వెల్టింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా పేసర్ గుర్నూర్ బ్రార్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. వర్షం కారణంగా 47 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో గుర్నూర్ నిప్పులు చెరిగాడు. ఈ పంజాబ్ పేసర్ తన సంచలన బౌలింగ్‌తో కివీస్ టాపార్డర్‌ను దెబ్బతీశాడు.
గుర్నూర్ మొత్తంగా తన పది ఓవర్ల కోటాలో కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇది అతడి వన్డే కెరీర్‌లో బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో గుర్నూర్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వెల్లింగ్టన్ గ్రౌండ్‌లో వన్డే మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్‌గా బ్రార్ చరిత్ర సృష్టించాడు.
ఇంతకుముందు ఈ రికార్డు భారత లెజెండరీ పేసర్ జహీర్ ఖాన్ పేరిట ఉండేది. 2003లో వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో జహీర్ ఖాన్ 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. తాజా మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టిన గుర్నూర్.. 23 ఏళ్ల జహీర్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.
వన్డేల్లో గుర్నూర్ బ్రార్ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు ఇవే
4/30 వర్సెస్ న్యూజిలాండ్, వెల్లింగ్టన్ (2026)
3/27 వర్సెస్ అఫ్గానిస్థాన్, ధర్మశాల (2026)
3/44 వర్సెస్ న్యూజిలాండ్, ఆక్లాండ్ (2026)
3/60 వర్సెస్ అఫ్గానిస్థాన్, లక్నో (2026)
134 పరుగులకే కుప్పకూలిన కివీస్
ఇక భారత బౌలర్ల ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కేవలం 134 పరుగులకే కుప్పకూలింది. మొదటి వన్డేలో కూడా ఆ జట్టు 40.2 ఓవర్లలో 185 పరుగులకే పరిమితమైంది. దీంతో ఒకే వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో 200 కంటే తక్కువ పరుగులకు ఆలౌట్ కావడం 2001 తర్వాత (శ్రీలంకపై) ఇదే తొలిసారి.
చదవండి: IND vs NZ: ‘అదరగొడుతున్నాడు.. వన్డే వరల్డ్‌కప్ జట్టులో అతడికి చోటు ఖాయం’


