కాస్తంత కునుకు జ్ఞాపకశక్తికి మేలు! | Afternoon Sleep May Help Keep Your Brain | Sakshi
Sakshi News home page

కాస్తంత కునుకు జ్ఞాపకశక్తికి మేలు!

Nov 1 2026 4:59 AM | Updated on Nov 1 2026 4:59 AM

Afternoon Sleep May Help Keep Your Brain

రాత్రంతా నిద్ర లేకపోతే మెదడు మొద్దుబారినట్టుగా అనిపించవచ్చు. నిద్ర­లేమి వల్ల మెదడుపై పడే దుష్ప్రభావా­లను కొంతవరకు తగ్గించడానికి కాసేపు వ్యాయామం లేదా కునుకు తీయడం వల్ల జ్ఞాపకశక్తికి కొంత మేలు జరుగుతుందని కెనడాలో నిర్వహించిన ఓ అధ్యయనం సూచిస్తోంది. నిద్ర సరిగా లేకపోతే కొత్త విషయాలను గుర్తుంచుకునే మెదడు సామర్థ్యం దెబ్బతింటుంది. ఆలోచించడం, ప్రణాళికలు వేసుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి పనులకు ఈ జ్ఞాపకశక్తి చాలా అవసరం. నిద్రలేమి ఆ జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తుంది.

ఈ అధ్యయనంలో 54 మంది ఆరోగ్యవంతులైన యువకులు పాల్గొన్నారు. వీరిని ప్రయోగశాలలో పరిశోధకుల పర్యవేక్షణలో 30 గంటల పాటు నిద్రపోకుండా ఉంచారు. ఆ తర్వాత కొందరితో 20 నిమిషాల పాటు సైక్లింగ్‌ చేయించారు. మరికొందరిని 90 నిమిషాలపాటు కునుకు తీయనిచ్చారు. ఇంకొందరిని విశ్రాంతి తీసుకోమన్నారు. వ్యాయామం చేసినవారు, కాసేపు నిద్రపోయినవారు,... ఈ రెండూ చేయనివారితో పోలిస్తే జ్ఞాపకశక్తి పరీక్షల్లో 22 శాతం మెరుగైన ఫలితాలు సాధించినట్లు పరిశోధకులు గుర్తించారు.

ఇలా వ్యాయామం, నిద్ర.. ఈ రెండూ మెదడుకు వేర్వేరు విధాలుగా మేలు చేస్తున్నట్లు కనిపించింది. కాసేపు నిద్రపోవడం వల్ల మెదడుకు తిరిగి శక్తి లభించి, కొత్త సమాచారాన్ని స్వీకరించి, గుర్తుంచుకోవడానికి సిద్ధమవుతున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. వ్యాయామం వల్ల అలసట మరింత పెరగకుండానే, మెదడులో మిగిలి ఉన్న వనరులనూ మరింత సమర్థంగా ఉపయోగించుకునే వీలు కలుగుతున్నట్లు గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement