breaking news
Smaran Ravichandran
-
రాహుల్ విఫలమైనా.. సన్‌రైజర్స్ ప్లేయర్ వీరోచిత సెంచరీ
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్లో విజయవాడ వేదికగా ఆంధ్ర జట్టుతో జరుగుతున్న ఎలైట్ గ్రూప్-బి మ్యాచ్‌లో కర్ణాటక కెప్టెన్, ఎస్ఆర్హెచ్ ప్లేయర్ స్మరణ్ రవిచంద్రన్ వీరోచిత సెంచరీతో చెలరేగాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటకకు ఆంధ్ర బౌలర్లు ఊహించని షాకిచ్చారు. ఆంధ్ర బౌలర్ల దెబ్బకు కర్ణాటక కేవలం 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్ వంటి స్టార్ ప్లేయర్లు సైతం సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. ఈ సన్‌రైజర్స్ బ్యాటర్ ఆచితూచి ఆడుతూ వికెట్ కీపర్ కృష్ణన్ శ్రీజిత్ (58)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ క్రమంలో స్మరణ్ తన 8వ ఫస్ట్ క్లాస్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.స్మరణ్ 108 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 74 ఓవర్లు ముగిసే సరికి కర్ణాటక 8 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆంధ్ర బౌలర్లలో కావూరి సాయితేజ, శశికాంత్, సౌరభ్ కుమార్ తలా రెండు వికెట్లు సాధించారు.తుది జట్లుకర్ణాటక: మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్, రితేష్ భత్కల్, కరుణ్ నాయర్, స్మరణ్ రవిచంద్రన్ (కెప్టెన్), అనీష్ కెవి, కృష్ణన్ శ్రీజిత్ (వికెట్ కీపర్), మాధవ్ బజాజ్, శిఖర్ శెట్టి, అభిలాష్ శెట్టి, మన్వంత్ కుమార్ ఎల్ఆంధ్రా: అభిషేక్ రెడ్డి, రికీ భుయ్ (కెప్టెన్), రేవంత్ రెడ్డి (వికెట్‌కీపర్), షేక్ రషీద్, మారంరెడ్డి హేమంత్ రెడ్డి, సీరం వెంకట రాహుల్, కెవి శశికాంత్, సౌరభ్ కుమార్, త్రిపురాన విజయ్, లలిత్ మోహన్, కావూరి సాయితేజ -
సెంచరీతో కదంతొక్కిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్
జమ్మూ కశ్మీర్‌తో జరుగుతున్న ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ స్మరణ్ రవిచంద్రన్ సెంచరీతో (126 నాటౌట్) కదంతొక్కాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతడు ఈ ఫీట్‌ను సాధించాడు. ఫలితంగా రెస్ట్ ఆఫ్ ఇండియా గౌరవప్రదమైన స్కోర్ దిశగా సాగుతూ, 265 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది.మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెస్ట్ ఆఫ్ ఇండియా 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. స్మరణ్ రవిచంద్రన్‌తో పాటు ముకేశ్ చౌదరి (9) క్రీజ్‌లో ఉన్నాడు. రెస్ట్ ఆఫ్ ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో స్మరణ్‌తో పాటు సనత్ సాంగ్వాన్ (55) మాత్రమే రాణించాడు.అంతకుముందు జమ్మూ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్‌లో 278 పరుగులకే ఆలౌటైంది. పరాస్ డోగ్రా (75), అబ్దుల్ సమద్ (57), లోన్ నసిర్ ముజఫర్ (64) అర్ద సెంచరీలతో రాణించడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ముకేశ్ చౌదరి (5-78) అద్భుతమైన బౌలింగ్‌తో జమ్మూ పతనాన్ని శాశించాడు. ఆకాశ్‌దీప్ 3, ముకేశ్ కుమార్ 2 వికెట్లు తీశారు.దీనికి ముందు రెస్ట్ ఆఫ్ ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులకే ఆలౌటైంది. వారి ఇన్నింగ్స్‌లో శిఖర్ మోహన్ (60), స్మరణ్ రవిచంద్రన్ (68) మాత్రమే రాణించారు. జమ్మూ బౌలర్లు తలో చేయి వేసి రెస్ట్ ఆఫ్ ఇండియా పతనాన్ని శాశించారు. కాగా, రంజీ ఛాంపియన్ అయిన జమ్మూ కశ్మీర్ ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాతో తలపడుతుంది. ఇదీ చదవండి: జట్టు ప్రకటన.. రిషబ్ పంత్‌కు నో ప్లేస్ -
కెప్టెన్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్.. కేఎల్ రాహుల్‌కు చోటు
రంజీ ట్రోఫీ 2026-27 సీజన్లో తమ తొలి మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) ప్రకటించింది. ఈ జట్టు కెప్టెన్‌గా సన్‌రైజర్స్ ఆటగాడు, కర్ణాటక సూపర్ స్టార్ స్మరణ్ రవిచంద్రన్ ఎంపికయ్యాడు. మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికి సెలక్టర్లు మత్రం స్మరణ్‌కు జట్టు పగ్గాలను అప్పగించారు. గత సీజన్లో రవిచంద్రన్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. నాలుగు సెంచరీలతో సహా మొత్తం 950 పరుగులు లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే అతడిని కెప్టెన్‌గా నియమించారు. కాగా ఈ జట్టులో టీమిండియా స్టార్ ప్లేయర్లు కేఎల్ రాహుల్, ప్రసిద్ద్ కృష్ణలకు చోటు దక్కింది. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు సన్నాహకాల్లో భాగంగా వీరిద్దరూ రంజీ ట్రోఫీలో ఆడనున్నారు. ప్రసిద్ద్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నప్పటికి అక్టోబర్ 11న ఆంధ్రతో ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ సమయానికి కోలుకుంటాడని సెలక్టర్లు భావిస్తున్నారు. కాగా ఆంధ్రతో మ్యాచ్‌తో మరో కర్ణాటక సూపర్ స్టార్ దేవ్‌దత్ పడిక్కల్ మాత్రం అందుబాటులో లేడు. అతడు ఇండియా-ఎ జట్టులో భాగం కావడంతో ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.కర్ణాటక రంజీ ట్రోఫీ జట్టుస్మరణ్ రవిచంద్రన్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్, అనీశ్వర్ గౌతమ్, కరుణ్ నాయర్, అనీష్ కెవి, శ్రేయాస్ గోపాల్, కృతిక్ కృష్ణ (వికెట్ కీపర్), శ్రీఖర్ శెట్టి, ప్రసిద్ధ్ కృష్ణ, అభిలాష్ శెట్టి, మన్వంత్ కుమార్, ఎల్ఆర్ కుమార్, రితేష్ భత్కల్, కెఎల్ శ్రీజిత్చదవండి: IND vs WI: 'అతడికి వన్డేలు సెట్ కావు.. టెస్టుల్లో ఆడించండి' -
పంత్ అట్టర్ ఫ్లాప్.. 237 పరుగులకు ఆలౌట్
ఇరానీ కప్-2026 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ రిషభ్ పంత్ తీవ్రంగా నిరాశపరిచాడు. రెస్టాఫ్ ఇండియా జట్టు కెప్టెన్‌గా బరిలోకి దిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ పట్టుమని పది పరుగులే చేసి పెవిలియన్ చేరాడు.శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ స్టేడియంలో రెస్టాఫ్ ఇండియా- రంజీ తాజా చాంపియన్ జమ్మూ కశ్మీర్ జట్ల మధ్య గురువారం ఇరానీ కప్ మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య జమ్మూ జట్టు.. తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన రెస్టాఫ్ ఇండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ సనత్ సాంగ్వాన్ (1), వన్‌డౌన్ బ్యాటర్ సుదీప్ కుమార్ ఘరామి (8) సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు.Maiden first-class wicket ☝️🎥 All smiles for Lone Nasir who picks up the big wicket of Sudip Gharami 👏#IraniCup | @mflone_ pic.twitter.com/xZQc6GTiBF— BCCI Domestic (@BCCIdomestic) October 1, 2026ఇలాంటి తరుణంలో టీమిండియా స్టార్ సర్ఫరాజ్ ఖాన్ (97 బంతుల్లో 45) మెరుగైన ప్రదర్శనతో ఇన్నింగ్స్ గాడిన పెట్టగా.. రిషభ్ పంత్ మాత్రం (36 బంతుల్లో 10) విఫలమయ్యాడు. ఇక సర్ఫరాజ్‌కు తోడుగా స్మరణ్ రవిచంద్రన్ అర్ధ శతకం (83 బంతుల్లో 68)తో రాణించాడు.మిగిలిన వారిలో ఆకాశ్ దీప్ చెప్పుకోదగ్గ స్కోరు (22) చేశాడు. ఫలితంగా రెస్టాఫ్ ఇండియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 237 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జమ్మూ కశ్మీర్ బౌలర్లలో సునిల్ కుమార్, లోనే నాసిర్ ముజాఫర్ మూడేసి వికెట్లు కూల్చగా.. ఉమర్ నాజిర్ మిర్ రెండు, అబిద్ ముస్తాక్, సాహిల్ లోత్రా తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.ఇక తొలి రోజు ఆటలోనే బ్యాటింగ్ మొదలుపెట్టిన జమ్మూ జట్టు.. గురువారం ఆట పూర్తయ్యేసరికి ఏడు ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది. ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ 12, శుభం ఖజూరియా సున్నా పరుగులతో ఉన్నారు.చదవండి: ఇదేమీ అంత ఈజీ కాదు: గంభీర్‌కు విరుద్ధంగా గిల్ కామెంట్లు -
టీమిండియావైపు దూసుకొస్తున్న కర్ణాటక యువ సంచలనం
భారత దేశవాలీ క్రికెట్లో ప్రస్తుతం స్మరణ్ రవిచంద్రన్ అనే పేరు మార్మోగిపోతుంది. 22 ఏళ్ల ఈ కర్ణాటక యువ బ్యాటర్ ఫార్మాట్లకతీతంగా వరుస సెంచరీలు, డబుల్ సెంచరీలతో చెలరేగిపోతూ భారత క్రికెట్లో పెను సంచలనంగా మారాడు. ఎడమ చేతి వాటం అటాకింగ్ మిడిల్డార్ బ్యాటర్ అయిన స్మరణ్.. ప్రస్తుత రంజీ సీజన్లో ఆకాశమే హద్దుగా విజృంభిస్తున్నాడు.13 ఇన్నింగ్స్‌ల్లో 2 డబుల్ సెంచరీలు, 2 సెంచరీలు, 3 అర్ద సెంచరీల సాయంతో 950 పరుగులు (95 సగటున) చేసిన స్మరణ్.. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో ఢిల్లీ బ్యాటర్ ఆయుశ్ దొసేజాను (949 పరుగులు) అధిగమించాడు. స్మరణ్ భీకర ఫామ్ చూసి సహచర క్రికెటర్లు అవాక్కవుతున్నారు. విశ్లేషకులు సైతం అబ్బురపడుతున్నారు.ట్విన్ సెంచరీస్ప్రస్తుతం ఉత్తరాండ్‌తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో స్మరణ్ ఉగ్రరూపం దాల్చాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు (135, 127) చేసి భీకర ఫామ్‌ను కొనసాగించాడు. స్మరణ్ సహా దేవదత్ పడిక్కల్ (232), కేఎల్ రాహుల్ (141, 70 నాటౌట్) శివాలెత్తడంతో ఈ మ్యాచ్‌లో కర్ణాటక బంపర్ విక్టరీ దిశగా సాగుతోంది. మొత్తం 3 డబుల్ సెంచరీలు, 3 సెంచరీలుతాజా ప్రదర్శనతో స్మరణ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 1500 పరుగుల మైలురాయిని దాటాడు. 25 ఇన్నింగ్స్‌ల స్వల్ప కెరీర్లో 3 డబుల్ సెంచరీలు, 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీల సాయంతో 1500 పరుగుల మార్కును క్రాస్ చేశాడు. అతని కెరీర్ సగటు 72కు పైగా ఉండటం విశేషం.లిస్ట్-ఏ క్రికెట్లోనూ తిరుగలేని మొనగాడే..!స్మరణ్ సెంచరీల మోత, పరుగుల ప్రవాహం ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ మైసూరు కుర్రాడు లిస్ట్-ఏ క్రికెట్లోనూ అదరగొడుతున్నాడు. ఇటీవల (2024-25) కర్ణాటక విజయ్ హజారే వన్డే ట్రోఫీ సాధించడంలో స్మరణ్ అత్యంత కీలకపాత్ర పోషించాడు. సెమీఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీతో (76) పాటు, ఫైనల్లో మెరుపు సెంచరీ (101) చేసి తన జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. లిస్ట్-ఏ ఫార్మాట్లో మొత్తం 14 ఇన్నింగ్స్‌లు ఆడిన స్మరణ్ 96.48 స్ట్రయిక్‌రేట్‌తో 50కి పైగా సగటున 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 604 పరుగులు చేశాడు.పొట్టి ఫార్మాట్లోనూ పర్వాలేదుఫస్ట్క్లాస్, లిస్ట్-ఏ ఫార్మాట్లతో పోలిస్తే స్మరణ్ టీ20 ఫార్మాట్ రికార్డు ఓ మోస్తరుగా ఉంది. పొట్టి ఫార్మాట్లో స్మరణ్ 13 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసి 162.45 స్ట్రయిక్‌రేట్‌తో 3 అర్ద సెంచరీల సాయంతో 489 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.బౌలింగ్‌లోనూ మెరిపిస్తాడుస్మరణ్ విధ్వంసకర బ్యాటింగ్‌తో మాత్రమే కాకుండా బౌలింగ్‌లోనూ మెరిపించగల సమర్దుడు. కుడి చేతి ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసే స్మరణ్ కీలక సమయాల్లో బంతితోనూ మ్యాజిక్ చేయగలడు. లోకల్ క్రికెట్లో అతను బౌలింగ్‌లోనూ ప్రూవ్ చేసుకున్నాడు.అనుకోకుండా వచ్చిన ఐపీఎల్ అవకాశంస్మరణ్కు ఐపీఎల్ 2025లో ఊహించని విధంగా అవకాశం వచ్చింది. ఆసీస్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా గాయపడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్మరణ్‌కు అక్కున చేర్చుకుంది (30 లక్షలు). అయితే స్మరణ్‌కు ఆ సీజన్లో అవకాశాలు దక్కలేదు. స్మరణ్‌పై భారీ అంచనాలు ఉన్న ఎస్ఆర్హెచ్ అతన్ని 2026 సీజన్‌కు కూడా రీటైన్ చేసుకుంది. ఈ ఐపీఎల్ సీజన్లో స్మరణ్‌కు అవకాశం దొరికి ఇదే తరహాలో చెలరేగితే, త్వరలోనే టీమిండియా తలుపులు తట్టడం ఖాయమని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు.


