source: X
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ 2026లో భాగంగా ఇవాళ జరిగిన ఎలైట్ గ్రూప్-సి మ్యాచ్‌లో కేరళ, ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఓపెనర్ షేక్ రషీద్ (60), సీరమ్ వెంకట రాహుల్ (64) అర్ద సెంచరీలతో రాణించగా.. మారంరెడ్డి హేమంత్ రెడ్డి (32), అశ్విన్ హెబ్బర్ (37), కేఎస్ నరసింహ రాజు (20 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించారు. కెప్టెన్ రికీ భుయ్ (1), ప్రసాద్ (2), శశికాంత్(5) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కేరళ బౌలర్లలో నిధీశ్ 3, బిజు నారాయనణ్ 2, కార్తీక్ నాయర్, అబ్దుల్ బాసిత్ తలో వికెట్ తీశారు.
సంజూ శుభారంభం అందించినా..!
226 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేరళ ఓపెనర్, కెప్టెన్ సంజూ శాంసన్ (26) మెరుపు ఆరంభాన్ని అందించాడు. మధ్యలో అబ్దుల్ బాసిత్ (70 నాటౌట్) కూడా అద్భుతంగా రాణించాడు. అయినా మిగతా బ్యాటర్లు బంతులు వృధా చేయడంతో కేరళ లక్ష్యానికి 30 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆఖర్లో షరీఫుద్దీన్ సైతం (27 నాటౌట్) బ్యాట్ ఝులిపించినా ప్రయోజనం లేకుండా పోయింది.
ఇదీ చదవండి: రేపటి నుంచే ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ


