సౌతాఫ్రికా బౌలర్‌ సంచలనం.. ఒకే ఓవర్‌లో 5 వికెట్లు | South Africa Chad Laycock Takes Five Wickets In An Over In CSA Pro20 Cup | Sakshi
Sakshi News home page

సౌతాఫ్రికా బౌలర్‌ సంచలనం.. ఒకే ఓవర్‌లో 5 వికెట్లు

Oct 14 2026 5:32 PM | Updated on Oct 14 2026 5:39 PM

South Africa Chad Laycock Takes Five Wickets In An Over In CSA Pro20 Cup

source: X

సౌతాఫ్రికా యువ ఫాస్ట్‌ బౌలర్‌ చాడ్‌ లేకాక్‌ టీ20 క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించాడు. CSA ప్రో20 కప్ 2026లో భాగంగా అక్టోబర్ 13న టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాటల్ ఇన్‌లాండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రికార్డు ప్రదర్శన చేశాడు.

ఈ మ్యాచ్‌లో లేకాక్‌ తన కోటా 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. CSA ప్రో20 కప్ చరిత్రలో ఇవే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు. యావత్‌ సౌతాఫ్రికా టీ20 క్రికెట్‌ చరిత్రలో ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గానూ లేకాక్‌ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ టీ20 క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఐదో బౌలర్‌గా నిలిచాడు.

టైటాన్స్ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో లేకాక్ విశ్వరూపం ప్రదర్శించాడు. తొలి నాలుగు బంతులు, ఆతర్వాత ఆరో బంతికి వికెట్‌ తీసి టైటాన్స్‌ ఇన్నింగ్స్‌ను తలకిందులు చేశాడు. 19వ ఓవర్‌కు ముందు 4 వికెట్లకు 193 పరుగులతో పటిష్ఠంగా ఉన్న ఆ జట్టు.. ఓవర్ ముగిసేసరికి 9 వికెట్లకు 195 పరుగులకే పరిమితమైంది.

ఎవరీ లేకాక్..?
2003లో జన్మించిన లేకాక్ సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో క్వాజులు-నాటల్ ఇన్‌లాండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన లేకాక్‌ ఈ రికార్డు ప్రదర్శనకు ముందు 15 టీ20ల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. అలాంటి ఆటగాడు ఒకే మ్యాచ్‌లో ఆరు వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు.

లేకాక్ ఇప్పటివరకు సౌతాఫ్రికా జాతీయ జట్టుకు ఆడలేదు. స్వదేశంలో జరిగే ఎస్‌ఏ20 లీగ్‌లోనూ అవకాశం లభించలేదు. ఈ ప్రదర్శన తర్వాత లేకాక్‌పై ఎస్‌ఏ20 లీగ్‌ ఫ్రాంచైజీలు కన్నేయవచ్చు.

ఇదీ చదవండి: భారీ జంప్‌ కొట్టిన శ్రేయస్‌ అయ్యర్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement