సెంచరీతో కదంతొక్కిన ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్‌ | Irani Cup 2026: Smaran Ravichandran unbeaten ton helps RoI recover | Sakshi
Sakshi News home page

సెంచరీతో కదంతొక్కిన ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్‌

Oct 4 2026 9:50 AM | Updated on Oct 4 2026 9:50 AM

Irani Cup 2026: Smaran Ravichandran unbeaten ton helps RoI recover

source: X

జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా ఆటగాడు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లేయర్‌ స్మరణ్‌ రవిచంద్రన్‌ సెంచరీతో (126 నాటౌట్‌) కదంతొక్కాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతడు ఈ ఫీట్‌ను సాధించాడు. ఫలితంగా రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా గౌరవప్రదమైన స్కోర్‌ దిశగా సాగుతూ, 265 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది.

మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెస్ట్ ఆఫ్ ఇండియా 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. స్మరణ్ రవిచంద్రన్‌తో పాటు ముకేశ్‌ చౌదరి (9) క్రీజ్‌లో ఉన్నాడు. రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో స్మరణ్‌తో పాటు సనత్‌ సాంగ్వాన్‌ (55) మాత్రమే రాణించాడు.

అంతకుముందు జమ్మూ కశ్మీర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకే ఆలౌటైంది. పరాస్‌ డోగ్రా (75), అబ్దుల్‌ సమద్‌ (57), లోన్‌ నసిర్‌ ముజఫర్‌ (64) అర్ద సెంచరీలతో రాణించడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ముకేశ్‌ చౌదరి (5-78) అద్భుతమైన బౌలింగ్‌తో జమ్మూ పతనాన్ని శాశించాడు. ఆకాశ్‌దీప్‌ 3, ముకేశ్‌ కుమార్‌ 2 వికెట్లు తీశారు.

దీనికి ముందు రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులకే ఆలౌటైంది. వారి ఇన్నింగ్స్‌లో శిఖర్‌ మోహన్‌ (60), స్మరణ్‌ రవిచంద్రన్‌ (68) మాత్రమే రాణించారు. జమ్మూ బౌలర్లు తలో చేయి వేసి రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా పతనాన్ని శాశించారు. కాగా, రంజీ ఛాంపియన్‌ అయిన జమ్మూ కశ్మీర్‌ ఇరానీ కప్‌లో రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాతో తలపడుతుంది. 

ఇదీ చదవండి: జట్టు ప్రకటన.. రిషబ్‌ పంత్‌కు నో ప్లేస్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement