సాక్షి, హైదరాబాద్: ప్రజల సొమ్ముకు, కేసుల్లో సీజ్ చేసిన వస్తువులకు రక్షణగా ఉండాల్సిన పోలీసే అక్రమాలకు పాల్పడడం జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న ఫోన్ నుంచి డబ్బులు బదిలీ చేయడంతోపాటు, అదే కేసులో సీజ్ చేసిన బంగారాన్ని తాకట్టుపెట్టాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రవణ్ ఈ వ్యవహారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ కేసులో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్ నుంచి రూ.1.70 లక్షలను తన బంధువుల ఖాతాలకు బదిలీ చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా, అదే కేసులో పోలీసులు సీజ్ చేసిన బంగారాన్ని కూడా కానిస్టేబుల్ శ్రవణ్ తాకట్టుపెట్టినట్లు వెలుగులోకి వచ్చింది.
విధుల్లో ఉండి బాధ్యతగా వ్యవహరించాల్సిన పోలీసే ఇలా చేయడంతో ఈ ఘటన పోలీసు వర్గాల్లో విస్మయం కలిగించింది. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ చేపట్టి, కానిస్టేబుల్ శ్రవణ్‌పై కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లుగా తెలుస్తోంది.
ఇదీ చదవండి: 10 గంటలు నిర్బంధించి.. చిత్రహింసలు


