Photo Credit: BCCI Twitter
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి సెషన్‌లో 20 ఓవర్ల పాటు ఒక్క వికెట్ కూడా పడకపోగా, లంక బ్యాటర్లు జిడ్డు ఆటను ప్రదర్శించారు. ముఖ్యంగా కెప్టెన్ ధనంజయ డిసిల్వా, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో దినూషలు మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడారు.
ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 95 పరుగులు జోడించారు. ఈ నేపథ్యంలోనే డ్రెస్సింగ్ రూమ్ నుంచి టీమిండియా ఆటను గమనిస్తూ వచ్చిన గంభీర్ బౌలర్ల ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. 30 ఓవర్ల పాటు భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంపై గంభీర్ ఆగ్రహించాడు. దీంతో లంక 112 పరుగుల వద్ద ఉన్నప్పుడు డ్రింక్స్ బ్రేక్ రాగా, ఆ సమయంలో గంభీర్ డ్రెస్సింగ్ రూమ్ నుంచి డగౌట్‌కు వచ్చి మాస్టర్ ప్లాన్ వివరించాడు. గంభీర్ ఇచ్చిన ప్లాన్ ఆటను పూర్తిగా మార్చేయడంతో ఆటకు అదే టర్నింగ్ పాయింట్ అయింది.
సిరాజ్‌ను పిలిచిన గంభీర్ బౌలింగ్ ప్లాన్‌ను వివరించాడు. పేస్ అటాకింగ్‌ను పక్కనబెట్టి, పూర్తిగా స్పిన్నర్లతో బౌలింగ్ చేయించమని సిరాజ్‌కు వివరించాడు. ఈ విషయాన్ని వెంటనే కెప్టెన్ గిల్‌కు చేరవేయాలని తెలిపాడు. గంభీర్ సలహాను పాటించిన మరుక్షణమే టీమిండియాకు ఫలితం రావడం విశేషం. 94 పరుగుల జోడించి బలపడుతున్న ధనంజయ, దినూష జోడిని జడేజా విడదీశాడు.
అలా టీమిండియా మళ్లీ విజయం ట్రాక్ ఎక్కినట్లయింది. మరో ఎండ్ నుంచి మానవ్ సుతార్ కూడా తన బౌలింగ్‌తో ముప్పతిప్పలు పెట్టడంతో లంక కష్టాలు రెట్టింపు అయ్యాయి. చివరకు 206 పరుగుల వద్ద లంక తమ ఇన్నింగ్స్‌ను ముగించడంతో 165 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది.
🚨Gautam Gambhir Gives Mohammed Siraj a Bowling Plan to Break Sri Lanka’s Partnership🚨
Indian bowlers are struggling to take wickets on the morning of Day 5, as Sri Lankan batters Dhananjaya de Silva and Sonal Dinusha are batting strongly and building a solid partnership.… pic.twitter.com/Bu6YQa8DXD— Central Cricket (@arshdeep3444) August 19, 2026


