నీతివంతమైన పాలన అందిస్తాం | - | Sakshi
Sakshi News home page

నీతివంతమైన పాలన అందిస్తాం

Oct 31 2026 6:02 AM | Updated on Oct 31 2026 6:02 AM

నీతివంతమైన పాలన అందిస్తాం

జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రమాణం

జంగారెడ్డిగూడెం(బుట్టాయగూడెం): తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నీతివంతమైన పాలన అందిస్తామంటూ జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ప్రమాణం చేశారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మచిలిపట్నం పార్లమెంట్‌ పరిశీలకుడు జెట్టి గురునాథరావు సమక్షంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి మేక సత్యవతితో పాటు 32 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులు ప్రమాణం చేశారు.

జవాబుదారీగా ఉంటాం

కంభం విజయరాజు, జెట్టి గురునాథరావు మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేస్తున్న చైర్‌పర్సన్‌ అభ్యర్థితో పాటు 32 మంది అభ్యర్థులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పారదర్శకమైన, నీతివంతమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. సమస్యలను చైర్‌పర్సన్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తాము కూడా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కౌన్సిలర్లు అంతా ప్రజలు ఫోన్‌ చేసినా తక్షణమే స్పందిస్తారని, ఏ సమస్య గురించి అయినా నిర్భయంగా చెప్పవచ్చన్నారు. తాము జవాబుదారీగా ఉంటూ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్‌లతో పనిచేయిస్తామన్నారు. అలా గే పట్టణంలో ప్రజల సమస్యలు పరిష్కారం కోసం వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు ఆధ్వర్యంలో టోల్‌ఫ్రీ నంబర్‌ కూడా అందుబాటులో ఉంచుతున్నట్టు గురునాథరావు తెలిపారు. తాను కూడా ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. పార్టీ పట్టణాధ్యక్షుడు కర్పూరం గవరయ్య గుప్త, యువ నాయకులు జెట్టి సత్య ఆదిత్య, బీవీఆర్‌ చౌదరి, ముప్పిడి శ్రీనివాసరావు, ముప్పిడి అంజి, నేకూరి కిషోర్‌, మేకా సింహాద్రి, చిటికెల అచ్యుతరామయ్య, వందనపు వెంకటేశ్వరరావు, వెంప ఐజీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement