source: X
పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియాకు చెందిన షేన్ డైట్జ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మంగళవారం ప్రకటించింది. ఇటీవలే వెస్టిండీస్ మహిళల జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకున్న డైట్జ్.. వహాబ్ రియాజ్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నాడు.
వహాబ్ మార్గదర్శకత్వంలో పాక్ మహిళల జట్టు గతేడాది ఆశించిన స్థాయి ప్రదర్శనలు లేదు. ఆడిన 33 మ్యాచ్‌ల్లో 15 విజయాలే సాధించింది. జింబాబ్వేతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లలో ఆరు విజయాలు నమోదు చేసినప్పటికీ.. సౌతాణాఫ్రికా, శ్రీలంకతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లను 1-2 తేడాతో కోల్పోయింది. టీ20 ప్రపంచకప్‌లోనూ ఒక్క విజయం మాత్రమే సాధించింది.
ప్రపంచకప్‌కు ముందు జరిగిన ముక్కోణపు సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఆసియా కప్‌లో సెమీఫైనల్‌కు చేరగా, ఆసియా క్రీడల్లో కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.
గత మూడున్నరేళ్లలో పాక్ మహిళల జట్టుకు హెడ్ కోచ్‌గా నియమితులైన ఆరో వ్యక్తి షేన్ డైట్జ్. వెస్టిండీస్ మహిళల జట్టుకు కోచ్‌గా ఉన్న సమయంలో 2024, 2026 టీ20 ప్రపంచకప్‌లలో ఆ జట్టు వరుసగా సెమీఫైనల్స్‌కు చేరడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు.
2008 నుంచి 2013 వరకు న్యూజిలాండ్‌లోని క్రికెట్ వెల్లింగ్టన్‌కు హై పెర్ఫార్మెన్స్ కోచ్‌గా పనిచేసిన డైట్జ్.. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జాతీయ జట్లకు కూడా హెడ్ కోచ్‌గా వ్యవహరించారు.
పాకిస్థాన్ మహిళల జట్టు హెడ్ కోచ్‌గా నియమితులవడంపై డైట్జ్ సంతోషం వ్యక్తం చేశాడు. 2028లో పాక్ ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేయడమే తమ లక్ష్యమని తెలిపాడు. త్వరలో వెస్టిండీస్‌తో జరగనున్న ద్వైపాక్షిక సిరీస్‌కు ముందే డైట్జ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
ఇదీ చదవండి: ఐపీఎల్ 2027కు ముందు మరో భారీ ట్రేడ్ డీల్..!


