చెంపలు వాచేలా కొట్టి.. గుండెలపై మోకాలితో తొక్కి! | Wife and husband incident in Eluru District | Sakshi
Sakshi News home page

చెంపలు వాచేలా కొట్టి.. గుండెలపై మోకాలితో తొక్కి!

Oct 31 2026 12:26 PM | Updated on Oct 31 2026 12:43 PM

Wife and husband incident in Eluru District

ఏలూరు జిల్లా: భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం చివరకు హత్యకు దారితీసిన విషాద సంఘటన నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం జంగారెడ్డిగూడేనికి చెందిన శివరాత్రి దుర్గాప్రసాద్, జ్యోతి దంపతులు బంధువుల ఇంట్లో వివాహ వేడుక కోసం వారం రోజుల క్రితం మీర్జాపురం వచ్చారు. 

ఈ నెల 28న వివాహం, 29న రిసెప్షన్‌ పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం కొందరు బంధువులు వెళ్లిపోగా, అనారోగ్యంతో ఉన్న మరొక బంధువును పరామర్శించేందుకు కుటుంబసభ్యులంతా వేరే ఊరు వెళ్లారు. దీంతో ఇంట్లో దుర్గాప్రసాద్, జ్యోతి మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో ఉదయం ఇద్దరి మధ్య ఏ విషయంపై మనస్పర్థలు వచ్చాయో తెలియదు కానీ తీవ్ర గొడవ జరిగింది. ఆవేశానికి గురైన దుర్గాప్రసాద్‌ భార్య జ్యోతి చెంపలపై బాదుతూ, మోకాలితో గుండెలపై దారుణంగా దాడి చేశాడు. 

ఆమె కేకలు విని కాపాడేందుకు చుట్టుపక్కల వారు పరుగెత్తుకొచ్చినప్పటికీ అతడు ఆగకుండా కొట్టడంతో జ్యోతి స్పృహతప్పి కిందపడిపోయింది. తీవ్రంగా గాయపడి కదలకుండా ఉన్న ఆమెను వెంటనే సమీపంలోని ఆర్‌ఎంపీ వైద్యుడి వద్దకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. స్థానికులు 112కు సమాచారం అందించడంతో నూజివీడు రూరల్‌ సీఐ ఐవీ నాగేంద్రకుమార్, రూరల్‌ ఎస్సై జి.జ్యోతీబసు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement