మనీష్ పాండే రీఎంట్రీ.. రెండేళ్ల తర్వాత పిలుపు | Manish Pandey Returns After Two Years As Karnataka Announce SMAT 2026 Squad | Sakshi
Sakshi News home page

మనీష్ పాండే రీఎంట్రీ.. రెండేళ్ల తర్వాత పిలుపు

Nov 7 2026 4:30 PM | Updated on Nov 7 2026 4:44 PM

Manish Pandey Returns After Two Years As Karnataka Announce SMAT 2026 Squad

స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో తొలి మూడు మ్యాచ్‌ల‌ కోసం 15 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్ర‌క‌టించింది. ఈ జట్టు కెప్టెన్ స్మ‌ర‌ణ్ ర‌విచంద్ర‌న్ ఎంపిక‌య్యాడు. ఈ జ‌ట్టులో సీనియ‌ర్ బ్యాట‌ర్ మనీష్ పాండేకు చోటు ద‌క్కింది.

పాండే దాదాపు రెండేళ్ల విరామం త‌ర్వాత తిరిగి క‌ర్ణాట‌క టీ20 జ‌ట్టుకు తిరిగి ఎంపిక‌య్యాడు. ఈ ఏడాది మహారాజా టీ20 ట్రోఫీ పాండే అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.  9 ఇన్నింగ్స్‌ల్లో 58.20 సగటు, 177.44 స్రైక్ రేట్‌తో 291 పరుగులు చేశాడు.

ఈ కార‌ణంగానే అత‌డికి సెల‌క్ట‌ర్ల నుంచి పిలుపు వ‌చ్చింది. అయితే  సీనియర్ ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, శ్రేయస్ గోపాల్‌లకు తొలి మూడు మ్యాచ్‌ల జట్టులో చోటు లభించలేదు. ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌ల‌కు వారిద్ద‌రిని ఎంపిక చేసే అవ‌కాశ‌ముంది. క‌ర్ణాట‌క జ‌ట్టు త‌మ తొలి మ్యాచ్‌లో నవంబర్ 14న వాంఖ‌డే వేదిక‌గా బెంగాల్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

కర్ణాటక జట్టు ఇదే: స్మరన్  (కెప్టెన్), రోహన్ ఎ పాటిల్, లవ్నిత్ సిసోడియా, మనీష్ పాండే, కరుణ్ నాయర్, అభినవ్ మనోహర్, మన్వంత్ కుమార్ ఎల్, శిఖర్ శెట్టి, ప్రవీణ్ దూబే, వైశాఖ్ విజయ్‌కుమార్, విద్వత్ కావేరప్ప, అభిలాష్ శెట్టి, శ్రీజిత్ కేఎల్, అనీశ్వర్ గౌతమ్, రితేష్ భట్కల్.
చదవండి: IND vs NZ: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా పేసర్‌.. 23 ఏళ్ల జహీర్‌ ఖాన్‌ రికార్డ్ బ్రేక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement