రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో విజయవాడ వేదికగా ఆంధ్ర జట్టుతో జరుగుతున్న ఎలైట్ గ్రూప్-బి మ్యాచ్‌లో కర్ణాటక కెప్టెన్, ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్ స్మరణ్ రవిచంద్రన్ వీరోచిత సెంచరీతో చెలరేగాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటకకు ఆంధ్ర బౌలర్లు ఊహించని షాకిచ్చారు. ఆంధ్ర బౌలర్ల దెబ్బకు కర్ణాటక కేవలం 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్ వంటి స్టార్ ప్లేయర్లు సైతం సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. ఈ సన్‌రైజర్స్ బ్యాటర్ ఆచితూచి ఆడుతూ వికెట్ కీపర్ కృష్ణన్ శ్రీజిత్ (58)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో స్మరణ్ తన 8వ ఫస్ట్ క్లాస్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
స్మరణ్ 108 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 74 ఓవర్లు ముగిసే సరికి కర్ణాటక 8 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆంధ్ర బౌలర్లలో కావూరి సాయితేజ, శశికాంత్, సౌరభ్ కుమార్ తలా రెండు వికెట్లు సాధించారు.
తుది జట్లు
కర్ణాటక: మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్, రితేష్ భత్కల్, కరుణ్ నాయర్, స్మరణ్ రవిచంద్రన్ (కెప్టెన్), అనీష్ కెవి, కృష్ణన్ శ్రీజిత్ (వికెట్ కీపర్), మాధవ్ బజాజ్, శిఖర్ శెట్టి, అభిలాష్ శెట్టి, మన్వంత్ కుమార్ ఎల్
ఆంధ్రా: అభిషేక్ రెడ్డి, రికీ భుయ్ (కెప్టెన్), రేవంత్ రెడ్డి (వికెట్‌కీపర్), షేక్ రషీద్, మారంరెడ్డి హేమంత్ రెడ్డి, సీరం వెంకట రాహుల్, కెవి శశికాంత్, సౌరభ్ కుమార్, త్రిపురాన విజయ్, లలిత్ మోహన్, కావూరి సాయితేజ


