సౌతాఫ్రికా గ‌డ్డ‌పై చ‌రిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌ | Bangladesh History-Highest-Total Ever-Vs South Africa-Test Cricket | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికా గ‌డ్డ‌పై చ‌రిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌

Nov 16 2026 10:05 PM | Updated on Nov 16 2026 10:05 PM

Bangladesh History-Highest-Total Ever-Vs South Africa-Test Cricket

Photo Credit: Twitter

సౌతాఫ్రికాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ చ‌రిత్ర సృష్టించింది. స‌ఫారీ గ‌డ్డ‌పై టెస్టుల్లో తొలిసారి 400 ప‌రుగుల మార్క్ దాటి రికార్డుల‌కెక్కింది. ఇప్ప‌టివ‌ర‌కు టెస్టుల్లో బంగ్లా జ‌ట్టుకు సౌతాఫ్రికాపై 326 పరుగులే అత్య‌ధిక స్కోరుగా ఉండేది. తాజాగా జోహ‌న్నెస్‌బ‌ర్గ్ వేదిక‌గా జ‌రుగుతున్న టెస్టులో బంగ్లాదేశ్ స‌రిగ్గా 400 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 

తౌహిద్ హృదోయ్ (137), లిట‌న్ దాన్ (120) శ‌త‌కాల‌తో చెల‌రేగారు. అనంత‌రం బ్యాటింగ్ ఆరంభించిన సౌతాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 62 ఓవర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 287 ప‌రుగులు చేసింది. మార్క్యూస్ అకెర్‌మ‌న్ (157) సెంచ‌రీతో చెల‌రేగ‌గా, జుబైర్ హంజా (83) అర్థ‌సెంచ‌రీ సాధించాడు. ప్ర‌స్తుతం సౌతాఫ్రికా మ‌రో 113 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది.

ఇక సౌతాఫ్రికాపై టెస్టుల్లో బంగ్లాదేశ్ న‌మోదు చేసిన టాప్‌-5 అత్య‌ధిక స్కోర్ల‌ను ఒకసారి ప‌రిశీలిద్దాం. తాజా మ్యాచ్‌లో 400 ప‌రుగుల మార్క్‌ను దాటిన బంగ్లాదేశ్ 2015లో చట్టోగ్రామ్ వేదిక‌గా సౌతాఫ్రికాతో జ‌రిగిన టెస్టులో 326 ప‌రుగులు చేసింది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. 

ఇక 2017లో సౌతాఫ్రికా గ‌డ్డ‌పై టెస్టు ఆడిన బంగ్లా జ‌ట్టు పోట్చెస్ట్రూమ్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో బంగ్లా జ‌ట్టు 320 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అయితే ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 254 ప‌రుగుల తేడాతో భారీ విజ‌యాన్ని అందుకుంది. అక్టోబ‌ర్ 2024లో మీర్పూర్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 307 ప‌రుగులు చేసింది. 

ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టార్గెట్‌ను ఛేదించి విజ‌యాన్ని అందుకుంది. ఇక 2022లో డ‌ర్బ‌న్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 298 ప‌రుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో స‌ఫారీలు 220 ప‌రుగుల తేడాతో భారీ విజ‌యాన్ని అందుకుంది.

ఇదీ చదవండి: మునివేళ్ల‌పై నిల‌బెట్టిన మ్యాచ్‌.. హైద‌రాబాద్ సంచ‌ల‌న విజయం

సెంచ‌రీతో చెల‌రేగిన సౌతాఫ్రికా ఓపెన‌ర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement