వంటి యువ ఆటగాళ్లు ఎంపికయ్యారు. ఇటీవలే రంజీ ట్రోపీలో దుమ్మురేపిన సౌరాష్ట్ర ఆటగాడు షెల్డన్ జాక్సన్ లంకతో పర్యటనకు కచ్చితంగా ఎంపికవుతానని భావించాడు. కానీ అతని ఆశలు తలకిందులయ్యాయి. ఈ సందర్భంగా తాను ఎంపికకాకపోవడంపై స్పందించిన షెల్డన్ జాక్సన్.. '' ఎంత బాగా ఆడినా ఎంపిక చేయలేదు.. నా గుండె పగిలింది'' అంటూ ఎమోజీ షేర్ చేశాడు. ''ఇప్పుడు నా వయసు 34 ఏళ్లు.. కానీ బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాను. ఒక 22-23 ఏళ్ల కుర్రాడిలో దూకుడైన ఆటతీరు ఎలా ఉంటుందో అలా సాగుతుంది నా ఆటతీరు. ఆటకు వయసు అడ్డుగా కనిపిస్తే నేను ఏం చేయలేను.. లేటు వయసులో జాతీయ జట్టులోకి ఎంట్రీ లేదని క్రికెట్ పుస్తకాల్లో ఎక్కడా లేదు. ఒక ఆటగాడిని ఎంపిక చేయలాంటే అతని ఆటతీరు చూడాలని నేను నమ్ముతా. వరుసగా మూడు సీజన్ల పాటు రంజీ ట్రోపీలో 800-900 పరుగులు చేశానంటే ఫిట్‌గా ఉండడమే కదా అర్థం. అతని వయస్సు 30 కంటే ఎక్కువ.. అందుకే సెలక్ట్ కాలేదు..ఈ పదం నేను చాలాసార్లు విన్నా'' అంటూ ఆవేదన చెందాడు. ఇక షెల్డన్ జాక్సన్ రంజీ ట్రోపీలో వరుసగా మూడుసార్లు 700కు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు 76 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 5634 పరుగులు, 60 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 2096 పరుగులు, 59 దేశవాలీ టీ20ల్లో 1240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు.. 44 అర్థసెంచరీలు ఉన్నాయి. కాగా శ్రీలంక పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న టీమిండియా జూలై 13న తొలి వన్డే ఆడనుంది. చదవండి: కెప్టెన్‌గా గబ్బర్.. వైస్‌కెప్టెన్‌గా భువీ దంచికొట్టిన రషీద్ ఖాన్.. ఆఖరి బంతికి విజయం 💔 — Sheldon Jackson (@ShelJackson27) June 10, 2021 -
జడేజా స్థానంలో యువ స్పిన్నర్‌కు పిలుపు!
కొలంబో: ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్సర్ పటేల్ భారత క్రికెట్ జట్టులో చోటు సంపాదించాడు. శ్రీలంకతో జరగనున్న మూడు టెస్టులో అతను ఆడనున్నాడు. శనివారం నుంచి భారత్-శ్రీలంక మధ్య మూడో టెస్టు పల్లెకేలేలో జరగనుంది. కొలంబోలో జరిగిన రెండో టెస్టులో ఐసీసీ ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించినందుకు రవీంద్ర జడేజాపై ఒక టెస్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో జట్టుకు దూరమైన అతని స్థానంలో అక్సర్ పటేల్‌ను జట్టులోకి తీసుకోవాలని ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ మంగళవారం నిర్ణయం తీసుకుందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 12 నుంచి జరగనున్న మూడో టెస్టు కోసం జట్టు ఇలా ఉండనుంది. విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్, ఛటేశ్వర్ పుజారా, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, ఆర్. అశ్విన్, అక్సర్ పటేల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, హర్థిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమి, కుల్దీప్ యాదవ్, అభినవ్ ముకుంద్. -
ఇదే నా బెస్ట్ ఇన్సింగ్స్: భారత బ్యాట్స్‌మన్
కొలంబో: శ్రీలంక బౌలర్లను దీటుగా ఎదుర్కోవడంపైనే ఎక్కువ ఫోకస్ పెట్టానని టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే తెలిపాడు. శ్రీలంకతో రెండో టెస్టులో 132 పరుగుల మాస్టర్ ఇన్నింగ్స్ నేపథ్యంలో అతను విలేకరులతో మాట్లాడాడు. రెండో టెస్టులో అత్యంత ఓపిగ్గా ఆడిన రహానే 222 బంతుల్లో 14 బౌండరీలతో 132 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఛటేశ్వర పూజారా (133)తో కలిసి 217 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని రహానే నెలకొల్పడంతో టీమిండియా మొదటి ఇన్నింగ్స్ 622/9 భారీ స్కోరు నమోదుచేసిన సంగతి తెలిసిందే. 'స్పిన్నర్లపై నా బెస్ట్ ఇన్నింగ్స్‌లలో ఇదొకటి. బౌలర్లను డామినేట్ చేయడంపైనే నేను ఫోకస్ చేశాను. బ్యాటింగ్‌కు వెళ్లేముందే వికెట్ ఎలా ప్రవర్తిస్తుందో నేను గ్రహించాను. ఎంతో బౌన్స్ ఉంది.. నా గేమ్‌కు పిచ్ సూట్ అవుతుందా? లేదా? అన్నది అంచనా వేశాను. నాకు-పూజారాకు మధ్య కమ్యూనికేషన్ బాగా కుదిరింది. దాదాపు ఒక్క ఓవర్ కూడా మెయిడెన్ కాకుండా చూశాం. కాబట్టి బౌలర్లపై ఒత్తిడి పెంచగలిగాం. మ్యాచ్ ముందుకుసాగుతున్నకొద్దీ ఈ వికెట్‌పై పరుగులు రాబట్టడం కష్టమవుతుంది' అని రహానే తెలిపారు. శ్రీలంక బౌలర్ హెరాత్, ఇతర స్పిన్స్ బౌలర్లను ఎదుర్కోవడం ఫుట్‌వర్క్ చాలా ముఖ్యమని, ఫుట్‌వర్క్ ఆధారంగానే ఎక్కువ పరుగులు రాబట్టే ప్రయత్నం చేశామని చెప్పాడు. పూజారాతో కలిసి రెండువందల పరుగులకుపైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పడం టీమ్ వ్యూహంలో భాగమేనని, దానిని తాము అమలుచేశామని రహానే చెప్పాడు.


