ఏషియన్‌ గేమ్స్‌ స్వర్ణం తర్వాత పాక్‌పై బీసీసీఐ అధ్యక్షుడి ఘాటు వ్యాఖ్యలు | BCCI Rubs Salt On Pakistan Wounds After Asian Games 2026 Gold Medal Win In Cricket | Sakshi
Sakshi News home page

ఏషియన్‌ గేమ్స్‌ స్వర్ణం తర్వాత పాక్‌పై బీసీసీఐ అధ్యక్షుడి ఘాటు వ్యాఖ్యలు

Oct 4 2026 11:25 AM | Updated on Oct 4 2026 11:35 AM

BCCI Rubs Salt On Pakistan Wounds After Asian Games 2026 Gold Medal Win In Cricket

source: X

ఏషియన్‌ గేమ్స్ 2026లో భారత క్రికెట్ జట్లు అదరగొట్టాయి. పురుషుల, మహిళల విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించాయి. మహిళల జట్టు ఫైనల్లో శ్రీలంకను ఓడించి స్వర్ణ పతకం నిలబెట్టుకోగా.. పురుషుల జట్లు ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసి గోల్డ్ మెడల్‌ను డిఫెండ్‌ చేసుకుంది.

పురుషుల జట్టు ఫైనల్లో పాక్‌ను ఓడించి స్వర్ణం సాధించిన అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌కు, పాకిస్తాన్‌కు మధ్య అంతరం స్పష్టంగా కనిపిస్తోందని అన్నాడు.

“పాకిస్తాన్ మన చిరకాల ప్రత్యర్థి. కానీ ప్రస్తుతం వాళ్లు పెద్దగా పోటీ ఇవ్వడం లేదు. ఒత్తిడితో కూడిన పరిస్థితులను మా జట్టు ఎదుర్కొన్న తీరు అద్భుతం. ప్రపంచంలోని మరే జట్టు కూడా ఇంత సమర్థంగా ఒత్తిడిని ఎదుర్కోలేదని అనిపిస్తోంది. ఏషియన్‌ గేమ్స్‌లో భారత జట్టే అత్యుత్తమం. మా ఆటగాళ్ల ప్రదర్శన అభినందనీయం” అని మన్హాస్ వ్యాఖ్యానించాడు.

తిలక్, అభిషేక్‌పై ప్రశంసలు
ఫైనల్లో పాక్‌పై అద్భుతంగా బ్యాటింగ్‌ చేసిన అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మపై మన్హాస్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. “ఇది జట్టు ఆట. తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అభిషేక్ శర్మ మ్యాచ్‌కు మంచి పునాది వేశాడు. ఓపెనర్ల పని ఇన్నింగ్స్‌కు మంచి ఆరంభం ఇవ్వడం. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ దాన్ని పూర్తి చేయాలి” అని మన్హాస్ వివరించాడు.

కాగా, నిన్న జరిగిన ఏషియన్‌ గేమ్స్‌ పురుషుల క్రికెట్‌ ఫైనల్స్‌లో భారత్‌ పాక్‌పై విజయం సాధించి స్వర్ణ పతకం నిలబెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 211 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం పాకిస్తాన్‌ను 192/6కే పరిమితం చేసి 19 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇదీ చదవండి: 21 స్వర్ణాలు... 27 రజతాలు... 37 కాంస్యాలు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement