ముగిసిన రెండో రోజు ఆట‌.. భార‌త స్కోరెంతంటే? | Sri Lanka Vs India 1st Test Match Day 2 Live Updates And Highlights In Telugu, Rain Threatens To Delay Play In Galle | Sakshi
Sakshi News home page

SL Vs IND 1st Test: ముగిసిన రెండో రోజు ఆట‌.. భార‌త స్కోరెంతంటే?

Aug 16 2026 10:10 AM | Updated on Aug 16 2026 6:10 PM

Sri Lanka Vs India 1st Test Match Day-2 Live Updates-Highlights

Sri Lanka Vs India 1st Test Day-2 Live Updates: గాలే వేదికగా భారత్‌-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌ రెండో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 116 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 460 పరుగుల చేసింది. క్రీజులో ప్రసిద్ద్‌ కృష్ణ(1), కుల్దీప్‌ యాదవ్‌(12) ఉన్నారు. 

వర్షం కారణంగా రెండో రోజు కేవలం 47 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. భారత బ్యాటర్లలో దేవ్‌దత్త్‌ పడిక్కల్‌(167) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కేఎల్‌ రాహుల్‌(82), ధ్రువ్‌ జురెల్‌(51) హాఫ్‌ సెంచరీలతో సత్తాచాటారు.

వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయిన టీమిండియా
టీమిండియా వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. 447 పరుగుల వద్ద తొలుత సిరాజ్‌ (11) ఆతర్వాత సుతార్‌ (24) ఔటయ్యారు. ప్రస్తుతం భారత్‌ 9 వికెట్లు కోల్పోయింది.

ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్‌
432 పరుగుల వద్ద భారత్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. ప్రభాత్‌ జయసూర్య బౌలింగ్‌లో ధనంజయకు క్యాచ్‌ ఇచ్చి ధృవ్‌ జురెల్‌ (51) ఔటయ్యాడు. మానవ్‌ సుతార్‌ (21)కు జతగా సిరాజ్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. 

టీమిండియా ఆరో వికెట్‌ డౌన్‌
టీమిండియా ఆరో వికెట్‌ కోల్పోయింది. 13 పరుగులు చేసిన రవీంద్ర జడేజా.. కేశర నువంత బౌలింగ్‌లో ఔటయ్యాడు. 101 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 6 వికెట్ల నష్టానికి 388 పరుగులు చేసింది.

టీ బ్రేక్‌కు భారత్‌ స్కోరెంతంటే?
రెండో రోజు ఆటలో టీ బ్రేక్‌ సమయానికి భారత్‌ 5 వి​కెట్ల నష్టానికి 364 పరుగుల స్కోర్‌ సాధించింది. క్రీజులో రవీంద్ర జడేజా(4), ధ్రువ్‌ జురెల్‌(19) ఉన్నారు.

పడిక్కల్‌ అవుట్‌
పడిక్కల్‌ రూపంలో భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 167 పరుగులు చేసిన పడిక్కల్‌.. ప్రభాత్‌ జైసూర్య బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. 93 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 361/5. క్రీజులో జురెల్‌(19), జడేజా(1) ఉన్నారు

భారత్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
భారత్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 82 పరుగులు చేసిన రాహుల్‌.. నువాంత బౌలింగ్‌లో ఔటయ్యాడు. 87 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 335/4

భారత్‌ మూడో వికెట్‌ డౌన్‌
భారత్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 39 పరుగులు చేసిన పంత్‌.. కేశర నువాంత బౌలింగ్‌లో ఔటయ్యాడు. తొలి రోజు ఆటలో గాయపడిన కేఎల్‌ రాహుల్‌ తిరిగి బ్యాటింగ్‌కు వచ్చాడు. 81 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. 

ఆట తిరిగి ప్రారంభం
ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. దీంతో రెండో రోజు ఆట తిరిగి ప్రారంభమైంది. 75 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 296/2. క్రీజులో పడిక్కల్‌(133), రిషబ్‌ పంత్‌(32) ఉన్నారు.

మళ్లీ మొదలైన వర్షం
మధ్యాహ్నం 2:11 గంటలు- రెండు గంటల విరామం తర్వాత వర్ష​ం మళ్లీ మొదలైంది. ఆట దాదాపుగా ప్రారంభం కావాల్సిన సమయంలో వరుణుడు మరోసారి పలకరించాడు. 

దంచుతున్న వాన
లంచ్‌ విరామం అనంతరం కాసేపు ఎండ పలకరించినప్పటికీ, వరుణుడు మరోసారి విజృంభించాడు. దీంతో స్టేడియంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రెండో రోజు ఆట ప్రారంభమవుతుందా? లేదా అన్నది ఆసక్తిగా మారిపోయింది.

శాంతించిన వరుణుడు..
గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట మొదటి సెషన్‌ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. అయితే లంచ్‌ విరామ సమయానికి వర్షం ఆగిపోయింది. దీంతో లంచ్‌ బ్రేక్‌ అనంతరం మ్యాచ్‌ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. పిచ్‌పై కవర్లను తొలగించిన సిబ్బంది గ్రౌండ్‌ను సాపింగ్‌ చేశారు.

👉గాలే వేదిక‌గా శ్రీలంక‌, భార‌త్ మ‌ధ్య‌ మొద‌లైన తొలి టెస్టు రెండో రోజు ఆట‌కు వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించాడు. దీంతో మ్యాచ్ ఆల‌స్యంగా ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశ‌ముంది. ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో పిచ్‌పై కవర్లను కప్పి ఉంచారు. 

👉రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. శనివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 73 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ (178 బంతుల్లో 131 బ్యాటింగ్‌; 12 ఫోర్లు, 1 సిక్స్‌) కెరీర్‌లో తొలి సెంచరీతో అదరగొట్టాడు. పంత్‌ (36 బంతుల్లో 27 బ్యాటింగ్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) క్రీజులో ఉన్నాడు.

👉 అంతకముందు సీనియర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ (162 బంతుల్లో 77; 9 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా హాఫ్‌ సెంచరీతో మెరవడంతో టీమిండియా ఇన్నింగ్స్‌ సాఫీగా సాగింది. అర్ధశతకం అనంతరం రాహుల్‌ గాయంతో మైదానాన్ని వీడగా... పడిక్కల్‌తో కలిసి  యశస్వి జైస్వాల్‌ (37 బంతుల్లో 32; 5 ఫోర్లు) రనౌట్‌గా వెనుదిరగగా... కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (16) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్‌ జయసూర్య ఏకైక వికెట్‌ పడగొట్టాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement