వివాదంలో రింకూ సింగ్‌ | Rinku Singh Gets In A Quarrel In UPT20 League, Asked To Step Aside | Sakshi
Sakshi News home page

వివాదంలో రింకూ సింగ్‌

Aug 19 2026 12:43 PM | Updated on Aug 19 2026 12:46 PM

Rinku Singh Gets In A Quarrel In UPT20 League, Asked To Step Aside

source: IPL X

టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌ రింకూ సింగ్‌ తన స్వరాష్ట్రం యూపీలో జరిగే టీ20 లీగ్‌లో రచ్చ చేశాడు. ఈ టోర్నీలో మీరట్ మావెరిక్స్ కెప్టెన్‌గా వ్యవహరించే రింకూ.. గోరఖ్‌పూర్ లయన్స్‌ మ్యాచ్‌కు ముందు గ్రౌండ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగి వివాదంలో చిక్కుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా సోషల్ మీడియాలో వైరలవుతోంది.

అసలేం జరిగిందంటే..?
మ్యాచ్‌కు ముందు మావెరిక్స్ ఆటగాళ్లు మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సమయంలో రింకూ సింగ్, అతని సహచర ఆటగాడు ప్రత్యర్థి జట్టు కోసం కేటాయించిన ప్రాక్టీస్ ప్రాంతంలోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు వీడియోలో కనిపించింది.

ప్రత్యర్థి జట్టు బౌలింగ్ ప్రాక్టీస్ కోసం ఆ ప్రాంతాన్ని కేటాయించడంతో అక్కడికి వెళ్లవద్దని గ్రౌండ్ సిబ్బంది రింకూను, అతని సహచరుడిని కోరాడు. అయితే రింకూ అతని సూచనలను పట్టించుకోకుండా ఆ ప్రాంతంలోకి వెళ్లి బౌలింగ్ చేసినట్లు వీడియోలో కనిపించింది.

గ్రౌండ్ సిబ్బంది వారిని అక్కడి నుంచి వెళ్లాలని పదేపదే కోరుతున్న సమయంలో రింకూ, అతని సహచరుడు నవ్వుతూ కనిపించడం వివాదానికి కారణమైంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో రింకూపై విమర్శలు వస్తున్నాయి. అమాయకంగా కనిపిస్తాడు కానీ, ముదురే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

రింకూకు శిక్ష పడుతుందా..?
అయితే ఈ ఘటనను క్రికెట్ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించడం అంత సులభం కాదు. వీడియోలో కనిపిస్తున్నది ప్రత్యర్థి జట్టు కేటాయించిన ప్రాక్టీస్ పిచ్ మాత్రమే. అది మ్యాచ్‌కు ఉపయోగించే అసలు పిచ్ కాకపోవడంతో, అక్కడ బౌలింగ్ చేసినందుకు నేరుగా శిక్ష విధించే నిబంధన ఉన్నట్లు స్పష్టత లేదు.

మ్యాచ్‌కు ఉపయోగించే ప్రధాన పిచ్‌ను దెబ్బతీయడం లేదా దాని పరిస్థితిని ప్రభావితం చేసే చర్యలు మాత్రం తీవ్రంగా పరిగణించబడతాయి. కానీ ఈ ఘటనలో రింకూ అసలు మ్యాచ్ పిచ్‌ను ఉపయోగించినట్లు ఆధారాలు లేవు.

క్రీడాస్ఫూర్తికి విరుద్ధం
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రింకూ సింగ్‌పై నిషేధం లేదా భారీ శిక్ష పడే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. అయితే గ్రౌండ్ సిబ్బంది సూచనలను పట్టించుకోకుండా ప్రత్యర్థి జట్టు ప్రాక్టీస్ ప్రాంతంలోకి వెళ్లడం మాత్రం క్రీడాస్ఫూర్తికి విరుద్ధం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement