ఐపీఎల్లో కీలక ట్రేడ్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న లెఫ్ట్ ఆర్మ్ పేసర్ టి. నటరాజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు సన్‌రైజర్స్ లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లిపోయాడు. ఎస్ఆర్హెచ్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆటగాళ్ల ట్రేడ్‌ను ఐపీఎల్ అధికారికంగా ప్రకటించింది.
నటరాజన్ రీఎంట్రీ
నటరాజన్ 2020 నుంచి 2024 వరకు ఐదు సీజన్ల పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సమయంలో అతడు జట్టు విజయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2024 ఐపీఎల్ సీజన్లో 19 వికెట్లు పడగొట్టి, ఆ సీజన్లో సన్‌రైజర్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అలాగే ఆ సీజన్లో ఎస్ఆర్హెచ్ను ఫైనల్‌కు చేర్చడంలోనూ కీలకంగా వ్యవహరించాడు.
2025 ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ నటరాజన్‌ను రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ట్రేడ్‌లో భాగంగా అతడు రూ.5 కోట్ల సవరించిన ఫీజుతో తిరిగి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చేరనున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి జీషన్ అన్సారీ
లెగ్ స్పిన్నర్ జీషన్ అన్సారీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరనున్నాడు. 2025 ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 10 మ్యాచ్‌లు ఆడిన అతడు ఆరు వికెట్లు పడగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనే ఐపీఎల్ అరంగేట్రం చేసి మూడు వికెట్లు తీశాడు. 26 ఏళ్ల అన్సారీ తన ప్రస్తుత ఫీజు రూ.40 లక్షలతోనే ఢిల్లీ క్యాపిటల్స్‌కు మారనున్నాడు. అతడి చేరికతో ఢిల్లీ జట్టు స్పిన్ బౌలింగ్ విభాగానికి మరింత బలం చేకూరనుంది.
ఇదీ చదవండి: సౌతాఫ్రికా బౌలర్ సంచలనం.. ఒకే ఓవర్లో 5 వికెట్లు


