నూజివీడు: మున్సిపల్ ఎన్నికలలో భాగంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చైర్మన్ అభ్యర్థి కంచర్ల లవకుమార్, 36 వార్డులకు చెందిన కౌన్సిలర్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ నూజివీడులో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రతాప్ అప్పారావుతో పాటు చైర్మన్ అభ్యర్థి లవకుమార్, వార్డు అభ్యర్థులు ప్రచారం వాహనంపై ర్యాలీలో పాల్గొనగా స్థానిక వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కార్యాలయం ఉన్న ద్వారకా ఎస్టేట్ వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమైంది. ర్యాలీ పొడవునా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి లవకుమార్, వార్డు సభ్యులను గెలిపించాలని కార్యకర్తలు చేసిన నినాదాలతో పట్టణ పురవీధులు దద్దరిల్లా యి. ర్యాలీలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొనడంతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మంచి ఊపు వచ్చినట్లయ్యింది.
ఎకరా భూమి 99 పైసలకు.. బియ్యం మాత్రం రూ.100
నూజివీడులో అవినీతిరహిత నాణ్యమైన అభివృద్ధి వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. ర్యాలీ లో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా ప్రజల కష్టార్జితంతో చెల్లించిన టాక్స్‌లతో రోడ్లపై రోడ్లు వేయాల్సిన పనిఉండదన్నారు. ఎకరా భూమిని 99 పైసలకు ఇచ్చేస్తున్న రాష్ట్రంలో కిలో బియ్యం మాత్రం రూ.100 లకు చేరిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభు త్వం 28 నెలల కాలంలో నూతనంగా ఒక్క వితంతు, వృద్ధాప్య, దివ్యాంగ పింఛన్‌ను మంజూరు చేయలేదని, ఎన్నికలు వస్తుండటంతో దరఖాస్తుల స్వీకరణ పేరుతో డ్రామాలాడిందని దుయ్యబట్టారు. మహిళలకు నెలకు రూ.1,500, నిరుద్యో గులకు రూ.3 వేల భృతి చెల్లించలేదన్నారు. ఎన్నికల సమయంలో 130 హామీలిచ్చి వాటిని అమలు చేయకుండా తుంగలో తొక్కిన ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని ప్రజలు నిత్యం అష్టకష్టాలు పడుతున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు.
నూజివీడులో భారీ బైక్ ర్యాలీ


