ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌గా అశుతోష్‌ దీక్షిత్‌  | Air Chief Marshal Ashutosh Dixit takes charge as 29th Chief of Air Staff | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌గా అశుతోష్‌ దీక్షిత్‌ 

Nov 1 2026 6:02 AM | Updated on Nov 1 2026 6:02 AM

Air Chief Marshal Ashutosh Dixit takes charge as 29th Chief of Air Staff

ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎ.పి.సింగ్‌ పదవీ విరమణ

న్యూఢిల్లీ: భారత వైమానిక దళం 29వ చీఫ్‌గా ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అశుతోష్‌ దీక్షిత్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆపరేషన్‌ సింధూర్‌లో కీలకపాత్ర పోషించిన ఈయన 42 ఏళ్ల సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ చేసిన ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎ.పి.సింగ్‌ స్థానాన్ని భర్తీ చేయనున్నారు. 

న్యూఢిల్లీలోని రేస్‌ కోర్స్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో వైమానిక దళం ఎ.పి. సింగ్‌కు గౌరవ వందనంతో వీడ్కోలు పలికిన తరువాత అశుతోష్‌ దీక్షిత్‌ బాధ్యతలు స్వీకరించారు. ఫైటర్‌పైలట్‌గా విస్తారమైన అనుభవం కలిగిన అశుతోష్‌ దీక్షిత్‌ 20 రకాల విమానాలను దాదాపు 3,500 గంటలకు పైగా నడిపారు. భారత వాయుసేన సమర్థతకు, పోరాటపటిమకు, వ్యూహరచన నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచే ఆపరేషన్‌ సింధూర్‌ ఎ.పి.సింగ్‌ నేతృత్వంలోనే నిర్వహించిన విషయం తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement