‘అతడొక సాధారణ ప్లేయర్‌.. సీఎస్‌కే డీల్‌ నచ్చలేదు’ | Kris Srikanth-Takes-Jack Edwards-Ordinary-Bowler-CSK Deal-Not-Much-Great | Sakshi
Sakshi News home page

‘అతడొక సాధారణ ప్లేయర్‌.. సీఎస్‌కే డీల్‌ నచ్చలేదు’

Nov 6 2026 7:20 AM | Updated on Nov 6 2026 8:35 AM

Kris Srikanth-Takes-Jack Edwards-Ordinary-Bowler-CSK Deal-Not-Much-Great

Photo Credit: Twitter

ఐపీఎల్ 2027 వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆటగాళ్ల మధ్య జరిగిన ట్రేడింగ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఆసీస్ ఆల్‌రౌండర్ జాక్ ఎడ్‌వర్డ్స్‌ను సీఎస్‌కే ట్రేడింగ్‌లో దక్కించుకోవడాన్ని తప్పుబట్టాడు. 

జాక్ ఎడ్‌వర్డ్స్ ఒక సాధారణ ఆటగాడని, అతడి గణాంకాలు కూడా అంత గొప్పగా ఏం లేవని, చెన్నై అతడిని ఎందుకు తీసుకుందో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఐపీఎల్‌లో ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఆడని జాక్ ఎడ్‌వర్డ్స్‌ను ఎస్‌ఆర్‌హెచ్ నుంచి రూ.3 కోట్లకు కొనుగోలు చేయడం తనకు నచ్చలేదని తెలిపాడు. 

ఖలీల్ అహ్మద్‌ను సీఎస్‌కే వదులుకోవడం పట్ల తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఎందుకంటే అతనేమీ గొప్ప ఆటగాడు కాదని అభిప్రాయపడ్డాడు. ఈ ట్రేడింగ్ వల్ల చెన్నై సూపర్ కింగ్స్ కంటే ఎస్‌ఆర్‌హెచ్‌కే ఎక్కువ లాభం చేకూరినట్లుగా తనకు అనిపిస్తోందని పేర్కొన్నాడు.

ఇక జాక్ ఎడ్‌వర్డ్స్‌తో పాటు లియామ్ లివింగ్‌స్టోన్‌ను ట్రేడింగ్ చేసుకోవడం సీఎస్‌కేకు మంచిదే అయినప్పటికీ, తుదిజట్టులో అతడిని ఎక్కడ ఆడిస్తారనేది ప్రశ్నార్థకంగా మారిందన్నాడు. వ్యక్తిగతంగా చూసుకుంటే లివింగ్‌స్టోన్ ప్రమాదకర బ్యాటర్ కావడంతో సీఎస్‌కే అతడిని ఉపయోగించుకుంటుందని తాను అనుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. సీఎస్‌కేకు పెద్దగా ఉపయోగపడని మాథ్యూ షార్ట్‌ను వదిలేసుకొని అతడి స్థానంలో లివింగ్‌స్టోన్‌ను తీసుకోవాల్సిందని వెల్లడించాడు.

సీఎస్‌కేకు ట్రేడ్ అయిన ఆటగాళ్లు: లియామ్ లివింగ్‌స్టోన్ (రూ. 6 కోట్లు), జాక్ ఎడ్వర్డ్స్ (రూ. 3 కోట్లు)
ఎస్‌ఆర్‌హెచ్‌కు ట్రేడ్ అయిన ఆటగాళ్లు: ఖలీల్ అహ్మద్ (రూ. 4.8 కోట్లు), నాథన్ ఎల్లిస్ (రూ. 2 కోట్లు)

ఇక 26 ఏళ్ల ఆస్ట్రేలియా పేస్-బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన జాక్ ఎడ్వర్డ్స్ బిగ్ బాష్ లీగ్ (BBL)లో సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇతనిని రూ. 3 కోట్లకు కొనుగోలు చేసినప్పటికీ, పాదాల గాయం కారణంగా అతను ఆ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అతను ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పుడు ట్రేడింగ్ ద్వారా నేరుగా సీఎస్‌కే గూటికి చేరుకున్నాడు.

ఇదీ చదవండి: IPL 2027: రూ.7 కోట్ల న‌ష్టంతో సీఎస్‌కేలోకి విధ్వంస‌క‌ర ప్లేయ‌ర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement