పుర పోరుకు సర్వ సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

పుర పోరుకు సర్వ సన్నద్ధం

Oct 31 2026 6:02 AM | Updated on Oct 31 2026 6:02 AM

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 31 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పుర పోరులో తొలి అంకానికి సర్వం సన్నద్ధమైంది. రాజకీయ పార్టీల హోరాహోరీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెరపడింది. ఏలూరు జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థ, నూజివీడు, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలకు, పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం మున్సిపాలిటీ, ఆకివీడు నగర పంచాయతీలకు ఆదివారం ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో మద్యం విక్రయాలు నిలిపివేయడం, స్థానికేతరులను పంపించడం, పోలింగ్‌ కేంద్రాల వద్ద ఆది వారం సెక్షన్‌ 144 అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వడం, పోలింగ్‌ సిబ్బందికి విధులు కేటాయింపు, పోలీసులకు బందోబస్తు ఏర్పాట్లు ఇలా అన్నింటినీ ఆయా జిల్లాల అధికారులు పూర్తి చేశారు.

ఏలూరులో 62 డివిజన్లు, జంగారెడ్డిగూడెంలో 32 వార్డులు, నూజివీడులో 36 వార్డులు, నరసాపురంలో 36 వార్డులు, ఆకివీడులో 28 వార్డులో పోలింగ్‌ జరుగనుంది. ఈ మేరకు ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించి 3న కౌంటింగ్‌ జరిపేలా షెడ్యూల్‌ ప్రకించారు. శనివారం ఏలూరు జిల్లాలో రెండు మున్సిపాల్టీలు, ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల అధికారులకు పోలింగ్‌ సామగ్రిని అందచేసి పోలీస్‌ బందోబస్తు నడుమ పోలింగ్‌ కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం అన్ని పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశాల నేపథ్యంలో ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.

పట్టణం డివిజన్‌/ పోలింగ్‌

వార్డులు కేంద్రాలు

ఏలూరు 62 255

జంగారెడ్డిగూడెం 32 64

నూజివీడు 36 57

నరసాపురం 36 71

ఆకివీడు 28 32

ఏఐ సృష్టించిన చిత్రం

మైకులు మూగబోయాయ్‌

ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం

రేపు ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, నరసాపురం, ఆకివీడులో పోలింగ్‌

3న కౌంటింగ్‌

ఆయా ప్రాంతాల్లో మద్యం విక్రయాలు బంద్‌

నేడు పోలింగ్‌ సామగ్రి తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement