source: X
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్ కోసం 16 మంది సభ్యుల ఢిల్లీ జట్టును నిన్న ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ఆయుష్ బదోని ఎంపిక కాగా.. స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్‌కు చోటు దక్కలేదు. సెలెక్షన్‌కు అందుబాటులో ఉన్నా, పంత్‌ను ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశమైంది.
పంత్ పూర్తి సీజన్‌ను అందుబాటులో ఉండలేకపోయినా, కొన్ని మ్యాచ్‌లు అయినా అడే అవకాశం ఉంటుంది. అయినా సెలెక్టర్లు అతన్ని పట్టించుకోలేదు. పంత్ గత రంజీ సీజన్‌లోనూ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. దానికి ముందు సీజన్‌లో కూడా ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆడాడు.
ఇరానీ కప్‌లో పంత్ రెస్ట్ ఆఫ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. రంజీ ట్రోఫీలోనూ ఆడతాడనే అంచనాలు నెలకొన్నాయి. అయితే సెలెక్టర్లు అతన్ని పట్టించుకోకపోవడం అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ప్రస్తుతం పంత్ భారత జట్టు మూడు ఫార్మాట్లలో సభ్యుడిగా లేడు. అతడు కేవలం టెస్ట్ జట్టులో మాత్రమే కొనసాగుతున్నాడు. భారత్ నవంబర్ 19 నుంచి న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది. దీనికి ముందు పంత్ రంజీల్లో ఆడితే జట్టుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయినా ఢిల్లీ క్రికెట్ బోర్డు సెలెక్టర్లు పంత్‌ను రంజీ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ ఆడేందుకు కూడా ఎంపిక చేయలేదు.
కెప్టెన్‌గా ఆయుష్ బదోనీ
గత సీజన్‌లో ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరించిన ఆయుష్ బదోనీనే ఈసారి కూడా జట్టు సారథిగా కొనసాగనున్నాడు. యశ్ ధుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ప్రధాన వికెట్ కీపర్‌గా అనుజ్ రావత్ ఎంపికయ్యాడు. గత సీజన్‌లో ఢిల్లీ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆయుష్ దోసేజా, సనత్ సంగ్వాన్ కూడా తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.
రంజీ ట్రోఫీ 2026-27 కోసం ఢిల్లీ జట్టు
ఆయుష్ బదోనీ (కెప్టెన్), యశ్ ధుల్ (వైస్ కెప్టెన్), సనత్ సంగ్వాన్, అనుజ్ రావత్ (వికెట్ కీపర్), ఆయుష్ దోసేజా, దేవ్ లక్రా, హృతిక్ షోకీన్, దివిజ్ మెహ్రా, మనీ గ్రేవాల్, సిమర్జీత్ సింగ్, నవదీప్ సైని, ప్రణవ్ రాజ్వంశీ, సార్థక్ రంజన్, ధ్రువ్ కౌశిక్, సుమిత్ మాథుర్, తేజస్వి దహియా.
బెంగాల్‌తో తొలి మ్యాచ్
2026-27 సీజన్‌లో ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌ను బెంగాల్‌తో ఆడనుంది. అక్టోబర్ 11న కల్యాణిలోని బెంగాల్ క్రికెట్ అకాడమీ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. ఎంపికైన ఆటగాళ్లందరూ అక్టోబర్ 4న ఉదయం 8 గంటలకు అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రధాన కోచ్‌కు రిపోర్ట్ చేయాలని ఢిల్లీ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదీ చదవండి: విండీస్ చేతిలో ఓటమి అనంతరం గిల్ స్పందన ఇదే..!


