source: X
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ భారీగా లబ్ది పొందాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో అద్బుత శతకం చేయడంతో ఏకంగా మూడు స్థానాలు మెరుగుపర్చుకొని నాలుగో స్థానానికి ఎగబకాడు.
విండీస్ సిరీస్‌లో నిలకడైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న తిలక్ వర్మ కూడా ఓ స్థానం మెరుగుపర్చుకొని తొమ్మిదో స్థానానికి చేరాడు. టీమిండియా చిచ్చరపిడుగులు ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ టాప్-2 బ్యాటర్లుగా కొనసాగుతుండగా.. డాషింగ్ ఓపెనర్ సంజూ శాంసన్ 4 స్థానాలు మెరుగుపర్చుకొని 27వ స్థానానికి చేరాడు.
భారత్‌తో సిరీస్‌లో విశేషంగా రాణిస్తున్న విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని 11వ స్థానానికి ఎగబాకగా.. మరో విండీస్ ప్లేయర్ ఫెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ 13 స్థానాలు మెరుగుపర్చుకొని 24వ స్థానానికి చేరాడు. ఈ వారం ర్యాంకింగ్స్‌లో అతి భారీగా లబ్ది పొందింది పాక్ బ్యాటర్ మాజ్ సదాకత్. ఇతగాడు శ్రీలంకతో జరుగుతున్న సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫలితంగా ఏకంగా 187 స్థానాలు మెరుగుపర్చుకొని 45వ స్థానానికి ఎగబాకాడు.
బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టాప్ ప్లేస్‌ను నిలుపోగా.. ఆసీస్ స్పిన్నర్ జంపా, ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ తలో స్థానాన్ని మెరుగుపర్చుకొని రెండు, మూడు స్థానాలకు ఎగబాకారు.
బంగ్లాదేశ్ బౌలర్లు నసుమ్ అహ్మద్, మెహిది హసన్ తలో స్థానం మెరుగుపర్చుకొని 7, 8 స్థానాలకు ఎగబాకగా.. భారత బౌలర్లు అక్షర్ పటేల్ 2, బుమ్రా ఓ స్థానం కోల్పోయి 9, 11 స్థానాలకు పడిపోయారు. మరో టీమిండియా బౌలర్ మయాంక్ యాదవ్ 22 స్థానాలు ఎగబాకి 83వ స్థానానికి చేరాడు.
పాకిస్తాన్ బౌలర్ సల్మాన్ మీర్జా 9 స్థానాలు ఎగబాకి 14వ స్థానానికి, విండీస్ బౌలర్ ఛేజ్ 24 స్థానాలు ఎగబాకి 23వ స్థానానికి చేరారు.
ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో జింబాబ్వేకు చెందిన సికందర్ రజా, పాక్ సైమ్ అయూబ్ మొదటి రెండు స్థానాలను నిలుపుకోగా.. విండీస్ ఛేజ్ 2 స్థానాలు మెరుగుపర్చుకొని మూడో స్థానానికి చేరాడు.
ఇదీ చదవండి: పాకిస్తాన్ కెప్టెన్ ప్రపంచ రికార్డు


