సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026లో భారత వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. హర్యానాకు ప్రాతినిథ్యం వహిస్తున్న చాహల్.. బుధవారం తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. చాహల్ తన స్పిన్ మయాజాలంతో తమిళనాడు బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.
ఈ లెగ్ స్పిన్నర్ నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు నిషాంత్ సింధు మూడు వికెట్లు సాధించాడు. ఫలితంగా తమిళనాడు 19.5 ఓవర్లలో 124 పరుగులకే కుప్పకూలింది.
తమిళనాడు బ్యాటర్లలో సాత్విక్(38) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం ఈ లక్ష్యాన్ని హర్యానా 16.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. హర్యానా బ్యాటర్లలో అంకిత్ రాజేష్ కుమార్(43), సింధు(37) అద్భుత ఇన్నింగ్స్‌లతో మ్యాచ్‌ను ఫినిష్ చేశారు.
చరిత్ర సృష్టించిన చాహల్
ఇక ఈ మ్యాచ్‌లో 3 వికెట్లతో చెలరేగిన చాహల్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో 400 వికెట్లు మైలు రాయిని అందుకున్న తొలి ఇండియన్ బౌలర్‌గా చాహల్ నిలిచాడు.
చాహల్ గత కొన్నేళ్లగా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నప్పటికి.. దేశవాళీ క్రికెట్‌లో మాత్రం సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ బౌలర్లను వెనక్కి నెట్టి ఈ ఫీట్ సాధించాడు.
చాహల్ తన 346 టీ20 మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. 553 మ్యాచ్‌లు ఆడిన రషీద్, 6.68 ఎకానమీతో ఏకంగా 743 వికెట్లు పడగొట్టాడు. అతని తర్వాతి స్థానంలో వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ (658 వికెట్లు) ఉన్నాడు. ఈ జాబితాలో చాహల్ 14వ స్ధానంలో ఉన్నాడు.
చదవండి: మూడో వన్డేలో ఆస్ట్రేలియా చిత్తు.. సిరీస్ ఎగరేసుకుపోయిన ఇంగ్లండ్


