ధురి నుంచే మళ్లీ సీఎం మాన్ పోటీ ∙ మొత్తం 40 మంది సిట్టింగ్‌లకు అవకాశం
ఛండీగఢ్: 2027లో పంజాబ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికలకు గాను అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)శనివారం మొదటి జాబితా విడుదల చేసింది. సీఎం భగవంత్ సింగ్ మాన్ సహా 40 మంది సిట్టింగ్‌లకు ఇందులో చోటు కల్పించింది. సీఎం మాన్ మరోసారి ధురి నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే ఎన్నికలకు గాను అభ్యర్థులను మొదటగా ప్రకటించిన ప్రధాన పార్టీ ఆప్ కావడం గమనార్హం. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) భేటీ అనంతరం సీఎం మాన్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.
మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన మాన్‌కు మళ్లీ ధురి నియోజకవర్గం నుంచే అవకాశం కల్పిస్తున్నట్లు అందులో ఉంది. కాగా, జీఎస్‌టీ మోసం మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న కేబినెట్ మంత్రి సంజీవ్ అరోరా పేరు కూడా ఇందులో ఉంది. ఈయనకు లుధియానా వెస్ట్ కేటాయించింది. జాబితాలో అరోరా మినహా మంత్రివర్గంలోని ఇతరులకు చోటు దక్కలేదు. అసెంబ్లీ స్పీకర్, రెండుసార్లు ఎమ్మెల్యే అయిన కుల్తార్ సింగ్ సంధ్వాన్ కొట్కాపుర, డిప్యూటీ స్పీకర్ జై క్రిషన్ సింగ్ రౌరికి గర్హ్‌శంకర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించారు. ముగ్గురు మాజీ మంత్రులకు సైతం జాబితాలో అవకాశమిచ్చారు. పార్టీ అభ్యర్థులకు ఆప్ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎక్స్ వేదికగా అభినందనలు తెలిపారు.


