Photo Credit: BCCI Twitter
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు ద్వారా టీమిండియా తరఫున సారాంశ్ జైన్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. కాగా 21వ శతాబ్దంలో టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతిపెద్ద వయస్కుడిగా సారాంశ్ జైన్ నిలిచాడు. సారాంశ్ ప్రస్తుత వయస్సు 33 ఏళ్ల 145 రోజులు.
ఈ నేపథ్యంలో 2000 సంవత్సరంలో ఢాకాలో బంగ్లాదేశ్‌పై 32 ఏళ్ల 362 రోజుల వయస్సులో అరంగేట్రం చేసిన సబా కరీం రికార్డును సారాంశ్ అధిగమించాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడ ఆటతీరును ప్రదర్శిస్తున్న సారాంశ్ జైన్‌కు ఎట్టకేలకు టీమిండియాకు ఆడే అవకాశం లభించింది. ఇన్ఫెక్షన్ కారణంగా టెస్టుకు దూరమైనట్లు పేర్కొన్నప్పటికీ, తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్ పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే అతడి స్థానంలో సారాంశ్ జైన్‌ను తుదిజట్టులోకి తీసుకున్నారు. జడేజా చేతుల మీదుగా సారాంశ్ జైన్ టెస్టు క్యాప్ అందుకున్నాడు.
ఐపీఎల్ ఆడకుండానే డెబ్యూ
సారాంశ్ జైన్ మరో రికార్డు కూడా అందుకున్నాడు. ఐపీఎల్‌లో ఆడకుండానే జాతీయ జట్టుకు ఎంపికైన మూడో ఆటగాడిగా సారాంశ్ నిలిచాడు. గతంలో మురళీ విజయ్ (2008 నాగ్‌పూర్ టెస్టు వర్సెస్ ఆస్ట్రేలియా), మొహమ్మద్ షమీ (2013 ఢిల్లీ వన్డే వర్సెస్ పాకిస్తాన్) ఈ ఫీట్ సాధించారు.

Photo Credit: BCCI Twitter
ఎవరీ సారాంశ్ జైన్?
తన ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో ముప్పతిప్పలు పెట్టగల సారాంశ్ జైన్ బ్యాటింగ్ చేయడంలోనూ సమర్ధుడు. దేశవాళీ క్రికెట్‌లో అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్.. రెండు విభాగాల్లోను తాను ఆడిన జట్లకు విలువైన సహకారం అందిస్తూ వచ్చాడు. అయితే గాయం కారణంగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.
దీంతో బీసీసీఐ సెలెక్లర్ట బృందం సుందర్ స్థానంలో సారాంశ్ జైన్‌ను టెస్టు జట్టుకు ఎంపిక చేసింది. లంకతో టెస్టు సిరీస్‌కు ముందే లంక-ఏ జట్టుతో ఆడిన తొలి అనధికారిక టెస్టులోనే సారాంశ్ జైన్ తన ప్రతిభను చాటాడు. రెండో టెస్టులో ఆరు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో అజేయంగా 70 పరుగులు సాధించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

Photo Credit: BCCI Twitter
ఇక 2025-26 రంజీ సీజన్‌లో మధ్యప్రదేశ్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లలో సారాంశ్ జైన్ ఒకడు. ఆ సీజన్‌లో మధ్యప్రదేశ్ తరఫున ఏడు మ్యాచ్‌లాడిన సారాంశ్ 57.55 సగటుతో 518 పరుగులు చేశాడు, ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ సారాంశ్ 20.43 సగటుతో 30 వికెట్లు పడగొట్టి ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేశాడు.
A new chapter begins. 🧢
Saransh Jain receives his maiden Test cap from Ravindra Jadeja in the #TeamIndia huddle ✨
Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/sXTILXMIOg— Sony Sports Network (@SonySportsNetwk) August 23, 2026
The feeling of making your Test Debut ✨#TeamIndia all-rounder Ravindra Jadeja presents the Test cap to Saransh Jain 👏👏
Updates ▶️ https://t.co/r9FgXSdsMf#SLvIND pic.twitter.com/6H6KrUdSkU— BCCI (@BCCI) August 23, 2026


