breaking news
debutant
-
అరంగేట్రంతోనే అరుదైన రికార్డు.. ఎవరీ సారాంశ్?
శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు ద్వారా టీమిండియా తరఫున సారాంశ్ జైన్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. కాగా 21వ శతాబ్దంలో టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన అతిపెద్ద వయస్కుడిగా సారాంశ్ జైన్ నిలిచాడు. సారాంశ్ ప్రస్తుత వయస్సు 33 ఏళ్ల 145 రోజులు. ఈ నేపథ్యంలో 2000 సంవత్సరంలో ఢాకాలో బంగ్లాదేశ్‌పై 32 ఏళ్ల 362 రోజుల వయస్సులో అరంగేట్రం చేసిన సబా కరీం రికార్డును సారాంశ్ అధిగమించాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడ ఆటతీరును ప్రదర్శిస్తున్న సారాంశ్ జైన్‌కు ఎట్టకేలకు టీమిండియాకు ఆడే అవకాశం లభించింది. ఇన్ఫెక్షన్ కారణంగా టెస్టుకు దూరమైనట్లు పేర్కొన్నప్పటికీ, తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్ పెద్దగా ఆకట్టుకోలేదు. అందుకే అతడి స్థానంలో సారాంశ్ జైన్‌ను తుదిజట్టులోకి తీసుకున్నారు. జడేజా చేతుల మీదుగా సారాంశ్ జైన్ టెస్టు క్యాప్ అందుకున్నాడు. ఐపీఎల్ ఆడకుండానే డెబ్యూసారాంశ్ జైన్ మరో రికార్డు కూడా అందుకున్నాడు. ఐపీఎల్లో ఆడకుండానే జాతీయ జట్టుకు ఎంపికైన మూడో ఆటగాడిగా సారాంశ్ నిలిచాడు. గతంలో మురళీ విజయ్ (2008 నాగ్‌పూర్ టెస్టు వర్సెస్ ఆస్ట్రేలియా), మొహమ్మద్ షమీ (2013 ఢిల్లీ వన్డే వర్సెస్ పాకిస్తాన్) ఈ ఫీట్ సాధించారు.Photo Credit: BCCI Twitterఎవరీ సారాంశ్ జైన్?తన ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో ముప్పతిప్పలు పెట్టగల సారాంశ్ జైన్ బ్యాటింగ్ చేయడంలోనూ సమర్ధుడు. దేశవాళీ క్రికెట్లో అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్.. రెండు విభాగాల్లోను తాను ఆడిన జట్లకు విలువైన సహకారం అందిస్తూ వచ్చాడు. అయితే గాయం కారణంగా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో బీసీసీఐ సెలెక్లర్ట బృందం సుందర్ స్థానంలో సారాంశ్ జైన్‌ను టెస్టు జట్టుకు ఎంపిక చేసింది. లంకతో టెస్టు సిరీస్‌కు ముందే లంక-ఏ జట్టుతో ఆడిన తొలి అనధికారిక టెస్టులోనే సారాంశ్ జైన్ తన ప్రతిభను చాటాడు. రెండో టెస్టులో ఆరు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో అజేయంగా 70 పరుగులు సాధించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. Photo Credit: BCCI Twitterఇక 2025-26 రంజీ సీజన్లో మధ్యప్రదేశ్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లలో సారాంశ్ జైన్ ఒకడు. ఆ సీజన్లో మధ్యప్రదేశ్ తరఫున ఏడు మ్యాచ్‌లాడిన సారాంశ్ 57.55 సగటుతో 518 పరుగులు చేశాడు, ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లోనూ సారాంశ్ 20.43 సగటుతో 30 వికెట్లు పడగొట్టి ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేశాడు.A new chapter begins. 🧢 Saransh Jain receives his maiden Test cap from Ravindra Jadeja in the #TeamIndia huddle ✨ Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/sXTILXMIOg— Sony Sports Network (@SonySportsNetwk) August 23, 2026 The feeling of making your Test Debut ✨#TeamIndia all-rounder Ravindra Jadeja presents the Test cap to Saransh Jain 👏👏Updates ▶️ https://t.co/r9FgXSdsMf#SLvIND pic.twitter.com/6H6KrUdSkU— BCCI (@BCCI) August 23, 2026చదవండి: టాస్ గెలిచిన టీమిండియా.. సారాంశ్ జైన్ అరంగేట్రం -
PAK Vs SA: రిటైరయ్యే వయసులో అరంగేట్రం.. పాక్ ప్లేయర్ అరుదైన ఘనత
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్లో 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయసులో రిటైరవుతుంటారు. అలాంటిది ఈ మధ్య వయసులో అరంగేట్రం చేయడమంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తాజాగా ఓ పాక్ ఆటగాడు 38 ఏళ్ల 299 రోజుల వయసులో టెస్ట్ అరంగేట్రం చేసి ఔరా అనిపించాడు. ఇది చూసి అభిమానులు రిటైరయ్యే వయసులో అరంగేట్రం ఏంటని అనుకుంటున్నారు.వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌లోని పెషావర్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ ఆసిఫ్ అఫ్రిది (Asif Afridi) వయసు 38 ఏళ్ల 299 రోజులు. ఈ లేటు వయసులో అతను పాక్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేసి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. రావల్పిండిలో సౌతాఫ్రికాతో ఇవాళ (అక్టోబర్ 20) మొదలైన రెండో టెస్ట్ మ్యాచ్‌లో (Pakistan Vs South Africa) ఆసిఫ్ అఫ్రిది అరంగేట్రం చేశాడు. తనకంటే 13 ఏళ్లు చిన్నవాడైన షాహీన్ అఫ్రిది (Shaheen Afridi) నుంచి ఆసిఫ్ అఫ్రిది అరంగేట్రం క్యాప్ అందుకోవడం విశేషం.ఈ వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేయడం ద్వారా ఆసిఫ్ అఫ్రిది ఓ అరుదైన ఘనత సాధించాడు. పాక్ తరఫున రెండో అతి పెద్ద వయస్కుడైన టెస్ట్ అరంగేట్రీగా రికార్డుల్లోకెక్కాడు. పాక్ తరఫున అత్యంత లేటు వయసులో అరంగేట్రం చేసిన రికార్డు మిరాన్ బక్ష్ (Miran Bakhsh) పేరిట ఉంది. 1955లో ఇతను 47 ఏళ్ల 284 రోజుల వయసులో భారత్‌పై టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఓవరాల్‌గా చూస్తే.. ప్రపంచంలో అత్యంత లేటు వయసులో అరంగేట్రం చేసిన రికార్డు ఇంగ్లండ్‌కు చెందిన జే సౌథర్టన్ పేరిట ఉంది. ఇతను టెస్ట్ క్రికెట్ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 49 ఏళ్ల 119 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు. అత్యంత లేటు వయసులో టెస్ట్ అరంగేట్రం చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆసిఫ్ అఫ్రిదిది 24వ స్థానం.ఆసిఫ్ అఫ్రిది అరంగేట్రం చేసిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. 81 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 4 వికెట్ల నష్టానికి 236 పరుగులుగా ఉంది. అబ్దుల్లా షఫీక్ (57), ఇమామ్ ఉల్ హక్ (17), బాబర్ ఆజమ్ (16), కెప్టెన్ షాన్ మసూద్ (87) ఔట్ కాగా..సౌద్ షకీల్ (36), మహ్మద్ రిజ్వాన్ (13) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, సైమన్ హార్మర్‌కు తలో రెండు వికెట్లు దక్కాయి.చదవండి: మరోసారి తుస్సుమన్న బాబర్.. 73 ఇన్నింగ్స్‌లు అయ్యాయి, ఎలా భరిస్తున్నార్రా సామీ..! -
హీరో, నిర్మాత, దర్శకుడు అందరూ కొత్తవాళ్లే..
సినిమారంగంపై ఉన్న ఇష్టంతో ముగ్గురు యువ కెరటాలు తమ ప్రతిభను పరిచయం చేసుకోవడానికి సమాయత్తమవుతున్నారు. 'వశిష్ట పార్థసారధి'ని దర్శకుడిగా, 'పృథ్విరాజ్'ని హీరోగా పరిచయం చేస్తూ... తాను నిర్మాతగా పరిచయమవుతూ "రవికిరణ్" నిర్మిస్తున్న సినిమా ఆరాధన. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్ కీలకపాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. ప్రముఖ దర్శకుడు రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి) ఈ చిత్రానికి మరో నిర్మాత కావడం విశేషం. హీరో పృథ్విరాజ్ మీడియా బ్యాక్ గ్రౌండ్ నుంచి... ప్రొడ్యూసర్ రవికిరణ్ సాఫ్ట్వేర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వస్తుండగా... దర్శకుడు వశిష్ట పార్థసారధి "మై ఫ్రెండ్ గాంధి" అనే షార్ట్ ఫిల్మ్ తో తన సత్తాను ఇప్పటికే చాటుకున్నారు. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పాటలు: రెహమాన్, సంగీతం: హరి గౌర, ఛాయాగ్రహణం: వేణు కొత్తకోట. -
30 ఏళ్ల 361 రోజులు.. హర్షల్ పటేల్ కొత్త చరిత్ర
Harshal Patel Sixth Oldest Player T20I Debut For Team India.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా తరపున హర్షల్ పటేల్ టి20ల్లో 94వ ఆటగాడిగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఈ సందర్భంగా లేటు వయసులో టి20ల్లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా హర్షల్ పటేల్ కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం హర్షల్ పటేల్ 30 ఏళ్ల 361 రోజులతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో రాహుల్ ద్రవిడ్ 38 ఏళ్ల 232 రోజులు.. మొదటిస్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్(33 ఏళ్ల 221 రోజులు), శ్రీనాథ్ అరవింద్( 31 ఏళ్ల 177 రోజులు), స్టువర్ట్ బిన్నీ(31 ఏళ్ల 44 రోజులు), మురళీ కార్తిక్( 31 ఏళ్ల 39 రోజులు) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. చదవండి: Shoaib Malik: మరీ ఇంత బద్దకమా; విచిత్రరీతిలో రనౌట్ ఇక ఐపీఎల్ 2021 సీజన్లో ఆర్సీబీకి ఆడిన హర్షల్ పటేల్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్లో 15 మ్యాచ్‌లాడి 32 వికెట్లు తీసుకున్న హర్షల్ పటేల్ అత్యధిక వికెట్లతో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో హర్షల్ పటేల్ డ్వేన్ బ్రావోతో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. చదవండి: PAK vs BAN: ఓటమి అంచుల వరకు వెళ్లింది.. కానీ గెలిచింది Really nice to see Ajit Agarkar giving the debut cap for Harshal Patel, leading wicket taker in IPL 2021, one of the stars and making the debut for India tonight.pic.twitter.com/ct9QN5I3n0 — Johns. (@CricCrazyJohns) November 19, 2021 -
జెన్నింగ్స్ 'సెంచరీ' రికార్డు!
ముంబై:భారత్ తో జరుగుతున్న ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న నాల్గో టెస్టులో ఇంగ్లండ్ ఓపెనర్ కీనట్ జెన్నింగ్స్ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ఈ స్టేడియంలో టెస్టు అరంగేట్రం చేసి సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అంతకుముందు 2006లో ఇంగ్లండ్ ఆటగాడు ఓవై షా ఇక్కడ చేసిన 88 పరుగులే ఇక్కడ ఇప్పటివరకూ అరంగేట్రపు అత్యధిక వ్యక్తిగత స్కోరు. తాజాగా దాన్ని జెన్నింగ్స్ అధిగమించాడు. మరొకవైపు భారత్ లో 2006 నుంచి చూస్తే అరంగేట్రంలోనే 50కి పైగా సాధించిన ఐదో ఇంగ్లండ్ ఆటగాడిగా జెన్నింగ్స్ నిలిచాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ఏడు అంతకుపైన వచ్చి భారత్‌లో 50 పైగా పరుగులు సాధించిన ఇంగ్లిష్ అరంగేట్రం ఆటగాళ్లలో అలెస్టకుక్, ఓవై షా, రూట్, హమిద్లున్నారు. ఈ మ్యాచ్ లో అలెస్టర్ కుక్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన జెన్నింగ్స్ ఎటువంటి తడబాటు లేకుండా బ్యాటింగ్ సాగించాడు. అటు భారత పేసర్లను, ఇటు స్పిన్ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఇంగ్లండ్‌కు మంచి పునాది వేశాడు. 186 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో శతకం పూర్తి చేశాడు. ఓవరాల్‌గా అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ సాధించిన 19వ ఇంగ్లండ్ ఆటగాడిగా జెన్నింగ్స్ నిలిచాడు. కౌంటీ మ్యాచ్‌ల్లో అమోఘమైన పరుగుల రికార్డు ఉన్న జెన్నింగ్స్ సొంతం. 2016లో 1548 కౌంటీ పరుగులు సాధించాడు. తద్వారా కౌంటీల్లో అత్యధిక పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా జెన్నింగ్స్ గుర్తింపు పొందాడు. ఈ పరుగులు సాధించే క్రమంలో అత్యధిక సెంచరీలు(7) రికార్డు కూడా అతని పేరిటే లిఖించబడటం విశేషం.


