ఓవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతూ వాయుగుండంగా మారుతోంది. మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో తుపాను ప్రభావం కొనసాగుతోంది. దీంతో వచ్చే రెండు, మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా వాతావరణం మారనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా సుమారు 13 రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అంచనాలు చెబుతున్నాయి. అయితే ఇదే సమయంలో మరో ఆందోళనకర పరిణామం తెరపైకి వచ్చింది. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో ప్రభావం బలపడుతుండటంతో రానున్న నెలల్లో భారత్‌లో వర్షపాతంపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న చర్చ మొదలైంది.
భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అక్టోబర్ 31 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు చేరనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోనూ అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ, మోస్తరు వర్షాలు పడవచ్చని అధికారులు అంచనా వేశారు. వీటితో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిసే సూచనలున్నాయి. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, కేరళ, తమిళనాడులోనూ కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.
ఎల్‌నినోతో భారత్‌కు ముప్పు?
ఇదిలా ఉంటే.. ఎల్‌నినో ప్రభావం బలపడుతుండటం భారత్‌కు ఆందోళన కలిగించే అంశంగా మారుతోంది. ఎల్‌నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలోని భూమధ్యరేఖ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం. ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ, వాతావరణ పరిస్థితులు, వర్షపాతంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా భారత్‌లో రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం పడే అవకాశం ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు భారత ఉపఖండంలో వర్షపాతం తగ్గే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఫలితంగా కొన్ని ప్రాంతాల్లో వర్షాభావం, వ్యవసాయానికి నీటి కొరత, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అయితే ఎల్‌నినో ఏర్పడిందంటే దేశమంతా కచ్చితంగా కరువు వస్తుందని అర్థం కాదు. దాని ప్రభావం ప్రాంతాన్ని బట్టి, ఇతర సముద్ర వాతావరణ పరిస్థితులను బట్టి మారుతుంటుంది.
91B UPDATE | NORTH TAMIL NADU & SOUTH ANDHRA COASTS UNDER WATCH The well-marked low-pressure area over the South Andaman Sea and adjoining Southeast Bay of Bengal is expected to intensify into a Depression while tracking westward to west-northwestward towards the West-Central Bay of Bengal. Track & Intensity: Both ECMWF EPS and GEFS ensembles indicate a broad west-northwestward movement towards the Andhra Pradesh coast. However, significant differences remain regarding the system's intensity and eventual track. The interaction between the Indo-Pacific subtropical ridge and an approaching mid-latitude westerly trough will be crucial in determining the system's movement. Weak steering currents could result in slower movement or temporary stalling near the coast. Moderate vertical wind shear, dry-air intrusion and poor low-to-mid-level organisation may initially restrict intensification. However, improving upper-level divergence, anticyclonic outflow and moisture convergence could support further strengthening over the West-Central Bay. A Deep Depression or stronger system cannot be ruled out, although confidence remains limited. Rainfall Outlook – Tamil Nadu: Rainfall activity is expected to increase across northern coastal Tamil Nadu from Sunday night (1 November) or early Monday (2 November) as the system approaches the western Bay. Chennai, Tiruvallur, Chengalpattu, Kancheepuram and adjoining northern coastal districts could experience increasing rain and thunderstorms, with moderate to heavy spells possible during 2–4 November. If the system slows or stalls close to the coast, persistent moisture convergence and rainbands could produce prolonged heavy rainfall, with isolated very heavy rainfall possible. Key Watch Point: The exact coastal approach, intensity and interaction with the westerly trough remain uncertain. A stronger northward track would shift the heaviest rainfall towards Andhra Pradesh, while a slower or more southerly track could significantly enhance rainfall over extreme northern Tamil Nadu, including Chennai. Overall: The first week of November remains an important Northeast Monsoon watch period for North Tamil Nadu and South Andhra Pradesh. The next 24–48 hours will be crucial for track and intensity confidence. #91B #NEM2026 #ChennaiRains #TamilNaduWeather #BayOfBengal
— Rainstorm - வானிலை பதிவுகள் (@RainStorm_TN) October 31, 2026
ఈశాన్య రుతుపవనాలపై ప్రభావం..
అమెరికా వాతావరణ సంస్థ NOAA అక్టోబర్ 8న విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఎల్‌నినో పరిస్థితులు వేగంగా బలపడుతున్నాయి. 2027 జనవరి–మార్చి మధ్య కూడా బలమైన లేదా అత్యంత బలమైన ఎల్‌నినో కొనసాగేందుకు 83 శాతానికి పైగా అవకాశాలున్నాయని అంచనా వేసింది. మరోవైపు ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) అక్టోబర్ 14న విడుదల చేసిన దక్షిణాసియా శీతాకాల వాతావరణ అంచనాల్లో.. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు భారత్‌లోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ఈశాన్య రుతుపవనాలపై ఆధారపడే దక్షిణాది రాష్ట్రాలపై ఈ ప్రభావం చూపనుంది.
ఈశాన్య రుతుపవనాల వల్ల ప్రధానంగా తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, రాయలసీమ, దక్షిణ కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. వీటిలో తమిళనాడుకు ఈ రుతుపవనాలు అత్యంత కీలకం. ఆ రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో వార్షిక వర్షపాతంలో దాదాపు 60 శాతం వరకు ఈ సీజన్‌లోనే నమోదవుతుంది. అయితే దక్షిణాది అంతటా ఒకే స్థాయిలో వర్షాలు కురవవు. కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ, మరికొన్ని చోట్ల తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: లండన్‌లో ఉన్నా అమ్మా.. కట్ చేస్తే పూణేలో మిస్టరీ డెత్.. ఆన్‌లైన్ ఆర్డర్లే అసలు క్లూ!


