ఏలూరు పీఠంపై వైఎస్సార్‌సీపీ ధీమా | - | Sakshi
Sakshi News home page

ఏలూరు పీఠంపై వైఎస్సార్‌సీపీ ధీమా

Oct 31 2026 6:02 AM | Updated on Oct 31 2026 6:02 AM

● నగరంలో ముగిసిన ప్రచారం ● 62 డివిజన్లలో ఇంటింటా ఓట్ల అభ్యర్థన

ఏలూరు 19వ డివిజన్‌లో మేయర్‌ అభ్యర్థి జీఎంఆర్‌, కార్పొరేటర్‌ అభ్యర్థి రమేష్‌ ఎన్నికల ప్రచారంలో సమన్వయకర్త జయప్రకాష్‌

ఏలూరు 24వ డివిజన్‌లో భారీ ర్యాలీలో మేయర్‌ అభ్యర్థి జీఎంఆర్‌, కార్పొరేటర్‌ అభ్యర్థి సూర్యప్రకాష్‌, సమన్వయకర్త జేపీ

ఏలూరు టౌన్‌: ఏలూరు నగర మేయర్‌ పీఠాన్ని కై వసం చేసుకుంటామనే ధీమాతో వైఎస్సార్‌సీపీ నేతలు ఉన్నారు. వైఎస్సార్‌సీపీ బలపర్చిన మేయర్‌ అభ్యర్థి గంటా మోహనరావు (జీఎంఆర్‌) గెలుపు ఖాయమనే రీతిలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేశారు. ఇక 62 డివిజన్లలోనూ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులు టీడీపీ కూటమికి గట్టి పోటీ ఇస్తున్నారు. ఏలూరు జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు గెలుపు టీడీపీ నాయకులు, కార్యకర్తల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండటంతో ఏం జరుగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక 37, 38 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు ఓటమి భయంతో వైఎస్సార్‌సీపీ నాయకులు యక్కల నాని, అనిల్‌కుమార్‌పై దాడులకు తెగబడటం వారిలో భయానికి నిదర్శనం అని పలువురు అంటున్నారు.

హోరెత్తిన ప్రచారం : వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్‌ నాయకత్వంలో నగరంలోని మేయర్‌ అభ్యర్థి గంటా మోహనరావు, 62 డివిజన్లలోని కార్పొరేటర్‌ అభ్యర్థులు చివరి రోజు శుక్రవారం ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఇంటింటా తిరుగుతూ ఓటర్లతో మమేకం అవుతూ ఓట్లు అభ్యర్థించారు. వైఎస్సార్‌సీపీ విజ యం సాధిస్తేనే ఏలూరు నగరంలో అభివృద్ధి సాధ్యమనీ, ప్రజలు ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుందని ప్రజలకు వివరించారు. 24వ డివిజన్‌ అభ్యర్థి గేదెల సూర్యప్రకాష్‌తో భారీ ర్యాలీ చేపట్టగా, 30వ డివిజన్‌ అభ్యర్థి మందపాటి కిషోర్‌ ఆధ్వర్యంలో భారీ మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. 25వ డివిజన్‌ అభ్యర్థి భోగిశెట్టి పార్వతి, మేయర్‌ అభ్యర్థి జీఎంఆర్‌తో ఎన్నికల ప్రచారంలో సమన్వయకర్త జయప్రకాష్‌ పాల్గొన్నారు. 22వ డివిజన్‌ అభ్యర్థి గొల్ల సుమశ్రీ ఇంటింటా ప్రచారం చేశారు. 19వ డివిజన్‌ అభ్యర్థి దాసరి రమేష్‌, 62వ డివిజన్‌ అభ్యర్థి పల్లా రమణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో సమన్వయకర్త జేపీ పాల్గొని ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. 32వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి జక్కుల రవికుమార్‌ (బెనర్జీ) ఇంటింటా ప్రచారం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement