Photo Credit: Twitter
Sri Lanka Vs India 2nd Test Match Updates: కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత బ్యాటర్లు సత్తాచాటారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. దేవ్‌దత్త్ పడిక్కల్(117) సెంచరీతో కదం తొక్కగా.. శుబ్‌మన్ గిల్(50), యశస్వి జైశ్వాల్(45), రవీంద్ర జడేజా(43) రాణించారు.
టీమిండియా ఐదో వికెట్ డౌన్
టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. 43 పరుగులు చేసిన జడేజా.. ఫెర్నాండో బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి డెబ్యూ ఆటగాడు సారాన్ష్ జైన్ వచ్చాడు. 85 ఓవర్లకు భారత్ స్కోర్: 300/5
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
117 పరుగుల వద్ద దేవదత్ పడిక్కల్ ఔటయ్యాడు. కేషర నువంత బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రవీంద్ర జడేజాకు (36) జతగా ధ్రువ్ జురెల్ (5) క్రీజ్‌లోకి వచ్చాడు.
పడిక్కల్ సెంచరీ
కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ టీమిండియా యువ బ్యాటర్ దేవ్‌దత్త్ పడిక్కల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 168 బంతుల్లో పడిక్కల్ తన రెండో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
రిషబ్ పంత్ రిటైర్డ్ హర్ట్
కొలంబో టెస్టులో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌లో 3 పరుగులు వ్యక్తిగత స్కోర్ వద్దు చేతి గాయం కారణంగా పంత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అతడి స్ధానంలో రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. 59.4 ఓవర్లకు భారత్ స్కోర్: 215-3
టీ బ్రేక్‌కు టీమిండియా స్కోరెంతంటే?
టీ బ్రేక్ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. క్రీజులో దేవ్‌దత్త్ పడిక్కల్(63), రిషబ్ పంత్(0) ఉన్నారు.
శుబ్‌మన్ గిల్ అవుట్
శుబ్‌మన్ గిల్ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన గిల్.. అషితా ఫెర్నాండో బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో రిషబ్ పంత్ వచ్చాడు.
గిల్ ఫిప్టీ
భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 50 ఓవర్లకు టీమిండియా స్కోర్: 184/2
150 రన్స్ మార్క్ దాటిన భారత్
పడిక్కల్ (50) అజేయ అర్ధసెంచరీకి తోడు గిల్ (40) నిలకడగా ఆడుతుండడంతో టీమిండియా 150 పరుగుల మార్క్ దాటింది. ఈ ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 85 పరుగులు జోడించారు. ప్రస్తుతం భారత్ 42 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.
సెంచరీ మార్క్ దాటిన టీమిండియా
కొలంబో వేదికగా లంకతో రెండో టెస్టులో టీమిండియా సెంచరీ మార్క్ దాటింది. 30 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. గిల్ (25), పడిక్కల్ (18) పరుగులతో క్రీజులో ఉన్నారు.
లంచ్ తర్వాత మొదలైన ఆట
లంచ్ అనంతరం ఆట మొదలైంది. 27 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. పడిక్కల్ (15), గిల్ (12) పరుగులతో క్రీజులో ఉన్నారు.
లంచ్ బ్రేక్
లంచ్ విరామ సమయానికి టీమిండియా 25 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. పడిక్కల్ (13), శుబ్‌మన్ గిల్ (11) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు జైస్వాల్ (45) దూకుడు ఆటతీరును ప్రదర్శించగా, కేఎల్ రాహుల్ (18) ఆకట్టుకోలేకపోయాడు.
రెండో వికెట్ డౌన్
దూకుడుగా ఆడుతున్న భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ (45) అశితా ఫెర్నాండో బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 62 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. పడిక్కల్ 3 పరుగులతో ఆడుతున్నాడు.
జైస్వాల్ దూకుడు.. టీమిండియా స్కోరెంతంటే?
లంకతో రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ జోరు ప్రదర్శిస్తున్నాడు. వన్డే తరహాలో వేగంగా ఆడుతున్న జైస్వాల్ 51 బంతుల్లో 41 పరుగులతో ఆడుతున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు ఉన్నాయి. ఇక పడిక్కల్ రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం భారత్ 17 ఓవర్లలో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది.
తొలి వికెట్ డౌన్
18 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ లాహిరు కుమారా బౌలింగ్‌లో నిరోషన్ డిక్‌వెల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. జైస్వాల్ (19), పడిక్కల్ క్రీజులో ఉన్నారు.
నిలకడగా భారత్ బ్యాటింగ్
లంకతో మొదలైన రెండో టెస్టులో భారత్ నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. జైస్వాల్ 14, కేఎల్ రాహుల్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచిన టీమిండియా
శ్రీలంక, భారత్ మధ్య కొలంబో వేదికగా రెండో టెస్టు మ్యాచ్ మొదలైంది. ఈ నేపథ్యంలో సారాంశ్ జైన్ టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. సీనియర్ ఆల్‌రౌండర్ జడేజా చేతుల మీదుగా సారాంశ్ క్యాప్ అందుకున్నాడు. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది.
తొలి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపించని కుల్డీప్ యాదవ్‌పై వేటు పడింది. అతడి స్థానంలోనే సారాంశ్ తుది జట్టులోకి వచ్చాడు. భారత జట్టు అదొక్కటే మార్పు. శ్రీలంక కూడా రెండు ఛేంజెస్ చేసింది. కమిల్ మిశ్రా అరంగేట్రం చేయగా.. చండిమాల్ స్థానంలో పసిందు సూరియబండారా వచ్చాడు.
భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, శరన్ష్ జైన్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
శ్రీలంక (ప్లేయింగ్ XI): లాహిరు ఉదార, కమిల్ మిషార, పసిందు సూర్యబండార, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వా(కెప్టెన్), సోనాల్ దినుషా, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), కేషారా నువంత, ప్రబాత్ జయసూర్య, లహిరు కుమార, అసిత ఫెర్నాండో
A look at #TeamIndia's Playing XI for the 2nd #SLvIND Test 👌👌
Saransh Jain makes his international debut 👏👏
Updates ▶️ https://t.co/r9FgXSdsMf pic.twitter.com/WOCtWZ9YcP— BCCI (@BCCI) August 23, 2026


