అర్థ‌శ‌త‌కాల‌తో చెల‌రేగిన బ్యాట‌ర్లు.. కోలుకున్న విండీస్‌ | West Indies Batters-Half-Centuries-Vs Bangladesh-2nd-Test-Sylhet | Sakshi
Sakshi News home page

అర్థ‌శ‌త‌కాల‌తో చెల‌రేగిన బ్యాట‌ర్లు.. కోలుకున్న విండీస్‌

Nov 5 2026 1:38 PM | Updated on Nov 5 2026 1:49 PM

West Indies Batters-Half-Centuries-Vs Bangladesh-2nd-Test-Sylhet

Photo Credit: Twitter

సిల్హెట్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో ప్రారంభ‌మైన రెండో టెస్టులో వెస్టిండీస్ కోలుకుంది. 27 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన విండీస్ జ‌ట్టును మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్లు ఆదుకున్నారు. కెవిన్ విక్‌హ‌మ్ (61), వికెట్ కీప‌ర్ అమీర్ జాంగో (76 నాటౌట్‌) అజేయ అర్థ‌శ‌త‌కాల‌తో చెల‌రేగ‌డంతో వెస్టిండీస్ 55 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 180 ప‌రుగులు చేసింది. 

ఈ ఇద్ద‌రు నాలుగో వికెట్‌కు అజేయంగా 127 ప‌రుగులు జోడించారు. బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌లో త‌స్కిన్ అహ్మ‌ద్ రెండు వికెట్లు తీయ‌గా, హ‌స‌న్ మ‌హ్ముద్ ఒక వికెట్ తీశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (9), జోషువా దసిల్వా (12) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. ఆ తర్వాత వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కవెమ్ హడ్జ్ (1) నిరాశపరిచాడు.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన అమీర్ జాంగో, కెవిన్ విక్‌హ‌మ్ నిల‌క‌డ‌గా ఆడారు. ముఖ్యంగా డెబ్యూ మ్యాచ్ ఆడుతున్న‌ కెవిన్ విక్‌హ‌మ్ ఓపిక‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ప‌రుగులు రాబ‌ట్టాడు. ఈ క్ర‌మంలోనే విండీస్ డెబ్యూ మ్యాచ్‌లో అర్థ‌సెంచ‌రీ చేసిన బ్యాట‌ర్ల జాబితాలో కెవిన్ విక్‌హ‌మ్ చోటు సంపాదించాడు. మ‌రోవైపు జాంగో కూడా ఫిఫ్టీ చేయ‌డంతో విండీస్ కోలుకుంది.

మ్యాచ్‌లో వెస్టిండీస్ రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. వైర‌ల్ జ్వ‌రంతో బాధ‌ప‌డుతున్న జాన్ కాంప్‌బెల్‌, ట‌గ్‌న‌రైన్ చంద్రపాల్‌లు దూర‌మ‌వ్వ‌గా, వీరి స్థానాల్లో జోషువా ద సిల్వా, కెవిన్ విక్‌హ‌మ్ జ‌ట్టులోకి వ‌చ్చారు. కాగా కెవిన్ విక్‌హ‌మ్‌కు ఇదే తొలి మ్యాచ్‌. 

మ‌రోవైపు బంగ్లాదేశ్‌ కూడా రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. మోమినుల్ హ‌క్ స్థానంలో ముష్ఫిక‌ర్ ర‌హీమ్ రాగా, షోరిఫుల్ ఇస్లామ్ స్థానంలో త‌స్కిన్ అహ్మ‌ద్ తుదిజ‌ట్టులోకి వ‌చ్చిన‌ట్లు కెప్టెన్ న‌జ్ముల్ షాంటో తెలిపాడు. తొలి టెస్టులో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

ఇదీ చదవండి:  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement