పృథ్వీ షా అట్టర్ ప్లాప్‌.. అయినా జట్టు సంచలన విజయం | Maharashtra Clinches Thrilling Last-Ball Win Over Himachal Pradesh in SMAT 2026 | Sakshi
Sakshi News home page

పృథ్వీ షా అట్టర్ ప్లాప్‌.. అయినా జట్టు సంచలన విజయం

Nov 18 2026 3:44 PM | Updated on Nov 18 2026 3:48 PM

Maharashtra Clinches Thrilling Last-Ball Win Over Himachal Pradesh in SMAT 2026

PC: BCCI/ipl (ఢిల్లీ క్యాపిటల్స్‌ జెర్సీలో పృథ్వీ షా)

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026లో మహారాష్ట్ర ఎట్టకేలకు బోణీ కొట్టింది. బుధవారం న్యూ చండీగఢ్ వేదికగా హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఎలైట్ గ్రూప్-సి మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో మహారాష్ట్ర విజయం సాధించింది. చివరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఈ పోరులో ఆఖరి బంతికి మహారాష్ట్ర గట్టెక్కింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన హిమాచల్ ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఓపెనర్ ఏకాంత్ సేన్ (73 నాటౌట్; 55 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధశతకంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. మహారాష్ట్ర బౌలర్లలో విక్కీ ఓస్త్వాల్ (2/15), వివేక్ షెలార్ (2/32) తలో రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం 146 పరుగుల లక్ష్య ఛేదనలో మహారాష్ట్రకు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లోనే ఓపెనర్లు అర్షిన్ కులకర్ణి (0), కెప్టెన్ పృథ్వీ షా (1) వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడింది. ఈ సమయంలో సాహిల్ పరాఖ్ (35; 25 బంతుల్లో 6 ఫోర్లు), రుషికేశ్ సోనావనే (42; 33 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్‌కు 75 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.

అయితే వీరిద్దరూ ఔటయ్యాక హిమాచల్ బౌలర్ రోహిత్ కుమార్ (4/22) ధాటికి మహారాష్ట్ర వరుస వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. చివరి ఓవర్లో మహారాష్ట్ర విజయానికి 11 పరుగులు అవసరం కాగా.. ఆల్‌రౌండర్ విక్కీ ఓస్త్వాల్ (25 నాటౌట్; 18 బంతుల్లో 4 ఫోర్లు) మూడు బౌండరీలు బాది జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
చదవండి: IPL 2027: స‌న్‌రైజ‌ర్స్‌లోకి వెస్టిండీస్ విధ్వంస‌క‌ర వీరుడు! రూ.20 కోట్లు పలికినా రెడీ!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement