breaking news
Zeeshan Ansari
-
IPL 2026: ‘సన్‌రైజర్స్‌కు అతడు దొరకడు.. ఈసారి..’
ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీని వదులుకుంది. రూ. 10 కోట్ల మొత్తానికి లక్నో సూపర్ జెయింట్స్‌కు అతడిని ట్రేడ్ చేసింది. అదే విధంగా.. ఏడుగురు ఆటగాళ్లను విడుదల చేసింది. ఫలితంగా వేలం కోసం సన్‌రైజర్స్ పర్సులో రూ. 25.50 కోట్లు మిగిలాయి.ఇక డిసెంబరు 16న అబుదాబిలో ఐపీఎల్ మినీ వేలం (IPL 2026 Auction) జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సన్‌రైజర్స్ యాజమాన్యానికి కీలక సూచనలు చేశాడు. బ్యాటింగ్ పరంగా జట్టు బాగుంటే చాలదని.. బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపాడు.బౌలింగ్ విభాగంపై శ్రద్ధ పెడితేనే..ఈ మేరకు యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరి మదిలోనూ ఒకే ప్రశ్న. బౌలింగ్ పరంగా సన్‌రైజర్స్ పరిస్థితి ఎలా ఉంది?.. ఈసారి వాళ్లు కచ్చితంగా తమ బౌలింగ్ విభాగంపై శ్రద్ధ పెట్టి పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది.బ్యాటింగ్‌లో వాళ్లకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్క సీజన్లో బాగా ఆడలేనంత మాత్రాన వాళ్ల బ్యాటింగ్ విభాగం చెత్తదేమీ అయిపోదు. అయితే, బౌలింగ్ పరంగా మాత్రం జట్టు బలహీనంగా ఉంది. నాకు తెలిసి వాళ్లు ఈసారి కామెరాన్ గ్రీన్ కోసం ప్రయత్నించవచ్చు.సన్‌రైజర్స్‌కు అతడు దొరకడుకానీ అతడు వాళ్లకు దొరకడనే అనిపిస్తోంది. సన్‌రైజర్స్‌కు ముందుగా నాణ్యమైన స్పిన్నర్ అవసరం ఉంది. ఆ జట్టులో స్పిన్నర్లు లేరు. జీషన్ అన్సారీ ఒక్కడే ఏం చేయగలడు? అతడికి తోడుగా మరికొంత మంది స్పిన్నర్లు కావాలి. నాకు తెలిసి ఆదిల్ రషీద్‌పై దృష్టి పెడతారేమో!వాళ్లకు ఇప్పుడు వికెట్లు తీయగల స్పిన్నర్ కావాలి. మూడు ఓవర్లలో 40 పరుగులు ఇచ్చినా కనీసం మూడు వికెట్లు తీసే స్పిన్ బౌలర్ కావాలి. అన్రిచ్ నోర్జే లాంటి ఫాస్ట్ బౌలర్ కూడా దొరికితే ఇంకా మంచిది’’ అని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు.వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ అట్టిపెట్టుకున్న ఆటగాళ్లు వీరేప్యాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్, స్మరణ్ రవిచంద్రన్, అనికేత్ వర్మ, జీషన్ అన్సారీ, హర్ష్ దూబే, కమిందు మెండిస్, ఇషాన్ మలింగ, బ్రైడన్ కార్స్. సన్‌రైజర్స్ రిలీజ్ చేసిన ప్లేయర్లురాహుల్ చహర్ (రూ. 3.20 కోట్లు), అభినవ్ మనోహర్ (రూ. 3.20 కోట్లు), ఆడం జంపా (రూ. 2.40 కోట్లు), ఆడం జంపా (రూ. 2.40 కోట్లు), సిమర్జీత్ సింగ్ (రూ. 1.50 కోట్లు), వియాన్ ముల్దర్ (రూ. 70 లక్షలు), అథర్వ టైడే (రూ. 30 లక్షలు), సచిన్ బేబి (రూ. 30 లక్షలు), మొహమ్మద్ షమీ (రూ. 10 కోట్లు- ట్రేడింగ్).చదవండి: IPL 2026: ‘కేకేఆర్ కాకపోతే.. ఇంకో జట్టుకు ఆడతా’ -
MI vs SRH: వాళ్లిద్దరి తప్పేమీ లేదు!.. క్లాసెన్ కొంపముంచాడు!
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klassen) ఓ పొరపాటు చేశాడు. అతడి తప్పిదం కారణంగా ముంబై ఓపెనర్ రియాన్ రికెల్టన్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. క్లాసెన్ తప్పు వల్ల లైఫ్ పొందిన అతడు తన స్కోరుకు మరో పది పరుగులు జతచేసి.. ముంబై విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.162 పరుగులుఅసలేం జరిగిందంటే.. ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా గురువారం ముంబై- హైదరాబాద్ (MI vs SRH) జట్లు తలపడ్డాయి. వాంఖడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య ముంబై ఇండియన్స్.. రైజర్స్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో కమిన్స్ బృందం 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది.సన్‌రైజర్స్ బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 40) టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. వికెట్ కీపర్ బ్యాటర్ క్లాసెన్ (28 బంతుల్లో 37) కూడా రాణించాడు. ఇక రైజర్స్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో ఓపెనర్ రోహిత్ శర్మ(16 బంతుల్లో 26) కమిన్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చిఇక మరో ఓపెనర్ రియాన్ రికెల్టన్ 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద.. జీషన్ అన్సారీ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో అతడు అవుటయ్యాడని భావించి మైదానం వీడే సమయానికి.. హై డ్రామా చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన ఫోర్త్ అంపైర్.. రికెల్టన్ పెవిలియన్‌కు వెళ్లకుండా ఆపేశాడు. జీషన్ వేసిన బంతిని నో బాల్‌గా ప్రకటించాడు.క్లాసెన్ చేసిన తప్పు వల్లనిజానికి రికెల్టన్ను అవుట్ చేసే విషయంలో బౌలర్‌గా జీషన్ అన్సారీ.. ఫీల్డర్‌గా క్యాచ్ అందుకోవడంలో కమిన్స్ ఎలాంటి పొరపాటు చేయలేదు. కానీ వికెట్ కీపర్ క్లాసెన్ చేసిన తప్పు వల్ల రికెల్టన్కు లైఫ్ వచ్చింది.కారణం ఇదేవిషయం ఏమిటంటే.. క్యాచ్‌ను అందుకునే లేదా స్టంపింగ్ ప్రయత్నంలో వికెట్ కీపర్ గ్లవ్స్ స్టంప్స్ ముందుకు రాకూడదు. ఇది అందరికీ తెలిసిన, చాలా కాలంగా అమల్లో ఉన్న నిబంధనే. కానీ గురువారం ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అన్సారీ వేసిన బంతిని రికెల్టన్ ఆడి కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చాడు.అయితే దీనిని ‘నోబాల్’గా ప్రకటిస్తూ అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించారు. రికెల్టన్ షాట్ ఆడక ముందే క్లాసెన్ గ్లవ్స్ ముందుకు రావడం ఇందుకు కారణం. ఇది ఐసీసీ నిబంధన 27.3.1కు విరుద్ధం. అందుకే అంపైర్లు నోబాల్ ఇచ్చారు. క్లాసెన్ కూడా తాను చేసిన తప్పును వెంటనే అంగీకరిస్తూ సైగ చేయడం గమనార్హం. వాంఖడేలో జయభేరిఇక ముంబై బ్యాటర్లలో రికెల్టన్ 31 పరుగులు చేయగా.. విల్ జాక్స్ (36), సూర్యకుమార్ యాదవ్ (26), తిలక్ వర్మ (21 నాటౌట్) రాణించారు. ఆఖర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (9 బంతుల్లో 21) మెరుపు ఇన్నింగ్స్ కారణంగా ముంబై మరో పదకొండు బంతులు ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. 18.1 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి పని పూర్తి చేసి.. నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.Applying the finishing touches 🤌🎥 #MI skipper Hardik Pandya gave them the final flourish with a brilliant cameo of 21(9)Scorecard ▶ https://t.co/8baZ67Y5A2#TATAIPL | #MIvSRH | @mipaltan | @hardikpandya7 pic.twitter.com/hPI3CxwzLF— IndianPremierLeague (@IPL) April 17, 2025ఐపీఎల్-2025: ముంబై వర్సెస్ హైదరాబాద్ స్కోర్లుహైదరాబాద్: 162/5 (20)ముంబై: 166/6 (18.1)ఫలితం: నాలుగు వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై ముంబై విజయం.చదవండి: నీతా అంబానీ దగ్గరికి వెళ్లిన ఇషాన్.. ప్రేమగా చెంప నిమిరిన మాజీ ఓనర్!


