‘సింగూరు’ తాగునీటి అవసరాలకు రూ.120 కోట్లు | Telangana sanctions Rs 120 crore for Singur drinking water arrangements | Sakshi
Sakshi News home page

‘సింగూరు’ తాగునీటి అవసరాలకు రూ.120 కోట్లు

Nov 1 2026 4:52 AM | Updated on Nov 1 2026 4:52 AM

Telangana sanctions Rs 120 crore for Singur drinking water arrangements

ఇతర జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధులు

ఇంజనీర్లతో టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి సీతక్క 

సాక్షి, హైదరాబాద్‌: ఎల్‌నినో వల్ల ఏర్పడిన తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులను మంజూరు చేసిందని మంత్రి సీతక్క తెలిపారు. శనివారం ఉదయం మిషన్‌ భగీరథ, పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీర్లతో మంత్రి సీతక్క టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి అవసరాల కోసం రూ.120 కోట్లు, ఇతర జిల్లాల్లో తక్షణ అవసరాల కోసం రూ.కోటి చొప్పున ప్రభుత్వం ఆమోదించిందని.. నీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాల్లో స్థానిక వనరులు  చేతిపంపులు, అవసరమైన చోట బోరుబావులను అద్దెకు తీసుకోవడం, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

మిషన్‌ భగీ రథ సరఫరాలో అంతరాయం కలిగే గ్రామాలు, భూగర్భ జలాలు అడు గంటిన ప్రాంతాలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

 మహిళా సంఘాలకు మిల్లెట్‌ కేఫ్‌లతో ఉపాధి
సాక్షి, హైదరాబాద్‌: చిరుధాన్యాలతో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడంతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మిల్లెట్‌ కేఫ్‌లను ఏర్పాటు చేస్తోంది.

సెర్ప్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతాల్లో వీటిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీఆర్‌కేఆర్‌ భవన్, ఇందిరా మహిళా శక్తి బజార్, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ క్యాంపస్, యాదగిరిగుట్టలో నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. నాలుగు ప్రాంతాల్లో త్వరలోనే కేఫ్‌లను ప్రారంభించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ ఐదు కేఫ్‌ల ఏర్పాటుకు మొత్తం రూ.2.2 కోట్ల పెట్టుబడిని సెర్ప్‌ అధికారులు ప్రతిపాదించారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌ (ఐఐఎంఆర్‌), ఏపీపీసీ సంస్థలతో సెర్ప్‌ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.  ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. చిరుధాన్యాల్లోని పోషక విలువలను నేటి తరానికి చేరువ చేయడమే లక్ష్యమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement