పోలింగ్‌కు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌కు సర్వం సిద్ధం

Oct 31 2026 6:02 AM | Updated on Oct 31 2026 6:02 AM

పోలింగ్‌కు సర్వం సిద్ధం

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో నగరపాలక, పురపాలక సంఘాల పోలింగ్‌ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకుడు ఎం.వెంకట శేషగిరిబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠాకు తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం కమిషనర్‌ పునేఠా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఏలూరు కలెక్టరేట్‌ నుంచి శేషగిరిబాబు మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అదనపు బలగాలతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. శనివారం ఉదయం నుంచి సిబ్బందికి పోలింగ్‌ మెటీరియల్‌ అందించి ఆయా కేంద్రాలకు తరలించే ప్రక్రియ చేపడతామన్నారు. కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, జేసీ ఎంజే అభిషేక్‌ గౌడ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సీహెచ్‌ శ్రావణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

కోడ్‌ తప్పనిసరి : ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అన్నారు. నగరపాలక, పురపాలక సంఘాల ఎన్నికల పోలింగ్‌ నిమిత్తం పోలింగ్‌ మెటీరియల్‌ సరఫరాపై అధికారులతో సమీక్షించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో భౌతిక తనిఖీలను శనివారం ఉదయం 10 గంటలలోపు పూర్తి చేసి లోపాలను సరిచేయాలన్నారు. నిరంతర విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement