వెస్టిండీస్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ కేవలం 29 ఏళ్ల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి అందరిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. అయితే పూరన్ ఇప్పుడు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. మళ్లీ జాతీయ జట్టులోకి తిరిగి వచ్చేందుకు ఛాన్స్ ఉందని పూరన్ తాజాగా సంకేతాలిచ్చాడు.
పూరన్ ఇటీవల ‘నిక్కీ పీ బ్యాటింగ్ అకాడమీ’ ప్రారంభోత్సవంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడికి తన రిటైర్మెంట్ యూటర్న్ గురుంచి ప్రశ్న ఎదురైంది. అయితే షాయ్ హోప్ నాయకత్వంలోని వెస్టిండీస్ జట్టు తరఫున మళ్లీ ఆడే అవకాశంపై పూరన్ సానుకూలంగా స్పందించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చేందుకు ఇంకా తలపులు తెరిచే ఉన్నాయి. కాలా చాలా వేగంగా మారుతుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం నా దృష్టి అంతా అకాడమీలో యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంపైనే ఉంది అని పూరన్ పేర్కొన్నాడు.
అదేవిధంగా యువ క్రీడకారులను ఉద్దేశించి మాట్లడుతూ.. ఒక అథ్లెట్‌గా ప్రతికూల పరిస్థితులను సాకులుగా చూపకూడదని, మైదానంలో దిగిన ప్రతీసారి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించాలని పూరన్ సూచించాడు.
కాగా పూరన్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో అతడు సభ్యునిగా ఉన్నాడు. అయితే కరేబియన్ క్రికెటర్‌కు వైట్‌బాల్ క్రికెట్‌లో అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. పూరన్ విండీస్ తరపున 61 వన్డేలలో 39.66 సగటుతో 1983 పరుగులు చేశాడు.
ఇందులో మూడు సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా 106 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 136.39 స్ట్రైక్ రేటుతో 2275 పరుగులు చేశాడు. అలాగే విండీస్ టీ20 జట్టుకు అతడు నాయకత్వం కూడా వహించాడు.


